Sunday, 19 November 2017

నిమ్మకాయ పచ్చడి

చాలా సులువు అమ్మా! ముందు మంచి రసం ఉన్న నిమ్మకాయలను రసం పిండి ఉంచుకోవాలి, గింజలు లేకుండా. అందులోకి తగ్గ ఉప్పు, కారం గుండ, పసుపు వేసి కలుపుకోవాలి. కారం ఎక్కువగా వెయ్యాలి అమ్మా. ఎందుకంటే పులుపు విరగదు. మూకుడులో నూనె బాగా మరిగించి,(నూనె బాగా పడుతుంది) అందులో, పెద్ద తెల్ల ఇంగువ ముక్క వేసి, ఆవాలు, జీలకర్ర,, ఎండు మిర్చి ముక్కలు గా చేసి, ఇష్టం ఉన్నవారు పఛ్చిమిర్చి కూడా గుండలా తరిగి పోపులో వెయ్యాలి. ఈ పోపు తో ఉన్న నూనె బాగా చల్లారాక(గోరు వెచ్చగా), ఆ కారం కలిపిన నిమ్మ రసంతో కలపడమే. చేసిన రోజు కాకుండా ఒక రోజు ఆగి తింటే, బాగా ఊరుతుంది. రుచిగా ఉంటుంది. ఇంగువ ముక్క పాళంగా వేస్తే, ఆ సువాసన తో రుచి మధురంగా ఉంటుంది. వేయించిన పప్పులోకి కూడా చాలా బాగుంటుంది.

No comments:

Post a Comment