Thursday 30 November 2017

పాఠోళి

ఇది తెలుగు వాళ్ళదే. ప్రాంతాన్ని బట్టి పేరు మారుతుంది.
Authentic version: కందిపప్పు నానబెట్టి సరిపడ ఎండుమిర్చి , ఇంగువ, జీలకఱ్ఱ, వుప్పు వేసి కచ్త్చపచ్చ రుబ్బి నూనెబాగా వేసి రుబ్బిన పిండిని వాయలు వాయలు గా బంగారు రంగు వచ్చి కరకర వాడు వరకు వేయిస్తారు. అన్నంలో ఆధరువుగా తింటారు.
Kamala’ recipe ( పాఠోలీ)
రుబ్బటం వరకు పై విధంగానే.
తరువాత పిండిని కుక్కర్ గిన్నె( నూనె రాసిన) లోఆవిరిమీద వుడికించి
చల్లారాక చిదిపి నూనె బాగా వేసి పోపు చేసి ( కరివేపాకు పచ్చిమిర్చిముక్కలు, వుల్లి ముక్కలు కూడా వేసి) చదివిన పప్పును బాగా వేయించాలి. ఇది పలహారంలాగా కూడా తినవచ్చు.

Wednesday 29 November 2017

పాలపొడి అటుకుల గులాబ్ జాం

పాలపొడి ఇంకా అటుకులు కలిపి గులాబ్ జాం

ఎప్పుడు చూసిన గులాబ్ జాం పొస్ట్స్ పెడుతుంది అనుకోకండి ఎందుకంటే అందరికి అన్ని రకాల వంటల గురించి తెలియాలి కదా.

తయారీ విధానం
ముందుగా 1కప్ అటుకులని కడిగి ఒక అరగంట పాటు పక్కనపెట్టుకోవాలి తరువాత దీనిలో అరకప్పు పాలపొడి వేసుకుని వంటసోడా వేసుకుని 2స్పూన్స్ పాలు వేసుకుని ముద్దలా కలుపుకుని ఉండలా చుట్టుకుని నూనేలో వేసుకుని బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుని తీసుకుని తరువాత పాకంలో వేసుకోవాలి.
అటుకుల ఫ్లేవర్ తెలియకుండా ఉండాలంటే పాకంలో ఇలాచి వేసుకోవాలి
ఇది ఎంత రుచిగా ఉంటుంది అంటే తింటూ ఉంటే తినాలి అనిపిస్తుంది
ఇందులో అటుకులు వేసాం కాబట్టి పాకాన్ని కూడా త్వరగానే పీల్చుకుంటుంది

చారుపొడి

చారుపొడి....
చారుపొడి చాలా రకాలుగా చేస్తారు నేను కర్ణాటక లో నేర్చుకున్నా చాలా రుచిగా పిల్లలు కూడా ఇష్టపడతారు తెలియని వారికోసం
ధనియాలు - 2కప్స్
మెరపకాయలు - 20
మెంతులు - 3 స్పూన్స్
జీలకర్ర - 3 స్పూన్స్
మిరియాలు - 2 స్పూన్స్
ఆవాలు - 1 స్పూన్ , ఇంగువ కొద్దిగా నూనే
మెరపకాయలు ఇంగువ కొద్దిగా నూనె లో వేయించుకోవాలి మిగిలినవి అన్నీ నూనె లేకుండా పొడిగా వేయించుకోవాలి చల్లారేక అన్నీ కలిపి మెత్తగా మిక్సీలో పొడి చేయాలి కర్వేపాకు కొద్దిగా కావాలంటే వేసుకోవచ్చు.

ఒక లీటరు నీళ్ళలో వుప్పు పసుపు చింతపండురసం, కర్వేపాకు ఒక స్పూన్ చారుపొడి వేసి బాగా మరగించి ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ మెరపకాయ వేసి పోపు వేసి దింపేయండి


Tuesday 28 November 2017

కందిపచ్చడి

కందిపచ్చడి.

రెసిపీ చాలా ఈజీ.

పది ఎండుమిరపకాయలు , కప్పు కందిపప్పు , అర స్పూను  జీలకర్ర  బాండీలో నూనె వేయకుండా కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకుని , చల్లారగానే ఈ వేయించినవి , మరియు సరిపడా ఉప్పువేసి వాటిని రోటిలో వేసి ,తగినన్ని నీళ్ళు చిలకరించుకుంటూ పొత్రముతో మెత్తగా  రుబ్బుకోవడమే .

చింతపండు , కరివేపాకు , పోపు  అన్నీ మీ ఇష్టమైన విధముగా  వేసుకోవచ్చును.

Monday 27 November 2017

బెంగళూరు వంకాయ పచ్చడి

బెంగుళూరు  వంకాయ తో  పచ్చడి .

కావలసినవి .

బెంగుళూరు  వంకాయలు -- రెండు
పచ్చి మిరపకాయలు  --  8
కొత్తిమీర   --  ఒక  కట్ట
పసుపు  --కొద్దిగా
ఉప్పు --  తగినంత
కరివేపాకు  --  రెండు రెమ్మలు.
చింతపండు  --  చిన్న నిమ్మకాయంత . కొద్ది నీటిలో  తడిపి  ఉంచుకోవాలి .

పోపునకు .

నూనె  --  నాలుగు  స్పూన్లు
ఎండుమిరపకాయలు  --  8
మెంతులు --  పావు స్పూను
మినపప్పు  --  స్పూనున్నర
జీలకర్ర  --  పావు స్పూను
ఆవాలు  --  అర  స్పూను
ఇంగువ  --  కొద్దిగా .

తయారీ విధానము .

ముందుగా   బెంగుళూరు  వంకాయలు  కడిగి  చెక్కు  తీసి   ముక్కలుగా  తరుగు  కోవాలి .

స్టౌ  మీద  బాండీ  పెట్టి  రెండు  స్పూన్లు  నూనె  వేసి  నూనె  బాగా కాగగానే   తరిగిన  వంకాయ  ముక్కలు , పచ్చిమిర్చి , కొద్దిగా  పసుపు , కొద్దిగా  ఉప్పు వేసి  మూత పెట్టి  ముక్కలను  బాగా  మగ్గనిచ్చి  దింపి  వేరే  ప్లేటు లోకి  తీసుకోవాలి .

ఇప్పుడు  మళ్ళీ  స్టౌ  మీద  బాండీ  పెట్టి  రెండు  స్పూన్లు  నూనె  వేసి  నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు , మెంతులు , మినపప్పు  , జీలకర్ర , ఆవాలు , ఇంగువ  మరియు కరివేపాకు వేసి  పోపు  వేగగానే  దింపు కోవాలి .

పోపు చల్లారగానే  ముందుగా   రోటిలో  ఎండుమిరపకాయలు  , చింతపండు  మరియు  ఉప్పు వేసి  మెత్తగా పచ్చడి బండతో దంపుకోవాలి .

తర్వాత బెంగుళూరు వంకాయ ముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు  కూడా వేసి మరోసారి  మెత్తగా  బండతో నూరుకోవాలి .

చివరలో  మిగిలిన  పోపు  మరియు  కొత్తిమీర  వేసి   ఒకే ఒకసారి నూరుకుని  వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .

అంతే . ఎంతో  రుచిగా  ఉండే  బెంగుళూరు  వంకాయలతో  రోటి పచ్చడి సర్వింగ్  కు సిద్ధం. ఈ పచ్చడి  చపాతీలు , దోశెలు  మరియు  అన్నం లోకి  రుచిగా ఉంటుంది.

Thursday 23 November 2017

వెజ్ రోల్స్

క్యాబేజ్ హాఫ్ ,
క్యారట్ 1,
బీన్స్ 6, (or ఉల్లి కాడలు)
క్యాప్సికమ్ 2 పెద్దవి,
ఆనియన్స్ పెద్దవి 2,
ఇవన్నీ సన్నగా పొడవు గా (3ఇంచులు) ఉండేలా క్యూట్ చేసుకోవాలి.....
అల్లం ,వెల్లుల్లి సన్నగా తరగాలి
3,4 స్పూన్స్ కార్న్ ఫ్లోర్
రెడ్ చిల్లీ సాస్ , సోయా సాస్, (టొమాటో సాస్ ఇది ఛాయిస్ కొంచెం స్వీట్ అవుతుంది), వెనిగర్ అన్ని ఒక్కో స్పూన్
మిరియాల పొడి ఒక స్పూన్
సాల్ట్ తగినంత...
మూకుడు పెట్టుకొని 2స్పూన్స్ oil వేసి  అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి.....ఉల్లి ముక్కలు కూడా వేసి కొంచెం వేగాక అన్ని కూర ముక్కలు వేసుకొని ఒకసారి కలిపి, అన్ని సాస్ లు సాల్ట్ మిరియాల పొడి వెస్కొని కొద్ది సేపు కలిపి స్టౌ ఆఫ్ చేయాలి.. కూర ముక్కలు ఉడికి పోకూడదు...కొంచెం పచ్చి గానే ఉండాలి...పైన కార్న్ ఫ్లోర్ చల్లి కలుపుకుంటే నీరు వచ్చిన ఫ్లోర్ తీసుకుంటుంది..చల్లారనివ్వాలి....
ఈలోగా..
కప్ మైదా, సగం కప్ కార్న్ ఫ్లోర్,ఉప్పు,  కొంచెం నిమ్మరసం, oil నీళ్ళు వేసి చపాతి పిండి కంటే కొంచెం లూజ్ కలుపు కొని మూత పెట్టి ఒక అరగంట నాననివ్వాలి.
తరువాత ఉసిరికాయ అంత పిండి తీస్కొని పల్చగా వత్తుకోవాలి...వీలైనంత పల్చగా..
దాని మీద ఒక పక్కగా కూర పెట్టీ రెండు వైపులా మూసి చాపలా  కూర తో  సహా చుట్టుకొని ఇంకో చివర నీళ్ళ తో కొంచెం తడిపి అంటించేయాలి..అన్ని చేసుకొని కొంచెం తడి ఆరాక మీడియం మంట మీద మెల్లిగా వేయించాలి..తీసి paper మీద వేసుకుంటే నూనె పీల్చుకుంటుంది..👍👍👍👍

Tuesday 21 November 2017

వరిపిండి చెకోడీలు

తయారు చేసే విధానం
చాలా సింపుల్
వరిపిండి ముందు ఉడకపెట్టాలి.
దాన్లో కి పచ్చిమిర్చి పేస్ట్ ఛాయ పెసరప్పప్పు
తగింతగా వేసి పిండిలో కలుపు కుని
మీకు ఇష్టమైన సేఫ్ లో చేసుకుని
నూనెలో వేపుకోవాలి
రొస్టుగా వేయిస్తే కర్ కర్ గా బాగుంటుంది.

పచ్చి మిరపకాయల కారం

కావలసినవి .

పచ్చి మిరపకాయలు  --  100  గ్రాములు .
చింతపండు  --  నిమ్మకాయంత
పదినిముషాలు  తడిపి  ఉంచుకోవాలి .
కొత్తిమీర  --  ఒక  కట్ట  బాగు చేసుకోవాలి .
ఉప్పు  -- తగినంత

పోపుకు .

నూనె  --  అయిదు  స్పూన్లు .
ఎండుమిరపకాయలు  --  4  ముక్కలు గా  చేసుకోవాలి
మెంతులు  --  పావు  స్పూను
మినపప్పు  --  స్పూను
ఆవాలు  --  అర స్పూను
ఇంగువ  --  కొద్దిగా
బెల్లం  --  చిన్న ముక్క. కారం తగ్గుతుంది .
ఇష్టపడని వారు మానేయవచ్చును.
కరివేపాకు  --  రెండు  రెమ్మలు .
పసుపు  --  కొద్దిగా

తయారీ విధానము .

ముందుగా  పచ్చిమిరపకాయలు  తొడిమలు  తీసుకోవాలి .

స్టౌ  మీద  బాండి  పెట్టి రెండు  స్పూన్లు  నూనె వేసి  నూనె బాగా కాగగానే   పావు స్పూను   మెంతులు  వేసి  వేయించుకుని  విడిగా  పెట్టుకోవాలి .

ఆ తర్వాత  అదే  బాండీలో  పచ్చిమిరపకాయలు  వేసి  మూత పెట్టి  మగ్గనివ్వాలి .

తర్వాత  మళ్ళీ  బాండీ  పెట్టి  మూడు   స్పూన్లు  నూనె వేసి  వరుసగా ఎండుమిరపకాయలు , మినపప్పు , ఆవాలు , ఇంగువ మరియు  కరివేపాకు  వేసి  వేయించుకుని  పక్కన  పెట్టుకోవాలి .

ఇప్పుడు  రోటిలో లో  ఒకసారి  వేయించిన  మెంతులు వేసుకుని  మెత్తగా  పచ్చడి బండతో నూరుకోవాలి .

ఆ తర్వాత  మగ్గపెట్టిన  పచ్చిమిర్చి , చింతపండు , కొద్దిగా  పసుపు, చిన్న బెల్లం  ముక్క  మరియు సరిపడా ఉప్పు వేసి  మెత్తగా  బండతో దంపుకుని నూరుకోవాలి.

ఆ తర్వాత  శుభ్రం చేసిన  కొత్తిమీర  వేసి   బండతో నూరుకోవాలి..

తర్వాత ఒక  గిన్నెలో కి  తీసుకోవాలి .

తర్వాత  ఫోటోలో  చూపిన విధంగా  పైన  పోపు  వేసుకుని  పచ్చడిలో  స్పూను తో కలుపుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  పచ్చిమిరపకాయల  కారం  రెడీ .

ఈ పచ్చడి నాలుగు  రోజులు  నిల్వ ఉంటుంది.

ఇడ్లీ, దోశెలు , గారెలు , చపాతీలు మరియు భోజనము  లోకి చాలా రుచిగా  ఉంటుంది .

రైలుబండి ఫలహారం

రైలు బండి ఫలహారం (పేరు చూసి నవ్వకండి)
తయారీ విధానం
ముందుగ బియ్యంపిండిలో ఉప్పు వేడినీరు వేసుకుని కలుపుకుని చిన్న చిన్న ఉండ్రాల్లు చుట్టుకోవాలి తరువాత వీటిని ఒక చిల్లుల గిన్నెలో వేసుకుని ఆ చిల్లుల గిన్నెను కుక్కర్ లో పెట్టుకుని 15నిమిషాల పాటు మగ్గించుకోవాలి.
తరువాత ఇంకో కడాయిలో పొపు వేసుకుని ఉల్లి ముక్కలు వేసుకుని నానపెట్టుకుని కచ్చాపచ్చాగ గ్రైండ్ చేసుకున్న పప్పుల మిశ్రమం (పెసరపప్పు శనగపప్పు 2గంటల ముంధు నానపెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి) వేసుకుని ఈ పప్పుల మిశ్రమమంతా క్రిస్పిగా అయ్యేంతవరకు వేయించి ఉప్పు కారం  వేసుకుని వేగాక ఉడికించుకున్న ఉండ్రాల్లు ఇందులో వేసుకుని బాగా కలుపుకుని కొత్తిమీర వేసి దించుకోవాలి.

అటుకుల ఇడ్లీ

అటుకుల ఇడ్లీ ఈ మన సంఘంలోనే నేర్చుకున్నాను.. ఎవరు చెప్పారో గుర్తు లేదు.

1. కప్పు అటుకులు.. పెరుగులో నానపెట్టాలి.
2. కప్పు ఇడ్లీ రవ్వ కూడా పెరుగులో నాన పెట్టాలి.
3. రెండూ విడివిడిగా నానపెట్టాలి.
4. అరగంట నానిన తర్వాత అటుకులను మిక్సీ లో మెత్తగా రుబ్బుకోవాలి.
5. ఆ అటుకుల పిండిలో పెరుగులో నానిన ఇడ్లీ రవ్వ కలపాలి.
6. పావు గ్లాస్ బొంబాయి రవ్వ కూడా కలిపి.. ఉప్పు కలపాలి.
7. కొద్దిగా వంటసోడా కలిపి..ఇడ్లీ ప్లేట్ లో వేసుకుని.. మామూలు ఇడ్లీ లాగానే ఉడకపెట్టాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు కలుపుకోవచ్చు.

Monday 20 November 2017

ఉసిరి కాయ పచ్చడి

Usiri kayalu -  1 kg
Red mirchi powder       1/4 kg
Salt   -  1/4 kg
Mustard seeds                  100 gms (make it into fine powder) 
Fenugreek seeds -  2 tbsp
Fresh lemon juice  - 1/4 cup
Turmeric powder  
Oil  -  100 gms

Wash amla and dry  them on kitchen towel.
Put some scars on it with knife.
Take into wide bowl and
Mix salt, mustard powder, feenugreek seeds, red chilli powder and turmeric powder to  amla and mix well with dry spoon.
Finally add fresh lemon juice and mix well

Sunday 19 November 2017

టమోటా పచ్చడి

4 దోర టమాటాలు ముక్కలు చేసి, పండ్రెండు పచ్చిమిర్చి తొడిమలు తీసి నిలువుగా పొట్ట చీల్చి పెట్టా. కొంచెం చింతపండు తీసుకుని పీచులు, విత్తనాలు తీసేసి కడిగి పెట్టా. బాణలిలో నూనె వేడి చేసి ఒక చెంచా జిలకర,ఒక చెంచాడు ధనియాలు, పావు చెంచాడు మెంతులు, రెండు ఎండు మిర్చి తొడిమలు తీసి తునకలు చేసి వేసి వేగాక పచ్చిమిర్చి వేసి కాసేపు వేపి, టమాటా ముక్కలు, పసుపు తగిన ఉప్పు వేసి బాగా కలిపి సన్నమంట మీద కాసేపు మగ్గించి మంట కట్టేసి చల్లారాక రోట్లో వేసి రోకలితో బాగా దంచి మెత్తగా నూరుకుని పోపెడితే కమ్మటి టమోటా పచ్చడి సిద్దం. పొంగలి ఉడికి వేడిగా సిద్ధంగా ఉంది. టమాటా పచ్చడి కూడా సిద్ధం. నేనూ జయశ్రీ నెయ్యి గిన్నెతో తినడానికి సిద్ధం.

నిమ్మకాయ పచ్చడి

చాలా సులువు అమ్మా! ముందు మంచి రసం ఉన్న నిమ్మకాయలను రసం పిండి ఉంచుకోవాలి, గింజలు లేకుండా. అందులోకి తగ్గ ఉప్పు, కారం గుండ, పసుపు వేసి కలుపుకోవాలి. కారం ఎక్కువగా వెయ్యాలి అమ్మా. ఎందుకంటే పులుపు విరగదు. మూకుడులో నూనె బాగా మరిగించి,(నూనె బాగా పడుతుంది) అందులో, పెద్ద తెల్ల ఇంగువ ముక్క వేసి, ఆవాలు, జీలకర్ర,, ఎండు మిర్చి ముక్కలు గా చేసి, ఇష్టం ఉన్నవారు పఛ్చిమిర్చి కూడా గుండలా తరిగి పోపులో వెయ్యాలి. ఈ పోపు తో ఉన్న నూనె బాగా చల్లారాక(గోరు వెచ్చగా), ఆ కారం కలిపిన నిమ్మ రసంతో కలపడమే. చేసిన రోజు కాకుండా ఒక రోజు ఆగి తింటే, బాగా ఊరుతుంది. రుచిగా ఉంటుంది. ఇంగువ ముక్క పాళంగా వేస్తే, ఆ సువాసన తో రుచి మధురంగా ఉంటుంది. వేయించిన పప్పులోకి కూడా చాలా బాగుంటుంది.

సున్నుండలు

ఒక పావు మినపప్పు ‌కి ఒక పెద్ద స్పూన్ బియ్యం కూడా వేశా గ్లాసున్నర బెల్లం అన్నింటి కన్నా ఇంట్లో నెయ్యి వల్లనే రుచి అండి సంధ్య గారు

Friday 17 November 2017

బంగాళదుంపలతో జంతికలు

Bhangaladhumpa janthikalu (aloo janthikalu):-
Bhangaladhumpalu -1/2kg
Bhiyyampindi -3/4kg
Nuvvulu -150grams
Jeelakarra -1spoon
Pasupu -chitikedu
Salt -ruchiki saripada
Oil deepfry kosam
Dhumpalni kadigi vudakapetti thokkatheesi paste chesukovali (mixer or grinderlo) Pasupu Nuvvulu vuppu jeelakarra vesi kalipi Bhiyyampindi ni kaluputhu muddhala chesukovali. Dhumpala paste ki pindi pattinantha kalupukovali kolathalu emi vundavu anchana gha cheppenu Mundhuga ready chesukodaniki. Kalipina muddhanu janthikala ghottam lo vesi kaaghina nuney lo janthikalu vesi veyinchukovali. Evi lite golden brown colour lo ki raaganey theeseyyali. Mari ekkuva vegina chiruchedhuga vuntai.

అప్పడాల పిండి

పెసరపప్పూ..అందులో సగం కొలత మినప్పప్పూ కొద్దిగా ఎండ చూపించి మిక్సీ పట్టుకోవాలండీ..ఆ తర్వాత మన ఇష్టప్రకారం అంటే మనమెంత కారం తినగలమో అంత ఎండుమిరపకారం ..ఉప్పూ..కొద్దిగా నీటిలో కరిగించిన ఇంగువ కలిపిముద్ద చేసుకుని..నూనె వేస్తూ రోట్లో దంచాలి..ఆ తర్వాత వుండలు చుట్టుకుంటే నోరూరించే అప్పడాలపిండి రెడీ..రెండ్రోజులు హ్యాపీగా నిలవుంటుంది.

Thursday 16 November 2017

కొబ్బరి పచ్చడి

కొబ్బరి పచ్చడి .

కావలసినవి .

కొబ్బరి కాయ  -  1  కాయను  పగుల గొట్టి  రెండు  చిప్పలు  పచ్చి  కొబ్బరి  కోరాముతో  తురుము కోవలెను .

ఎండుమిరపకాయలు  --  8
పచ్చిమిరపకాయలు  --   5
చింతపండు   --  ఉసిరి కాయంత .  విడదీసుకుని  నీటితో  తడిపి  ఉంచుకోవలెను.
పసుపు  --  కొద్దిగా
ఉప్పు  --  తగినంత
బెల్లం  --  చిన్న  ముక్క  ఇష్టం  లేని వారు  మానేయ వచ్చును .

పోపునకు  -- 

నూనె  --   మూడు స్పూన్లు
మినపప్పు  --  స్పూను
మెంతులు  --  పావు  స్పూను
ఆవాలు  --  అర స్పూను 
ఇంగువ  --  కొద్దిగా .

తయారీ   విధానము .

కొబ్బరి   కోరాముతో  కోరుకుని  సిద్ధంగా   ఉంచుకోవాలి .

దాని పైన  కొద్దిగా  పసుపు  వేయండి .

ఇప్పుడు  స్టౌ మీద బాండీ పెట్టి  మూడు స్పూన్లు   నూనె వేసి  నూనె  బాగా కాగగానే   వరుసగా  ఎండుమిరపకాయలు , మెంతులు , మినపప్పు , ఆవాలు , ఇంగువ  వేసి  పోపు  వేగగానే  తొడిమలు  తీసిన  పచ్చిమిర్చి  కూడా వేసి  ఒక  నిముషం  ఉంచి   దింపుకోవాలి .

ఇప్పుడు  రోటి లో  ఎండుమిర్చి ,  పచ్చిమిర్చి  , తడిపిన చింతపండు  , చిన్న బెల్లం  ముక్క మరియు తగినంత  ఉప్పు వేసి  మెత్తగా పచ్చడి బండతో దంపుకోవాలి.

తర్వాత  పచ్చి  కొబ్బరి తురుము  కూడా వేసుకుని  కొద్దిగా  నీళ్ళు చిలకరించుకుంటూ  పొత్రముతో మెత్తగా  రుబ్బుకోవాలి.

చివరగా  పోపు కూడా  పచ్చడిలో  వేసుకుని   పోపు  మరీ  నలగకుండా  ఒకసారి  రుబ్బుకుని  తర్వాత  వేరే  గిన్నెలో కి  తీసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  కొబ్బరి  పచ్చడి  భోజనము   లోకే  కాకుండా  దోశెలు , పూరీలు  మరియు  చపాతీలలోకి  కూడా  చాలా బాగుంటుంది .

Saturday 11 November 2017

దబ్బకాయ పచ్చడి.

నిమ్మకాయ పచ్చడి లాగా నే ఐతేకొన్నికాయలురసంపిండితే పచ్చడి బాగుంటుంది. ముందుగా చిన్నసైజు ముక్కలు కట్ చేసి తాగినంత ఉప్పు పసుపు వేసి మూడు రోజుల పాటు ఊరినివ్వాలి. తరువాతకారం, మెంతి పిండి కలిపి చేయాలి. ఈపచ్చడి వారం పదిరోజులు ఊరితే బాగుంటుంది. కావలసినపప్పుడల్లా కొంచెం పచ్చడి వేరేగిన్నేలోకి తీసి కొంచెం నూనెలో ఆవాలు ఇంగువా వేసి తిరగ మోతపెట్టుకుంటేసరి.

అసలు, గులాబీ పార్టీ కి ఏమైంది

వీళ్ళ కు ఏమైంది...!

(నిజాములు గొప్పోళ్లు,
వారి కుటుంబాలకు రిజర్వేషన్లు. TRS)

అసలు, నిజాముల పాలనలో నష్టపోయినదెవరు?

హత్యలకు గరియైనది ఎవరు?

అపహరించబడిన ఆడపిల్లలు ఎవరు? 
  
ఎవరి ప్రార్థ నా స్థలాలు,మందిరాలు కూల్చివేశారు? 

తెలంగాణా లోని భూములన్నీ మావే అని ప్రకటించి రైతులందరినీ కౌలుదారులుగా ప్రకటిస్తే మఖ్త(కౌలు) కట్టలేక నష్టపోయినదెవరు?

బలాత్కరించబడిన స్త్రీ లు ఎవరు?

- స్థానికులు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారని ఇరాన్ నుండి ఇరాక్ దుబయ్ ...నుండి తమ మతం వారిని పిలిపించి దాడులు చేస్తే, అమరులైన వారెవ్వరు?

- స్థానికులు పండుగలు చేసుకోవద్దని ఫత్వా జారీ చేస్తే, ఆ ఫత్వాను పాటించలేదని హత్యలకు గురైనవారెవ్వరు?

-బతుకమ్శ లాడబోయిన ఆడబిడ్డల బట్టలూడదీసి బతుకమ్మలాడిస్తే.. ఆవమాన భారంతో ఆత్మహత్యలుచేసుకున్న వారెవ్వరు?

- హైదరాబాదంటూ, ఆదిలాబాదంటూ, నిజామాబాదంటూ,మహబూబ్ నగర్, మహబూబాబాదంటూ గ్రామాలు, నగరాలపేర్లు మారిస్తే, అంతకు ముందున్న పేర్లెవ్వరివి?

- తెలంగాణాలో స్కూళ్లన్నీ మూసేస్తే, ఆంధ్రా ప్రాంతం కంటే ఎక్కువగా నిరక్షరాస్యులైన వారెవ్వరు?

హిందువులు.

పోరాటం చేసి స్వాతంత్ర్యం తెచ్చుకున్న దెవరు?

అడవులపై ఆదిపత్యం మాదే,నీటిపై ఆదిపత్యం మాదే, భూమి పై ఆదిపత్యం మాదే అంటే.. 'జల్, జంగల్, జమీన్ మావనాటే-మావరాజ్యే' అంటూ నిజాములకు నీళ్ళు త్రాగించిన కొమురం భీం, రాంజీగోండ్  లాంటి వీరాధి వీరులెవ్వరు?

-  "మొదుగుపూలు"పుస్తకం వ్రాసి జైలు పాలైన -దాశరథి"ఎవరు?

- చాకలి ఐలమ్మ ఎవరు?

- కొమురవెల్లి దేవుడు కోరమీసం మల్లారెడ్డి ఎవరు?

- దొడ్డి కొమురయ్య ఎవరు?

-నిజాం పై బాంబులు కురిపించిన నారాయణ రావ్ పవార్
వంటి చరితార్థులు, కారణజన్ములు ఎవరు? ఎవరు?
- వారందరు, హిందువులు..

ఇంకా రజాకార్ల మనస్తత్వం వదులుకోని వాళ్లున్నారు...!
వాల్లకు సహకరించే ప్రభుత్వాలు పుడుతున్నాయి....
- మన సంఖ్య తగ్గించి మనదేశంలో మనమే అల్ప సంఖ్యాకులయ్యే దురదృష్టం దాపురించ బోతున్నందున అనివార్యం ఈ పోరాటం. అస్థిత్వం కోసం పోరాటం
- ధ్వంసంచేయబడుతున్న హిందూజాతి, తన రక్షణ కై వేస్తున్న పొలికేక " హైందవ తెలంగాణ"

* ఈపోరాటం రజాకార్ల భావజాల రహిత తెలంగాణకోసం,
* నిజాం పథగాముల రహిత తెలంగాణ కోసం...
-ఇది "ప్రజాస్వామ్య" -" హైందవ తెలంగాణ" కోసం.
-  హిందువులు ప్రాణాలు కాపాడుకోవడం కోసం
- మన అస్తిత్వం కోసం.
- కోల్పోయిన మన గౌరవంకోసం,
-పడిపోయిన ఆలయాలకోసం.
- పేదరికం లోఉన్న నా తెలంగాణలోని అణగారిన, తాడిత, పీడిత, దళిత, పేద వర్గాల అభ్యున్నతి కోసం
- దోపిడి లేని సమాజం కోసం,
- భయంలేని సమాజంకోసం...
- సమతాయుక్త సమాజంకోసం...
-శాంతిపూర్ణమైన హిందూరాజ్య స్థాపనకోసం జరుగుతున్న "ప్రజాస్వామ్య బద్దమైన" పోరాటంలో పాల్గొనే వారందరు.. చరితార్థులు, కారణజన్ములు.

Sunday 5 November 2017

అరటికాయ కబాబ్స్

Get together with friends at my place on Saturday night-

నేను  చేసిన వంటలు

అరటికాయ కబాబ్స్
రైసెబాల్ మంచూరియన్

తోటకూర ములక్కాడ పప్పు పులుసు
బగారా బైంగన్ (మసాలా వంకాయ కూర )
lotus stem dry bhaji ( తామర పువ్వు కాడలు తో చేసిన కూర )
aloo chole ( శనగల తో కర్రీ )
మజ్జిగ పులుసు
గడ్డ పెరుగు (బాగా తోడుకుందని ఫ్రెండ్స్ పొగడ్తలు. ఇక్కడ చలి కి  పెరుగు తొందరగా తోడుకోదు కదా)

tomatillo chutney ( మెక్సికన్ టొమాటోలు గ్రీన్ కలర్ లో  దొరుకుతాయి ఇక్కడ, వాటితో చేసిన చట్నీ). చాలా పుల్ల పుల్లగా బావుంటుంది ఈ టొమాటో తో చేస్తే చట్నీ.

మామిడికాయ ముక్కల పచ్చడి  ( గొడ్డు కారం వుంది పచ్చడి 😪, ఏదో కారం లో తేడా. నోరు మండి పోయింది నాకు. కానీ ఫ్రెండ్స్ మాత్రం చాలా బావుంది అంటూ తినేశారు. ఆంధ్రా అమ్మాయిని, అది కూడా  గుంటూరు జిల్లా పిల్లని, నాకన్నా ఈ మహారాష్ట్ర వాళ్లు ఇంత కారం ఎలా తింటున్నారబ్బా 🤔)

తోటకూర పప్పు ఏంటమ్మా అంది మా అమ్మాయి, వచ్చే వాళ్లు  నార్త్ ఇండియన్స్ వాళ్ళకి మన తెలుగు వంటలు తెలియచేయాలనే  అది వండాను. తెగ నచ్చింది వాళ్ళకి . అన్ని ఐటమ్స్ బావున్నాయని ఊది పారేశారు ఫ్రెండ్స్ , ఒక్క మజ్జిగ పులుసు తప్ప . అది ఒక్కటే ఏం పాపం చేసుకుందో మిగిలి పోయింది. (రక్షించారు ఈరోజు కి అదే మాకు దిక్కు, ఇంక వండే ఓపిక లేదు ఈరోజు) మిగతా వన్నీ ఫ్రెండ్స్ అందరూ డబ్బాల్లో సర్దుకుని తీసుకు వెళ్లిపోయారు. విచిత్రం ఏంటంటే డబ్బాలు వాళ్ల ఇంటి నించీ ముందే తెచ్చుకున్నారు 😂😂. వండిన వాళ్ళకి నలుగురూ మెచ్చుకుని తింటేనే కదండీ తృప్తి. శ్రమ ది ఏముంది రోజూ చేస్తామా ఇలా?

sweets ఫ్రెండ్స్ తీసుకు వచ్చారు. మా పెద్దమ్మాయి birthday మొన్న గురువారం, అందుకునే నిన్న ఫ్రెండ్స్ తో cake cutting చేయించేసాము.
ఇలా ముగిసింది అండీ ఈ వారం.😊

Saturday 4 November 2017

నిమ్మకాయ కారం

ఆలూరుకృష్ణప్రసాదు .

నిమ్మకాయ కారం.

కావలసినవి .

ఎండుమిరపకాయలు  -- పది
నిమ్మకాయలు  --  4
పొట్టు మినపప్పు --  40  గ్రాములు
మెంతులు  --   మూడు  స్పూన్లు
ఆవాలు  --  పావు  స్పూను
పసుపు  --  కొద్దిగా
ఇంగువ --  మరి  కాస్త 
జీలకర్ర  --  పావు  స్పూను
నూనె  --  మూడు  స్పూన్లు
ఉప్పు  --  తగినంత

తయారీ  విధానము .

ముందు  నిమ్మకాయలు  అడ్డంగా  కోసుకొని  ఒక  గిన్నెలో  రసము  తీసుకోవాలి.

స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్లు   నూనె  వేసి ,  నూనె  కాగగానే   ముందుగా   మెంతులు, పొట్టు మినపప్పు  ,   ఎండుమిరపకాయలు  వేసి కమ్మని  వాసన  వచ్చే దాకా  వేయించుకోవాలి.

ఆ తర్వాత  జీలకర్ర , ఇంగువ , వేసి  వేగాక  దింపి  దానిపై  కొద్దిగా  పసుపు   వేసుకోవాలి.  

చల్లారగానే  రోటిలో  వేగిన  పోపు , తగినంత   ఉప్పు  వేసి  పప్పులు  తగిలే విధంగా  పచ్చడి బండతో దంపుకోవాలి .

తర్వాత  ఈ మిశ్రమాన్ని   గిన్నెలో  తీసిన  నిమ్మరసం   తో  కలిపాలి.

స్పూను  తో  బాగా  కలుపుకోవాలి .

ఈ  నిమ్మకాయ  కారం  గట్టిగా   ఉంటే   బాగుంటుంది .

పల్చగా   కావాలను కునే  వారు  మరో కాయ  నిమ్మరసం   పిండుకోండి.

ఈ  నిమ్మకాయ  కారం  రోటి  వసతి  ఉన్నవారు  రోటిలో  రోకలితో  దంపుకుని  చేసుకుంటే  అద్భుతంగా  ఉంటుంది .

ఈ  కారం  అన్నం  లోకి , ఇడ్లీల లోకి , దోశెల లోకి , దిబ్బ రొట్టె   లోకి  కూడా  చాలా  బాగుంటుంది .