ఆలూరుకృష్ణప్రసాదు .
రుచికరమైన - కందవడలు
సామాన్యంగా కందతో కంద బచ్చలికూర , కంద చింతపండు రసం బెల్లం వేసి ముద్దకూర , కంద అల్లం పచ్చి మిర్చి కూర చేసుకుంటారు .
కొంతమంది పెసర పప్పుతో భోజనము లోకి కంద అట్టు వేసుకుంటారు .
మేము భోజనము లోకి కంద పెసర పప్పుతో వడలు వేసుకుంటాము .
ఇప్పుడు ఈ కంద వడలు తయారీ విధానము గురించి తెలుసుకుందాం .
కావలసిన పదార్ధాలు :
----------------------------
పావుకిలో కంద
100గ్రా. పెసరపప్పు
ఉల్లిపాయలు - 4
జీలకర్ర - ఒక చెంచా.
కరివేపాకు - 4 రెబ్బలు
చారెడు బియ్యప్పిండి.
ఉప్పు, కారం - తగినంత.
నూనె వడలు వేయించడానికి సరిపడా
తయారీ విధానం
---------------------
ముందుగా పెసరపప్పును అరగంట ముందు నానబెట్టుకోవాలి.
దీనిలో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు , జీలకర్ర వేసి, మిక్సీలో రుబ్బుకోవాలి.
కంద చెక్కు తీసి, కడిగి ఎండు కొబ్బరి కోరాముతో తురుముకోవాలి.
ఇందులో బియ్యప్పిండి, తగినంత ఉప్పు, కారం, పైన రుబ్బిన ముద్ద, కలుపుకుని, నూనెలో వడల లాగా ఎర్రగా వేయించుకోవాలి.
ఇవి అన్నంలో తిన్నా, విడిగా తిన్నా రుచికరంగా ఉంటాయి.
అందుకే పిల్లలు ఓసారి రుచి చూస్తే ఇక వదలరు. ప్రయత్నించండి.
No comments:
Post a Comment