Get together with friends at my place on Saturday night-
నేను చేసిన వంటలు
అరటికాయ కబాబ్స్
రైసెబాల్ మంచూరియన్
తోటకూర ములక్కాడ పప్పు పులుసు
బగారా బైంగన్ (మసాలా వంకాయ కూర )
lotus stem dry bhaji ( తామర పువ్వు కాడలు తో చేసిన కూర )
aloo chole ( శనగల తో కర్రీ )
మజ్జిగ పులుసు
గడ్డ పెరుగు (బాగా తోడుకుందని ఫ్రెండ్స్ పొగడ్తలు. ఇక్కడ చలి కి పెరుగు తొందరగా తోడుకోదు కదా)
tomatillo chutney ( మెక్సికన్ టొమాటోలు గ్రీన్ కలర్ లో దొరుకుతాయి ఇక్కడ, వాటితో చేసిన చట్నీ). చాలా పుల్ల పుల్లగా బావుంటుంది ఈ టొమాటో తో చేస్తే చట్నీ.
మామిడికాయ ముక్కల పచ్చడి ( గొడ్డు కారం వుంది పచ్చడి 😪, ఏదో కారం లో తేడా. నోరు మండి పోయింది నాకు. కానీ ఫ్రెండ్స్ మాత్రం చాలా బావుంది అంటూ తినేశారు. ఆంధ్రా అమ్మాయిని, అది కూడా గుంటూరు జిల్లా పిల్లని, నాకన్నా ఈ మహారాష్ట్ర వాళ్లు ఇంత కారం ఎలా తింటున్నారబ్బా 🤔)
తోటకూర పప్పు ఏంటమ్మా అంది మా అమ్మాయి, వచ్చే వాళ్లు నార్త్ ఇండియన్స్ వాళ్ళకి మన తెలుగు వంటలు తెలియచేయాలనే అది వండాను. తెగ నచ్చింది వాళ్ళకి . అన్ని ఐటమ్స్ బావున్నాయని ఊది పారేశారు ఫ్రెండ్స్ , ఒక్క మజ్జిగ పులుసు తప్ప . అది ఒక్కటే ఏం పాపం చేసుకుందో మిగిలి పోయింది. (రక్షించారు ఈరోజు కి అదే మాకు దిక్కు, ఇంక వండే ఓపిక లేదు ఈరోజు) మిగతా వన్నీ ఫ్రెండ్స్ అందరూ డబ్బాల్లో సర్దుకుని తీసుకు వెళ్లిపోయారు. విచిత్రం ఏంటంటే డబ్బాలు వాళ్ల ఇంటి నించీ ముందే తెచ్చుకున్నారు 😂😂. వండిన వాళ్ళకి నలుగురూ మెచ్చుకుని తింటేనే కదండీ తృప్తి. శ్రమ ది ఏముంది రోజూ చేస్తామా ఇలా?
sweets ఫ్రెండ్స్ తీసుకు వచ్చారు. మా పెద్దమ్మాయి birthday మొన్న గురువారం, అందుకునే నిన్న ఫ్రెండ్స్ తో cake cutting చేయించేసాము.
ఇలా ముగిసింది అండీ ఈ వారం.😊
No comments:
Post a Comment