ఇడ్లీల్లోకి
మిత్రుల కోరికపై కారచట్నీ చేయు విధానం చెబుతాను.
చక్కగా ప్లేట్ లో అలంకరించాను.
Kaara Chutney/కారచట్నీ:—
సామాగ్రి:—2 బాగా పండిన ఎర్రటి టమాటాలు
వెల్లుల్లి రెబ్బలు—4
మిరపపొడి—3స్పూన్లు
ధనియాల పొడి—2స్పూన్లు
గమనిక:—మిరపపొడి ఎక్కువగా ధనియాలపొడి తక్కువగా ఎందుకు వేసానంటే అప్పుడే కారచట్నీకి ఎరుపుదనం వస్తుంది.
ఉప్పు:—అరస్పూను లేదా మీ ఇష్టానికి తగినట్లు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు.
తాళింపుకు ఒక స్పూను నూనె లో ఆవాలు,ఉద్దిబేడలు(మినప్పప్పు)జీలకర్ర,కరివేపాకు వేసి చిటపటలాడగానే మిక్సీ పట్టిన టమాటజ్యూస్,వెల్లుల్లి రసం వేసి,మిరపపొడి,ధనియాలపొడి,ఉప్పు కొద్దిగా నీరు పోసి కారచట్నీ దగ్గర పడగానే కొద్దిగా నూనె కలిపి దింపుకోవాలి.
*అప్పుడు కారచట్నీ ఎర్రగా తళతళలాడుతూ ఉంటుంది.*
ఈ చట్నీ ఫ్రిజ్ లో పెట్టకుండానే ఒకరోజు నిలువ ఉంటుంది.
కాబట్టి ట్రైన్ లలోకి ఇడ్లీ చట్నీ ప్రొద్దున్నే ప్యాక్ చేసుకున్నా రాత్రి ఒక్కోసారి మరునాటి ప్రొద్దున గమ్యం చేరేవరకు బాగుంటుంది.
గమనిక:—తాళింపు దినుసులన్నీ కలిపి ఒక స్పూను కన్నా ఎక్కువుండకూడదు.
అప్పుడే కారచట్నీ రుచికరంగా ఉంటుంది.
ఎక్కువ తాళింపు సామాన్ల వల్ల నోటికి ఆవాలు,ఉద్దిబేడలు అడ్డం వచ్చి జిహ్వకు భంగం కలిగిస్తుంది.
ఎంతైనా సరే వేడి ఇడ్లీ దోసెలకు ఈ చట్నీ వేడిగా వండి వడ్డిస్తే ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేయడం ఆలస్యమైనా కడుపు నిండుగా ఉంటుంది.
@*శశిరేఖా లక్ష్మణన్ * *చెన్నై* *తమిళనాడు* *10/10/2017*
No comments:
Post a Comment