Monday 30 October 2017

ధనురాశిలో శని సంచారం Saturn in Sagittarius

ధనురాశిలో శని సంచార ప్రభావం భారత దేశం పైన అలాగే 12 రాశులపైన

నవగ్రహాలలో మిగతా అన్నింటికన్నా మనిషిని భయపెట్టే గ్రహం శని. చాలామందికి శని అంటే ముఖ్యంగా ఎల్నాటి శని అంటే ఒక రకమైన వణుకు, భయం వస్తుంది.

శని తమను ఎన్ని కష్టాలు పెడతాడో అని ఆందోళన పడుతుంటారు. నిజానికి శనిని సరిగా అర్థం చేసుకుంటే ఈ భయం చాల వరకు దూరం అవుతుంది.

శని కర్మ కారకుడు. ఒక మనిషి చేసిన పాప కర్మను తొలగించే గ్రహం శని. ఒక రాయిని శిల్పంగా మార్చేటప్పుడు అది ఉలి దెబ్బలకు భయపడితే ఎప్పటికి శిలగానే ఉంటుంది తప్ప శిల్పంగా మారదు.

అలాగే మనిషికూడా శని ఇచ్చే బాధలను, కష్టాలను సరిగా అర్థం చేసుకుంటే ఆత్మస్థైర్యంతో వాటిని ఎదుర్కొనవచ్చు. శనిని ప్రభావం ఓపిక, నిజాయితీ మరియు శారీరక శ్రమతో తగ్గించుకోవచ్చు.

ఈ రోజు (అక్టోబర్ 26 2017 నుంచి 24 జనవరి 2020 వరకు ధనురాశిలో సంచరిస్తాడు. ఈ ధనురాశిలో శని సంచార ప్రభావం భారత దేశం పైన అలాగే 12 రాశులపైనా ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం.

భారతదేశం మకర రాశి కిందకు వస్తుంది. శని ధను రాశిలో గోచారం ప్రారంభం అవటంతో ఏల్నాటి శని ప్రభావం భారతదేశానికి ప్రారంభమైనట్టు లెక్క. ఇది ఒకరకంగా దేశానికి మంచి జరిగే సమయం.

భవిష్యత్తులో మన దేశానికి జరగబోయే అభివృద్ధికి ఈ సంవత్సరం నాంది పడుతోంది. శని ప్రభావం కారణంగా రాబోయే రెండున్నర సంవత్సరాలలో భారతదేశంలో చాలా మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.

భారతదేశం పై శని గోచార ప్రభావం:-

భౌగోళిక జ్యోతిషం ప్రకారం ధనుస్సు రాశి విద్యాసంస్థలు, రాజకీయ పార్టిలు, ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ధార్మిక సంస్థలు, స్వచ్చంద సంస్థలు, న్యాయస్థానాలు, మత సంస్థలు మొదలైనవాటిని సూచిస్తుంది.

ధను రాశిలో శని గోచారం ఈ సంస్థలపై వీటి అధిపతులపై ప్రభావం చూపిస్తుంది. శనిధనురాశిలో ఉన్నప్పుడే భారతదేశంలో ఎన్నికలు కూడా వస్తాయి కాబట్టి రాబోయే రోజుల్లో రాజకీయంగా కూడా చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.

భారతదేశ ఆర్ధిక స్థితిలో కూడా రాబోయే రోజుల్లో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. 2018  మార్చ్ – మే మధ్యలో శని, కుజుల సంచారం ధను రాశిలో ఉంటుంది.

ఈ సంచారం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై మళ్ళి ఒకసారి ప్రభావం చూపించేది గా ఉంటుంది. అయితే ఈ సారి సామాన్యజనం పై దీని ప్రభావం ఉండదు. ఈ సమయంలో మొన్న నోట్ల రద్దు లాంటి నిర్ణయం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సారి పైన చెప్పిన సంస్థలపై (విద్యాసంస్థలు, రాజకీయ పార్టిలు, ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ధార్మిక సంస్థలు, స్వచ్చంద సంస్థలు, న్యాయస్థానాలు, మత సంస్థలు మొదలైనవి..) ఈ ప్రభావం ఉంటుంది. వాటికీ సంబంధించి ఎవైన నిర్ణయాలు, సంస్కరణలు వెలువడే అవకాశం ఉంటుంది.

అలాగే వ్యాపార రంగంలో వైద్యం, రియల్ ఎస్టేట్, విద్య రంగాలపై ఈ శని గోచార ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ రంగాలలో పెను మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పులన్నీ కూడా రాబోయే రోజుల్లో భారతదేశాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్ళటానికి ఉపయోగ పడతాయి

12 రాశులపై శని గోచర ప్రభావం

ధనురాశిలో శని సంచారం - మేషరాశి వారి పై ప్రభావం:-

ఈ రాశి వారికి ఈ రోజుతో (అక్టోబర్ 26 2017) అష్టమ శని పోతోంది. గత రెండున్నర సంవత్సరాలుగా వ్యక్తిగతంగా, వృత్తి పరంగా, ఆర్థికం మీరు పడ్డ కష్టాలు ఈ రోజునుంచి తగ్గటం ప్రారంభం అవుతుంది. శని మారిన తెల్లారే జీవితం మారుతుంది అనుకోవద్దు.

కానీ రాబోయే రెండున్నర సంవత్సరాలు మాత్రం గతంలో లా సమస్యాత్మకంగా ఉండదు.  అక్టోబర్ లో శని తో పాటు గురువు కూడా అనుకూలంగా వస్తున్నాడు.  మీకు అన్ని అనుకూలిస్తాయి.

ధనురాశిలో శని సంచారం - వృషభరాశి వారి పై ప్రభావం:-

మీకు ఈ రోజునుంచి  (అక్టోబర్ 26 2017) అష్టమ శని ప్రారంభమవుతోంది. అయితే మీకు శని యోగాకరకుడు అవటం  వలన పెద్దగా భయపడాల్సిన పనిలేదు. అయితే అక్టోబర్ 2017 తర్వాత ఉద్యోగంలో మార్పులు లేదా పని ఒత్తిడి పెరగటం, ఇష్టం లేని చోటుకు బదిలీ అవటం లేదా ఇష్టం లేని బాధ్యతలు చేపట్టాల్సి రావటం జరుగుతుంది. అలాగే మీరు చిన్న తప్పు చేసిన మిమ్మల్ని వేలెత్తి చూపే శత్రువులు చాలామంది తయారుగా ఉంటారు కాబట్టి ఎక్కువగా వివాదాలకు పోకుండా మీ పని మీరు సక్తమంగా, నిజాయితీగా చేయండి. అలాగే ఆవేశానికి లోనుకాకుండా ఉండండి. ఈ రెండున్నర సంవత్సరాల్లో దాదాపు సగం కంటే ఎక్కువ సమయం గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినా తేలికగానే బయటపడ గలుగుతారు.

ధనురాశిలో శని సంచారం - మిథునరాశి వారి పై ప్రభావం:-

శని మీకు ఏడవ ఇంట్లో సంచరిస్తాడు. ఇది కూడా అంతగా అనుకూలమైన గోచారం కాదు. అక్టోబర్  2017 వరకు గురు గోచారం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్యకూడా సఖ్యత చెడుతుంది. వీలైనంత వరకు కోపానికి, అసహనానికి దూరంగా ఉండండి. మీరు రామ అన్నాకూడా ఎదుటివారికి తిట్టులాగా వినిపిస్తుంది. అపోహలు, అపార్థాలు పెరుగుతాయి. అయితే అక్టోబర్ నుంచి గురువు అనుకూలంగా వస్తున్నాడు కాబట్టి సమస్యలు చాల వరకు తగ్గుముఖం పడతాయి. వ్యాపారస్తులు కూడా అక్టోబర్ వరకు కొత్త పెట్టుబడులు పెట్టక పోవటం మంచిది.

ధనురాశిలో శని సంచారం - కర్కాటక రాశి వారి పై ప్రభావం:-

మీకు శని ఆరవ ఇంటిలో సంచరిస్తాడు. ఇది చాల మంచి గోచారం. ఉద్యోగంలో, ఆర్థికంగా మంచి అభివృద్ది సాధిస్తారు.

ఇంతకాలం వాయిదాపడ్డ పనులు పూర్తవుతాయి. కోర్టు కేసులు కానీ వివాదాలు కానీ ఉన్నవారు వాటిలో విజయం సాధిస్తారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వారి సమస్యల నుంచి బయటపడ గలుగుతారు. అయితే అక్టోబర్ నుంచి గురు గోచారం 4 ఇంట్లో ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్త అవసరం. వృత్తి పరంగా ఉత్సాహంతో అదనపు బాధ్యతలు స్వీకరించి తర్వాత ఒత్తిడిని తట్టుకోలేక బాధపడే అవకాశం ఉంటుంది, కాబట్టి అక్టోబర్ తర్వాత తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్త అవసరం.

ధనురాశిలో శని సంచారం - సింహ రాశి వారి పై ప్రభావం:-

మీకు శని ఐదవ ఇంటిలో సంచరిస్తాడు. అర్దాష్టమ శని అయిపోతోంది కాబట్టి మీకు గడచినా రెండున్నరేళ్లుగా పడిన శ్రమకు రాబోయే రోజుల్లో ప్రతిఫలం లభిస్తుంది. ఐదవ ఇంట్లో శని సంచారం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. శ్రమను తగ్గించినప్పటికీ బాధ్యతలను పెంచుతుంది. ముఖ్యంగా సంతానం విషయంలో ఎక్కువ బాధ్యతయుతంగా ఉండాల్సి వస్తుంది. అలాగే షేర్ మార్కెట్ తదితర పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. గురు గోచారం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి రాబోయే సంవత్సరం వరకు పెట్టుబడులు, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. విలాసాలు, వినోదాల పేరున అనవసరపు ఖర్చులుపెట్టకుండా చూసుకోండి.

ధనురాశిలో శని సంచారం - కన్యా రాశి వారి పై ప్రభావం:-

మీకు శని 4వ ఇంట్లో సంచరిస్తాడు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా అదనపు బాధ్యతలు, పని ఒత్తిడి ఉండే సమయం ఇది. శని దృష్టి 6వ స్థానం, 10వ స్థానం మరియు జన్మ రాశి పై ఉంటుంది, కాబట్టి శత్రువుల విషయంలో, ఉద్యోగం విషయంలో అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మీరు ఎప్పుడు ఏ తప్పు చేస్తారా, మిమ్మల్ని ఎలా అవమానించాలా అని చాలామంది ఈ సమయంలో ఎదురు చూస్తుంటారు. మీ పని మీరు చేసుకోవటం, వేరే విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది. అలాగే వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అక్టోబర్ 2017 నుంచి గురు గోచారం అనుకూలంగా వస్తోంది కాబట్టి శని ప్రభావము తగ్గుతుంది.

ధనురాశిలో శని సంచారం - తులా రాశి వారి పై ప్రభావం:-

మీకు ఎల్నాటి శని ఈ రోజుతో (అక్టోబర్ 26 2017) అయిపోతోంది. గత ఏడున్నర సంవత్సరాలుగా రకరకాల సమస్యలతో బాధపడిన మీకు, ఈ సంవత్సరం నుంచి అనుకూల సమయం ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా అక్టోబర్ నుంచి అన్ని రకాలుగా బాగుటుంది. శని 3వ ఇంటిలో సంచరించే ఈ సమయంలో ఉద్యోగంలో అభివృద్ధి, ఆర్ధిక సమస్యలు తొలగి పోవటం మొదలైన శుభ ఫలితాలుంటాయి. అక్టోబర్ వరకు పెట్టుబడుల విషయంలో అలాగే ఉద్యోగ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోక పోవటం మంచిది. విదేశీయానం లేదా ఉద్యోగంలో ఉన్నతి కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరంలో అనుకూలిస్తుంది. అయితే శని మారిన వెంటనే అనుకూల ఫలితాలు ప్రారంభం అవవు కాబట్టి కొంత ఓపిక పట్టడం మంచిది.

ధనురాశిలో శని సంచారం - వృశ్చిక రాశి వారి పై ప్రభావం:-
మీకు శని రెండవ ఇంటిలో సంచరిస్తాడు. గత 5 సంవత్సరాలుగా శని గోచారం అనుకూలంగా లేక పోవటం వలన ఆరోగ్య పరంగా, ఆర్థికంగా సమస్యలు ఎదుర్కుంటున్న మీకు ఈ శని రెండవ ఇంటిలో సంచారం కొంత సహాయకారిగా ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాగే గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆర్థికంగా కొంత అభివృద్ధి సాధిస్తారు. శని 2వ ఇంట గోచారం కుటుంబ సభ్యుల విషయంలో కొన్ని ఇబ్బందులను ఇస్తుంది. వారికీ ఆరోగ్య సమస్యలు రావటం కానీ, లేదా వారితో గొడవలు రావటం కానీ జరుగుతుంది. పెట్టుబడుల విషయంలో అక్టోబర్ వరకు మాత్రమే అనుకూల సమయం ఆ తర్వాత గురు గోచారం బాగుండదు కాబట్టి పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగేయాల్సి ఉంటుంది.

ధనురాశిలో శని సంచారం - ధనూ రాశి వారి పై ప్రభావం:-

మీకు శని 1వ ఇంట్లో సంచరిస్తాడు. రెండున్నర సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఎల్నాటి శని కారణంగా గత కొద్ది కాలంగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటున్న మీకు శని జన్మాన సంచరించటం కొంత ఊరట కలిగిస్తుంది. కొత్తసమస్యలు రాకుండా కొంతకాలం సంతోషంగా గడపవచ్చు. ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి గురువు అనుకూల గోచారం ఉంటుంది కాబట్టి శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. జన్మాన శని కారణంగా మనశ్శాంతి తగ్గుతుంది. అకారణ కోపం భయం పెరుగుతాయి. అలాగే ఎవరిని చూసినా శత్రువులాగే కనిపిస్తాడు. కాబట్టి ఈ సమయంలో తొందరపాటు మంచిది కాదు. మీ అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మియులకు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది.

ధనురాశిలో శని సంచారం - మకర రాశి వారి పై ప్రభావం:-

మీకు ఎల్నాటి శని ప్రారంభం అవుతోంది. శని మీ రాశికి అధిపతి అవటం మూలాన ఈ సమయం మిగతా వారికంటే తక్కువ సమస్యలతో పూర్తవుతుంది.

అయితే శని పని మన కర్మ ఫలితాన్ని తొలగించటం కాబట్టి చిన్న పనికి కూడా ఎక్కువ శ్రమ చేయాల్సి రావటం, అలాగే ఖర్చులు పెరగటం, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఎక్కువ డబ్బు ఖర్చు అవటం జరుగుతుంది.

అలాగే అనాలోచిత నిర్ణయాల కారణంగా కూడా డబ్బు ఖర్చు అవుతుంది. ఆర్థిక సంబంధ విషయాల్లో ఈ రెండున్నరేళ్ళు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది.

అలాగే మాట విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. మీరు సలహా ఇచ్చినా ఎదుటివారు దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే తరచూ ప్రయాణాలు చేసేవారు కూడా అక్టోబర్ తర్వాత నుంచి జాగ్రత్తగా ఉండటం మంచిది.

ధనురాశిలో శని సంచారం - కుంభ రాశి వారి పై ప్రభావం:-

మీకు శని 11వ ఇంట్లో సంచరిస్తాడు. ఇది అత్యంత అనుకూలించే గోచారం.

శని మీ రాశ్యాధిపతి అవటం మూలాన అన్నిరకాలుగా ఈ రెండున్నరేళ్ళ సమయం బాగుంటుంది. ముఖ్యంగా అక్టోబర్ నుంచి గురు గోచారం కూడా అనుకూలంగా ఉంటుంది, కాబట్టి మీరు పట్టిందల్ల బంగారం అవుతుంది.

ఉద్యోగస్థులకు ఆర్థికంగా మంచి సమయం. అలాగే ఇల్లు లేదా భూమి కొనాలనుకుంటున్న వారు అక్టోబర్ తర్వాత తీసుకోవటం మంచిది. ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికీ ఈ రెండున్నరేళ్ళలో మంచి ఉపశమనం లభిస్తుంది. పెట్టుబడులు పెట్టాలనుకునే వారు లేదా కొత్తగా వ్యాపారం ప్రారంభం చేయలనుకునే వారికి అక్టోబర్ తర్వాత నుంచి అత్యంత అనుకూలంగా ఉంటుంది.

ధనురాశిలో శని సంచారం - మీన రాశి వారి పై ప్రభావం:-

మీకు శని 10వ ఇంట్లో సంచరిస్తాడు. వృత్తి పరంగా ఈ సమయం అనుకూలంగా ఉన్నప్పటికీ పని ఒత్తిడి పెరగటం అలాగే ఎంత పని చేసినా సరైన గుర్తింపు ఉండని కారణంగా కొంత నిరుత్సాహానికి గురి అవుతారు.

అయితే ప్రస్తుతం  గురు గోచారం అనుకూలంగా ఉండదు. ఆరోగ్య విషయంలో ఈ గోచారం అనుకూలంగా ఉన్నప్పటికీ పని ఎక్కువ అవటం కారణంగా కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది.

శని గోచారం అనుకూలంగా లేని వారు శనికి తైలాభిషేకం చేయటం, పూజ చేయటం, లేదా శని జపం చేయటం మంచిది. అలాగే ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేయటం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. శని ఎంత ఎక్కువ శ్రమ చేస్తే, ఎంత ఎక్కువ సాయం చేస్తే అంట ఎక్కువగా సంత్రుప్తుడు అవుతాడు. పూజలతో పాటుగా మీకు తూచిన విధంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం వలన శని ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి.

Monday 23 October 2017

The most difficult battle

Battle which saved Kashmir !

Battle of Shalteng Nov 7, 1947 !

Few years back I was asking my son which was the most difficult type of writing. He said Papa humour by far is the most difficult genre of writing .

Today I went to his room & told him Bill I have found something more difficult to write than humour. He was curious & I said to write & explain a famous battle to a new person is the most difficult piece of assignment particularly if one wants to write in simple easy to understand manner. Bill agreed immediately having read hundred of books on military campaigns & history.

This battle is so historic & important that it should be  taught to every Indian.

As a schoolboy growing up in Kashmir , Shalteng was few miles outside Capital Srinagar & if someone had told me that a famous battle took place here which saved Kashmir from Taliban like raiders I would have told him to take a long walk on a short pier !
It was an insignificant name of an insignificant place !
That was till I began to read the history about my ancestral Kashmir that it dawned on me that this battle decisively won Kashmir for Indians over numerical superiority of raiding tribal called Kabalis ! 

--------------------------------------------------

Background

India & Pakistan were created amongst confusion & religious violence of worst kind in August 1947.

Lord Mountbatten brought forward  the date of Independence by one year. It was a fatal mistake as law and order completely broke down & people were butchered on basis of their religion. Worst to suffer was Lahore where Sikhs & Hindus were massacred , looted , converted & raped in their millions. Similar but bit lesser fate awaited Muslims near Amritsar !

Justice Radcliffe who drew the boundary between India & Pakistan should have followed the partition of Berlin  City & divided Lahore a past Capital of Sikh empire into Muslim & non Muslim areas to prevent a wholesale massacre. Sikhs & Hindus were convinced that Lahore would be awarded to them & stayed back to discover late that they were on the wrong side of the border.

Maharaja of Jammu & Kashmir had three regions under his command and all three regions had different religions as majority. Muslims in Kashmir , Dogra Hindus in Jammu & Ladakhi Buddhist 
He wanted to thus stay independent & wanted a Switzerland type neutral union with India & Pakistan & encouraged both countries to sign a Standstill agreement with him.
Pakistan signed it via a telegram in August 1947 & India wanted more time to decide.

All major roads to Kashmir passed through the all weather plain route from Pakistan side via Muzzefrabad  to Baramulla to Srinagar.

Jammu to Srinagar road was inhospitable due to high Peer Panchal snowy mountainous terrain.

Sometime during end of September & early October 1947, Salt , food grain , oil & Petrol was denied passage by Pakistani administration  !

This created panic in the Kashmir valley as people rightly thought that Pakistan wants to starve them & force them to Join Pakistan.
Kashmiris with long noses are very suspicious people & mostly they are right.
Panic slowly took charge in the city

Pakistan was planning a Swift attack of the Kashmir valley not using its army but encouraging Pathan Tribesmen to join Jehad to liberate Kashmir from Kaffirs. The raiders were called Kabalis who were Islamic mercenaries promised , loot , murder, rape & division of looted wealth according to Islamic law governing Maleh Ganimath the spoils of war against the kaffirs. For sending back looted wealth extra Lorries were assigned to them. Regular Pakistani soldiers in non army uniform were to guide them. They were fully armed with Automatic , .303, ammunition & mortar units to help them a swift victory. 

The real Panic started when Kabalis shut the power station at Mohara on 25 th Oct !
Mohara was less than 50 miles from Srinagar

The morale among the 10,000 odd Kabali Jehadees was sky high as they had met almost no or little resistance.

Next attack was on  nearby Town of Baramulla which held up the Kabalis for few crucial days . More on it latter.

Panicked Maharaja Hari Singh approached Newly formed Govt of India for immediate Army help.
Mountbatten suggested that the Maharaja should sign the Instrument of Accession with India to make Jammu & Kashmir join Union of India formally. Maharaja signed it on 26th October

Indian troops started arriving by Dakota DC 3 Aircraft landing on a dusty rudimentary runway from 27 th October. DC 3 was a small aircraft which could ferry 20 odd soldiers by each sortie. As said main roads to Kashmir & Gilgit were via newly formed state of Pakistan.

By the time most important Battle fought by Indian Army -The battle of Shalteng commenced Kabalis were still 5 times more in number with better fire power n reserves  !

-----------------------------------

Relative Assessment of each other by the enemy.

Kabalis thought Indian Army full of timid Hindus will run away or get massacred opening up the treasures of Srinagar City

Indian Army's assessment of Kabalis was more clinical & professional. Pre 1947 British Indian Army thought of Tribesman as tall & powerful with haughty air of superiority but would only attack in an ambush style where his chances of escape were high and did not like engaging in normal warfare & in case of any reverse suffered on battlefield would run away & not regroup. The biggest problem with Pathans was their unreliability & refusal to take orders from superiors. This made them unsuitable to be listed in a thoroughly professional Army like the British Indian Army !

Morale was high as Indian soldiers knew they were led by officers who led from the front & knew them personally. That bond & mutual respect was very high & crucial

---------------------------------------

Battle Commanders

Kabalis - Leaderless , all were their own leaders.

Indian Army- Brigadier L P Sen who had seen World war action in Africa & Arakan. He commanded 161 Sikh Army Infantry brigade  

---------------------------------------------------

Battle Strength

About 10,000 Kabalis full of confidence & religious zeal.

Indian Army one fifth the enemy numbers. Divided in four groups
1 Battalion Kumaon 650 in number
4 Kumaon reduced in size as many killed in earlier Battle of Badgam successfully protecting the crucial Airfield
1 Sikh -1200 in strength
what they missed were large guns & artillery which small Dakota DC 3 could not ferry !

Most prized game changer of war came of 6 Nov  ! A day before the surprise attack by Kabalis on Srinagar.

Surprising everyone Squadron Commander came via Pathankot to Srinagar bringing 4 Armoured Cars ! More importantly he came with Jats & not Sikhs , which turned to be a stroke of luck . All will be revealed why !

-------------------------------------------

Battle Plan

Kabalis : Very simple - come to Srinagar from Baramulla outnumber & kill the Indian Soldiers . Rape loot & murder Kashmiris & ferry the loot back in Trucks & would be replaced by Pakistani Army who would appear to bring law & order to the valley from the raiding Kabalis about whom they did not 'know anything'. Jinnah would take the world accolades & bask in glory !

Indian Army : See map below.

Triple Surprise Attack ! 

Brig Sen had an audacious bait laden plan which was criticised by everyone as it was to be executed few miles from Srinagar after a tactical withdrawal !

Failure was not an option !

Between Baramula where Kabalis were busy looting , killing & raping  & Srinagar lies small Hills near Patan .
One Sikhs were guarding it.

Brig Sen thought his soldiers nearing 1000 in number would be overpowered & killed by outnumbering Kabalis & then Kabalis would be in Srinagar within 45 minutes unstoppable.

Fighting in African theatre against German Desert Fox Gen Rommel had learnt the art of tactical withdrawal & regrouping in a better environment.

He was trying to make best of his experience gained in the World War 2 under General Montgomery !

By tactically withdrawing he prevented the massacre of One Sikhs & emboldened & lured the Kabali Jehadees into a trap which they would have never envisaged !

He Withdrew One Sikh to outskirts of Srinagar near Mile post 4 Shalteng

He flanked the left side of Shalteng with troops of 1 Kumaon

He wanted 4 Kumaon to guard the Airport from enemy splinter groups.

Just Before Shalteng , Baramula Pattan road meets Sumbal Shadipur road & here he wanted his surprise move to take effect !
Brig Sen master plan was to use the newly arrived Armoured Carriers with automatic firepower brought stealthily from behind from the Sumbal road to join the Kabalis near Shalteng to give them impression that they are from Pakistani army. Jats would look like the Pakistanis & Sikhs would have been a disastrous give away !

On his orders the Armoured Carriers , One Sikhs & One Kumaon would attack in unison

The Firing order code was GO !

-------------------------------------

What happened next.

Kashmiri interim govt was very unhappy with Brig Sen's plan & they dispatched DP Dhar to Delhi to tell PM Nehru to replace this looney officer with stupid battle plans !
Home Minister Sardar Patel who had met Sen few days back & promised real Artillery support via Pathankot route opposed the move. His writ ran large and Sen was not replaced.

Sheikh Abdullah another Kashmiri leader was impressing upon Brig Sen to sent Indian Army via Ganderbal to Bandipur to pacify panicked Kashmiris.
Brig Sen thought sending a pair of newly Arrived Armoured carriers would be the best way to make Kashmiris feel safe.

He ordered Sqad Leader of these Carriers to go to Bandipore on early morning of Nov 7 th

-----------------------------

Battle of Shalteng  Nov 7 , 1947

Battle is never like a Blind date with a set date or time.

Brig Sen was envisaging Nov 9 as the probable date of Kabali attack and that too at night time.

At 7 am Commanding Officer radioed Brig Sen that at Mile post 4 from Srinagar enemy was sniping heavily.

Brig Sen asked for IAF to send Havard aircraft for a quick aerial recce & answer 4 questions for him please !

1 what is the Approx strength of enemy at Mile post 4 Area
2. How many vehicles are on road with them
3 Are any columns moving towards Airfield
4 any other strength etc

Answer provided by Pilot were
Enemy was in their thousands , with 150 fully laden trucks , no one was moving towards the airport.

Brig Sen immediately radioed the Two Armour vehicles & told them the situation asked them to move towards Sumbal by crossing the bridge ( big red arrows on map below ) &
Join the enemy convoy from rear via Shadipur road & remain calm and wave at the enemy so that he thinks that you are one of them.

When they reached the Shalteng Fork he has to wait for Signal Go to start firing the raiders from behind.

After few minutes the Armour radioed back saying the Sumbal bridge was wooden planky small narrow & rickety & may not hold the weight of the Armour vehicles.

He was ordered to try nevertheless.

The armour unit found only two inches of freeboard on each side of the tyres. The bridge was crossed in inches in 15 minutes each. But they were over the bridge on other side now racing to meet the Kabalis in Shalteng. See red square in Map one.

Kabalis seeing them waved at them in Glee & they waved back.

One Sikh were getting restless & were waiting for Word GO to start firing amongst Chants of Jo Bhole Sonihal !

With all units , One Kumaon , One Sikh, & armour unit radioing readiness Brig Sen shouted Go loud and clear only once !

Hell broke loose !

Kabali Jehadees did not know what hit them

Frontally One Sikhs fired at them joined by flanks by One Kumaon & from Rear by Automatic Gun fire !

There was complete confusion amongst the Kabalis and Air Force few planes strafed them from Air !

The Battle of Shalteng was over in 20 minutes from the Word GO !

About 700 Kabalis died within minutes & rest were allowed to escape back to Pakistan which they did on the same day !

--------------------------
Importance

This luring the enemy with a bait battle saved Kashmir from Savaging Kabalis who raped , plundered , killed thousands in Baramulla including Irish Nuns of St  Joseph's Convent & Hospital.

---------------------------------------

Dr Vivek Kaul

Saturday 14 October 2017

రగడ ఛాట్

Hi friends here I am
మొన్న నేను  'రగడ ఛాట్' post చేస్తానని promise చేసాగదా. చేసుకొని happy గా తినేసి తీరికగా post పెడుతున్నాను అన్నమాట.
Actual గా ఇది evening snack. కాని రాత్రి భోజనంవద్దనుకుంటే అప్పుడు తింటం best.
చాలా stomach filling గా వుంటుంది. Hyderabad లో చాలా favourite snack. చెయ్యండి సులువు.
ఇంక మీరంతా కూడా  ఓ పట్టు పట్టచ్చుగా.
ఇంతకీ నా ఛాట్ ఎలావుందో చెప్పరూ.......

తయారీ:
2కప్పు green peas ,(నానబెట్టిన)  1 potato కలిపి వుడకపెట్టి potato తొక్క తీసేసి రెడీ చేస్కోండి. Next Photo లో  snacks రెడ్ పెట్టుకోండి.
1 వుల్లిపాయ ని సన్నగా cut చేస్కోండి. 2  tomatoes సన్నగా cut చేస్కోండి.  కొత్తిమీర  cut చేస్కోండి. ఇప్పుడు భా ళ్ళీ పెట్టినూనెవేసి వేడి అయాక వుల్లిముక్కలు వేయించి 1 చంచా gingergarlic paste వేసి వేయించి టమోటా ముక్కలు వేసి మగ్గనియ్సండి. బాగా వుడికి gravy అయాక 1 చంచా ధనియలపొడి , జీలకర్రపొడి, వుప్పు,కారం, పసుపు వేసి 2 నిమిషాలు వుడికించి దానిలో వుడకబెట్టిన
green peas (ఆకుపచ్చ భటానీలు) potato వేసి 5 నిమిషాలు వుడికించి దింపండి.
ఇప్పుడు 4 రికి 4 separate  plates లో ఒక గరిట చెప్పినా రగడ వేసి దానిపై కొతిమేర జల్లి వుల్లి ముక్కలు
జల్లి  దానిపై మిగతావి ( next photoలోవి) జల్లి అతిథి (guest)  చేతికిస్తే.........మీ అంతవారు లేరంటూ దసరా పద్యాలు అందుకుంటారు.

Wednesday 11 October 2017

వడలు: కందతో

ఆలూరుకృష్ణప్రసాదు .

రుచికరమైన - కందవడలు

సామాన్యంగా   కందతో  కంద  బచ్చలికూర  ,  కంద  చింతపండు  రసం బెల్లం వేసి  ముద్దకూర ,  కంద  అల్లం  పచ్చి మిర్చి  కూర  చేసుకుంటారు .

కొంతమంది   పెసర పప్పుతో  భోజనము   లోకి  కంద  అట్టు  వేసుకుంటారు .

మేము  భోజనము   లోకి  కంద పెసర పప్పుతో  వడలు  వేసుకుంటాము .

ఇప్పుడు  ఈ  కంద వడలు  తయారీ విధానము   గురించి  తెలుసుకుందాం .

కావలసిన పదార్ధాలు :
----------------------------
పావుకిలో కంద
100గ్రా. పెసరపప్పు
ఉల్లిపాయలు - 4
జీలకర్ర - ఒక చెంచా.
కరివేపాకు - 4 రెబ్బలు
చారెడు బియ్యప్పిండి.
ఉప్పు, కారం - తగినంత.
నూనె  వడలు  వేయించడానికి  సరిపడా

తయారీ విధానం
---------------------
ముందుగా పెసరపప్పును అరగంట ముందు నానబెట్టుకోవాలి.

దీనిలో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు , జీలకర్ర వేసి, మిక్సీలో రుబ్బుకోవాలి.

కంద చెక్కు తీసి, కడిగి  ఎండు  కొబ్బరి  కోరాముతో   తురుముకోవాలి.

ఇందులో బియ్యప్పిండి,  తగినంత ఉప్పు, కారం, పైన రుబ్బిన ముద్ద, కలుపుకుని, నూనెలో వడల లాగా ఎర్రగా వేయించుకోవాలి.

ఇవి అన్నంలో తిన్నా, విడిగా తిన్నా రుచికరంగా ఉంటాయి.

అందుకే పిల్లలు ఓసారి రుచి చూస్తే ఇక వదలరు. ప్రయత్నించండి.

వధూవరుల జాతక చక్రాల పొంతన ఇలా..

వివాహ పొంతన విషయంలో తప్పనిసరిగా వధూవరులిద్దరి జాతకచక్రంలో పంచమం (సంతానం కోసం), సప్తమ స్ధానం (దాంపత్య జీవితం), అష్టమ స్ధానం  (మాంగల్య స్థానం), దశ, అంతర్దశలు (వివాహానంతర జీవితం) తప్పని సరిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. పాయింట్లకు ప్రాదాన్యత ఇవ్వరాదు. తారాబలం, గ్రహమైత్రి, నాడీమైత్రి బాగుండి జాతకచక్రం అనుకూలంగా ఉన్నప్పుడు వధూవరులిద్దరికి పొంతన కుదిరినట్లే.

వధూవరులకు వివాహ పొంతన చూసేటప్పుడు ముఖ్యముగా 8 కూటములను పరిగణనలోకి తీసుకొన్నారు .

1 వర్ణకూటమి  2 వశ్యకూటము ౩ తారాకూటమి 4  యోనికూటము 5 గ్రహకూటమి 6. గణకూటమి 7 రాశికూటమి 8 నాడీకూటమి. పరిగణనలోకి తీసుకోవాలి.

వీటిలో మొత్తం 18 గుణాలు దాటితే శుభం అనేది సామాన్య వచనం, కానీ సప్తమ, పంచమ, అష్టమ భావాలు సంపూర్ణ శుభత్వం ఉంటే వివాహం చేయవచ్చు. ఒక వేళ జన్మ నక్షత్రం తెలియకపోతే నామ నక్షత్రాన్ని అనుసరించి చూడాలి.

వర్ణకూటమి : స్త్రీ పురుషులు ఇద్దరు ఒకే వర్ణమునకు చెందిన వారయితే మంచిది.

కర్కాటకం, వృశ్చికం,వమీన రాశుల వారు బ్రాహ్మణ వర్ణం.
మేషం, సింహం, దనస్సు రాశుల వారు క్షత్రియ వర్ణం.
మిధున, తుల, కుంభ రాశులవారు  వైశ్య వర్ణం.
వృషభ, కన్య, మకర రాశులవారు శూద్ర వర్ణం.

వధూవరులు ఇద్దరూ ఏక వర్ణమైన ఉత్తమం. వధువు వర్ణం కంటే వరుడి వర్ణం ఎక్కువైన మద్యమం. వరుని వర్ణం కంటే వధువు వర్ణం ఎక్కువైన వర్ణ పొంతన కుదరదు.

2. వశ్యపొంతన : మేష రాశి వారికకి - సింహము, వృశ్చికం.
వృషభ రాశి వారికి – కర్కాటక, తులారాశులు.
మిధున రాశి వారికకి – కన్యరాశి.
కర్కాటక రాశి వారికి – వృశ్చికం, ధనుస్సు.
సింహ రాశి వారికి – తులారాశి.
కన్య రాశి వారికి – మిధున, మేషములు.
తులా రాశి వారికి – కన్య, మకరం,
వృశ్చిక రాశి వారికి – కర్కాటకం.
ధనుస్సు రాశి వారికికు –మీనము.
మకర రాశి వారికి – మేషం.  కుంభ రాశి వారికి – మేషము. మీనము రాశి వారికి – మకరం.

ఈ విధంగా పై రాశులు వశ్యము కలిగి ఉన్నవి.
వధూవరులు ఇద్దరి రాశులు వశ్య పొంతన కలిగి ఉండవలెను.
మిధున, కన్య, తుల నర రాశులు. వీటికి సింహం తప్ప తక్కినవన్నీ వశ్యములే. సింహానికి వృశ్చికం తప్ప అన్నీ వశ్యాలే.

౩. తారా పొంతన : స్త్రీ జన్మ నక్షత్రమునుండి పురుషుని జన్మ నక్షత్రము వరకు లెక్కించిన సంఖ్యను 9 చే భాగించగా 1, ౩, 5, 7 శేషము వచ్చిన తారలు మంచివి కావు.
అను జన్మతారలో చేసుకోవచ్చును. శుభతారలైతే 3 గుణాలు. అశుభ తారలైతే 1 న్నర గుణాలు ఉంటాయి.

4 . యోనిపొంతనము :

అశ్వని, శతభిషం - గుఱ్ఱం.
స్వాతి, హస్త - ఎద్దు.
ధనిష్ట, పూర్వాభాద్ర - సింహం.
భరణి, రేవతి - ఏనుగు.
పుష్యమి, కృత్తిక - మేక.
శ్రవణం, పూర్వాషాడ - కోతి.
ఉత్తరాషాడ, అభిజిత్ - ముంగీస.
రోహిణి, మృగశిర - పాము.
జ్యేష్ఠ, అనూరాధ - లేడి.
మూల, ఆరుద్ర - కుక్క.
పునర్వసు, ఆశ్లేష - పిల్లి.
మఘ, పుబ్బ - ఎలుక.
విశాఖ, చిత్త - పులి.
ఉత్తర, ఉత్తరాభాద్ర - ఆవు

పులి – ఆవు. పిల్లి – ఎలుక. లేడి – కుక్క. గుఱ్ఱము – దున్న. పాము – ముంగిస. సింహం – ఏనుగు. కోతి - మేక.  ఇవి విరోధ జంతువులు.

వధూవరుల ఇరువురు నక్షత్రములు విరోధ జంతువులకు సంబంధించినవి  కాకూడదు.
ఒకే యోని అయితే సంపద.
భిన్న యోనులైతే శతృత్వం. లేకపోతే మద్యమం.

రాశి కూటం, వశ్య కూటం, అనుకూలమైతే యోనికూటం కుదరకున్నా దోషం లేదు.

5 గ్రహకూటమి :

గ్రహం  -  మిత్రుడు -  శత్రువు - సముడు

రవి:
మిత్రుడు:చంద్రుడు, కుజుడు, గురువు
శత్రువు:శని, శుక్రుడు.
సముడు:      బుధుడు.

చంద్రుడు:
రవి, బుధుడు
శత్రువులులేరు
మిగిలినవారు సములు

కుజుడు:
గురువు, చంద్రుడు, రవి.
చంద్రుడు.
కుజ, గురువు, శని.

బుధుడు:
శుక్రుడు, రవి.
చంద్రుడు.
కుజుడు, గురువు, శని.

గురువు:
రవి, కుజుడు, చంద్రుడు.
బుధ, శుక్రుడు.
శని.

శుక్రుడు:
శని, బుధుడు.
రవి, చంద్రుడు.
కుజుడు, గురువు.

శని:
శుక్రుడు, బుధుడు.
రవి, చంద్రుడు, కుజుడు.
గురువు.

సూర్యుడు – శని. చంద్రుడు – బుధుడు.
కుజుడు –బుధుడు.  గురుడు – శుక్రుడు.

ఈ పైన తెలిపిన గ్రహములు ఒకరికొకరు పరస్పం శత్రువులు గ్రహ కూటమిని చూసేటప్పుడు పై విధంగా ఉండకూడదు.

వధూవరుల రాశులకు అన్యోన్య మైత్రి ఉత్తమం. సమమైత్రి మద్యమం.  పరస్పర సమత్వం కనిష్ఠం. పరస్పర శతృత్వం మృత్యుప్రదం. శతృత్వం కలహప్రదం.

6 గణ కూటమి :-

స్వగుణం చోత్తమం ప్రీతి మధ్యమం దైవమానుషం
అధమం దేవదైత్యానాం మృత్యుర్మానుష రాక్షసం.

వధూవరుల జాతకం పరిశీలించేటప్పుడు వరుని యొక్క మనస్తత్వం నిర్ణయించటానికి అతని జన్మ నక్షత్రం ఆదారంగా నిర్ణయించవచ్చు.
నక్షత్ర విభజన వారి మనస్తత్వ ప్రకారం విభజించబడింది.
వధువు నక్షత్రంతో వరుని నక్షత్రం సరిపోతుందో లేదో చూడాలి, కానీ వరుని నక్షత్రంతో వధువు నక్షత్రాన్ని పోల్చకూడదు.
నక్షత్రాలు 27 నక్షత్రాలను మూడు భాగాలుగా చేశారు.

దేవగణ నక్షత్రాలు:-అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి,అనురాధ,శ్రావణం,రేవతి

దేవగణ నక్షత్ర జాతకులు సాత్విక గుణం కలిగి ఉంటారు.శాంత స్వభావం కలిగి ఉంటారు.పరోపకారులై ఉంటారు.ఓర్పు,సహనం కలిగి ఉంటారు.

మనుష్యగణ నక్షత్రాలు:-భరణి,రోహిణి,ఆరుద్ర,పుబ్బ,ఉత్తర,పూర్వాషాడ,ఉత్తరాషాడ,పూర్వభాధ్ర,ఉత్తర భాధ్ర

మనుష్యగణ నక్షత్ర జాతకులు రజో గుణ లక్షణాలు కలిగి ఉంటారు. మంచి చెడు రెండు కలిగి ఉంటారు. భాదించటం, వేధించటం చేయరు. ఎవ్వరికీ హాని తలపెట్టరు.

రాక్షస గణ నక్షత్రాలు:- కృత్తిక, ఆశ్లేష, మఖ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ధనిష్ట, శతబిషం.

రాక్షసగణ నక్షత్ర జాతకులు తామస గుణ లక్షణాలు కలిగి ఉంటారు. అసూయ ద్వేషాలు కలిగి ఉంటారు. కఠినంగా మాట్లాడుతారు. మిక్కిలి స్వార్ధపరులు.

వధూవరులిద్దరిది ఒకే గణమైతే వారిద్దరి మధ్య సహకారం, ప్రేమానురాగాలు ఉంటాయి.

వధువుది మనుష్య గణమై వరునిది రాక్షస గణమైతే వారిద్దరి మధ్య బొత్తిగా అవగాహన లేకపోవటం, ఆమెకు విలువ ఇవ్వక తన ఇష్టానుసారం ప్రవర్తిస్తాడు.

వధువుది దైవగుణం వరునిది రాక్షస గణం అయితే సంసారంలో అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మద్య పొందిక కుదరదు.

.7. రాశి పొంతనము :
వధూవరుల జన్మ రాసులు ఒకదానికొకటి

6 - 8 అయితే మృత్యువు.
5 - 9 అయితే సంతాన హాని.
2 -వ12 అయితే నిర్ధనత్వం.

ప్రీతి షడష్టకం :- మేషం - వృశ్చికం. మిధునం - మకరం.
సింహం - మీనం.  తుల - వృషభం. ధనస్సు -కర్కాటకం. 
కుంభం - కన్య.

మృత్యు షడష్టకం:-మేషం - కన్య. మిధునం - వృశ్చికం.
సింహం - మకరం. తుల - మీనం. ధనస్సు - వృషభం.
కుంభం - కర్కాటం.

శుభ ద్విర్ద్వాదశం :- మీనం - మేషం. వృషభం - మిధునం. కర్కాటకం - సింహం, కన్య - తుల, వృశ్చికం - ధనస్సు,
మకరం - కుంభం.

అశుభ ద్విర్ద్వాదశం :- మేషం - వృషభం. మిధునం -కర్కాటం.
సింహం - కన్య.  తుల - వృశ్చికం. ధనస్సు - మకరం.
కుంభం -మీనం.

శుభ నవపంచకాలు :- మేషం - సింహం. వృషభం - కన్య.
మిధునం - తుల. సింహం - ధనస్సు. తుల- కుంభం.
వృశ్చికం - మీనం. ధనస్సు - మేషం. మకరం - వృషభం.

అశుభ నవ పంచకాలు :- కర్కాటకం - వృశ్చికం.  కన్య - మకరం. కుంభం - మిధునం. మీనం - కర్కాటకం.

ఏకరాశి :- సౌభాగ్యం, పుత్ర లాభాలు.
సమసప్తకం :-ప్రీతి, ధన, భోగ, సుఖాలు.
తృతీయ లాభాలు :- ప్రీతి, ధనం, సౌఖ్యం.
చతుర్ధ దశమాలు:- ప్రీతి, ధనం, సౌఖ్యం.

8. నాడీపొంతనము : నాడీ దోషం ఎంతో విశిష్టమైనది. విడువరానిది. వదూవరులిద్దరిదీ ఏకనాడీ అయితే వారి వివాహం ఎట్టి పరిస్ధితులలోను చేయకూడదు. వదూవరులిద్దరిదీ ఏక శరీర తత్వము కాకూడదు అనేది నాడీ నిర్ణయం. వివాహమునకు తరువాత వ్యక్తి క్రొత్త జీవితములోనికి ప్రవేశించునని పెద్దలు అంటారు. పెద్దలు ఇట్లు చెప్పుట చాలా వరకు సరైనదికూడ. వివాహమునకు తరువాత ప్రారంభమగు క్రొత్త జీవితము సుఖమయముగా వుండుటకు కుండలి యొక్క లెక్కింపు చేసెదరు.

కుండలి యొక్క లెక్కింపు క్రమములో అష్టకూటము ద్వారా విచారణ చేసెదరు. ఈ అష్ట కూటము (Ashtkoot)లో ఎనిమిదవ మరియు అంతిమ కూటము నాడీ కూటము. నాడీ కూటమి సరిగా లేకుంటే మిగతా ఏడు కూటాల గుణాల్ని కూడా నాశనం చేస్తుంది.

శరీరాన్ని మూడు భాగాలుగా విభజించారు. జ్యోతిష్య శాస్త్రము (Astrology)లో నాడులు మూడు ప్రకారములుగా వుండును. ఈ నాడుల పేర్లు ఆదినాడ. మధ్య నాడి. అంత్య నాడి.

1.   ఆది నాడి: జేష్ట, మూల, ఆర్ద్ర, పునర్వసు, ఉత్తరఫల్గుని, హస్త, పూర్వభాద్ర, శతబిషం మరియు అశ్విని నక్షత్రములు ఆది లేదా ఆద్య నాడిలో వుండును.

ఆది నాడి - వల్ల మేదోసంపత్తి, ప్రతీకార వాంఛ, ఆలోచనా విధానం, కోపం, ఆవేశం తెలుపుతుంది.

వధూవరుల ఇద్దరి నక్షత్రాలు ఉత్తర, శతభిషం, పూర్వాభాద్ర, పునర్వసు, ఆరుద్ర, మూల మొదలగు నక్షత్రాలకు ఆది నాడీ దోషం లేదు.

2. మద్య నాడి: పుష్యమి, మృగశిర, చిత్ర, అనురాధ, భరణి, దనిష్ట, పూర్వాషాడ, పూర్వఫల్గుణి మరియు ఉత్తరాభాద్ర నక్షత్రములు మధ్య నాడిలో వుండును.

మద్య నాడి - వల్ల శరీరం మద్య భాగంలో ఉన్న రుగ్మతలు, సంతానం, ఊపిరితిత్తులు గుండెలో ఉన్న రుగ్మతలు తెలుపుతుంది.

వధూవరుల ఇద్దరి నక్షత్రాలు - పూర్వాషాడ, అనురాధ, ధనిష్ఠ, పుష్యమి, చిత్త, పుబ్బ, మృగశిర,  మొదలగు నక్షత్రాలకు మద్య నాడీ దోషం లేదు.

3. అంత్య నాడి: స్వాతి, విశాఖ, కృత్తిక, రోహిణి, ఆశ్లేష, మఘ, ఉత్తరాషాడ, శ్రవణ మరియు రేవతి నక్షత్రములు అంత్య నాడిలో వుండును.

అంత్య నాడి - వల్ల మర్మాయవాలు, కామవాంఛ, నపుంసకత్వం గురించి తెలియజేయును.

వదూవరుల ఇద్దరి నక్షత్రాలు -  కృత్తిక, విశాఖ, ఆశ్లేష, శ్రవణం, మఖ, ఉత్తరాషాడ, రోహిణి మొదలగు నక్షత్రాలకు అంత్య నాడీ దోషం లేదు.

జ్యోతిష్య శాస్త్ర ఆధారముగా వరుడు మరియు కన్య ఇరువురి నక్షత్రములు ఒకే నాడిలో వుండిన అప్పుడు ఈ దోషము కలుగును. అన్ని దోషముల కన్నా నాడీ దోషము అశుభకరముగా చెప్పబడుతున్నది. ఎందుకంటే ఈ దోషము కలుగుట వలన 8 కూటమి యొక్క హాని కలుగును. ఈ దోషము కలుగుట వలన వివాహ ప్రయత్నము చేయుట శుభకరముగా వుండదు.

మహర్షి వశిష్టు (Maharishi Vashisht)ని అనుసారముగా నాడీ దోషములో ఆది, మధ్య మరియు అంత్య నాడులకు వాతము (Mystique), పిత్తము (Bile) మరియు కఫము (Phlegm) అనే పేర్ల ద్వారా తెలిపెదరు.

నాడి మానవుని యొక్క శారీరక ఆరోగ్యమును కూడ ప్రభావితము చేయును (Nadi also effect human health). ఈ దోషము కారణముగా వారి సంతానము మానసికముగా వికసితము లేని మరియు శారీరకముగా అనారోగ్యముతో వుండును (Nadidosh also effect Mind of their Child and Health of their Child).

ఈ స్థితులలో నాడీ దోషము కలుగదు: (Nadidosha will not affect you in this Conditions)

1. వరుడు - వధువు యొక్క జన్మ నక్షత్రములు (Birth Nakshatras) ఒకటిగా వుండిననూ ఇరువురి చరణములు ప్రదమ చరణమైన ఎడల నాడీ దోషము కలుగదు.

2.  వరుడు - వధువు ఒకే రాశిగా వుండి (Bride and Groom have Same Rashi) మరియు జన్మ నక్షత్రము బిన్నమైన (Different Birth Nakshatras) ఎడల నాడీ దోషము నుండి వ్యక్తి ముక్తి పొందగలడు.

3. వరుడు - వధువు యొక్క జన్మ నక్షత్రము ఒకటిగా వుండి మరియు రాశులు వేరు వేరుగా (Different Rashi) వుండిన ఎడల నాడీ దోషము కలుగదు.

తప్పనిసరి అయితే నాడీ దోష పరిహారానికి మృత్యుంజయ జపం సువర్ణ దానం చేయాలి.