1) పన్నీర్..
పాలు చిక్కగా వుంటే పన్నీర్ ఎక్కువ వస్తుంది. ఫుల్ క్రీమ్ మిల్క్ వాడితే బాగుంటుంది.
మరో చిట్కా.. స్కిమ్డ్ మిల్క్ అయితే పాలు మరుగుతూండగా అముల్ క్రీమ్ కలుపవచ్చు.
పాలు మరుగుతూండగా కొంచెం నీరు కలిపిన నిమ్మరసం కొద్ది ,కొద్దిగా కలిపి కలయపెడుతూ వుండాలి.
డైరెక్ట్ నిమ్మరసం అంత స్ట్రాంగ్ అవసరం లేదు.
లేదా పుల్ల మజ్జిగ వాడచ్చు. వెనిగర్.. కెమికల్. నాకిష్టం లేదు. సిట్రిక్ యాసిడ్ లో నీళ్ళు కలిపి వాడచ్చు.
పూర్తిగా విరిగిన తర్వాత స్ట్రైనర్ లో బట్ట వేసి వడకట్టాలి.నీరంతా పిండి ,చల్లటి నీళ్ళతో 2,3 సార్లు కడగాలి.
అప్పుడు నిమ్మకాయ పులుపు, వాసన పోతుంది.
మళ్ళీ గట్టిగా పిండి, చదునుగాచేసి మూటగట్టి పైన బరువు పెట్టాలి.నేను మార్బుల్ చపాతీ పీట పెడతాను.
ఒక గంట వదిలేయాలి. గట్టిగా, షేప్ గా వస్తుంది. ఇప్పుడు కత్తితో ముక్కలు కోసుకోవాలి.
ఫ్రిజ్ లో గిన్నెలో నీళ్ళు పోసి వుంచితే 2 వారాలపైనే బావుంటుంది. నొక్కిచూస్తే స్పాంజ్ లా వుంటుంది.
ఒకటి, రెండు సార్లు చేస్తే...అదే వస్తుంది.
అదేం బ్రహ్మవిద్యా..
........
పనీర్ బటర్ మసాలా..
మనం చేసుకున్న నార్త్ ఇండియన్ మదర్ సాస్ వుందిగా.
ఒక ఉల్లిపాయ ,ఒక వెల్లుల్లి గర్భం సన్నగా తరిగి .. నూనెలో వేయించి ,మనం చేసుకున్న మదర్ సాస్ 2, 3 గరిటలు (2, 3 స్పూన్స్ కాదు) వేసి కొద్దిగా వేగనిచ్చి, కావలసిన నీరు పోసి వుడకనివ్వాలి.
మీకు కావలసిన చిక్కదనం వచ్చాక, పన్నీర్ ముక్కలు వేసి కొద్ది సేపు ఉడకనిచ్చి ,చివరగా కసూరి మెంతి నలిపి వేసి స్టౌ కట్టేయాలి.కొత్తిమీర మీ ఇష్టం.
###
మాంగో శ్రీఖండ్..
చిక్కటి ఒక లీటరు పాలతో పెరుగు తోడు పెట్టుకోవాలి.
మర్నాడు ఒక బట్టలో పెరుగును వేసి నీరంతా వడకట్టుకోవాలి.
గంటా, రెండు గంటలు అలా జాలీలో వదిలేస్తే.. నీరంతా పోయి గట్టి ముద్ద మిగులుతుంది.
దీనిని "చెక్కా" అంటారు. ఇప్పుడు ఆ చెక్కాని (hung curd) 5 నిమిషాలు చేతితో బాగా కలపాలి. అందులో 3 Tb sp పాల మీగడ వేసి బాగా క్రీమీగా అయ్యేదాకా కలపాలి.
మామిడి పండు మిక్సీలో మెత్తగా గుజ్జు చేసుకోవాలి.
స్మూద్ గా చేసుకున్న పెరుగులో మామిడి గుజ్జు వేసి కలిపి, కుంకుమపువ్వు పాలు పోసి కలపితే..రంగు, సువాసన వస్తుంది.
ఇష్టమైన వారు యాలకులపొడి వేయచ్చు.
మహారాష్ట్రియన్స్.. కొద్దిగా జాజికాయ పొడి వేస్తారు.
అంతే.
No comments:
Post a Comment