క్యాబేజ్ హాఫ్ ,
క్యారట్ 1,
బీన్స్ 6, (or ఉల్లి కాడలు)
క్యాప్సికమ్ 2 పెద్దవి,
ఆనియన్స్ పెద్దవి 2,
ఇవన్నీ సన్నగా పొడవు గా (3ఇంచులు) ఉండేలా క్యూట్ చేసుకోవాలి.....
అల్లం ,వెల్లుల్లి సన్నగా తరగాలి
3,4 స్పూన్స్ కార్న్ ఫ్లోర్
రెడ్ చిల్లీ సాస్ , సోయా సాస్, (టొమాటో సాస్ ఇది ఛాయిస్ కొంచెం స్వీట్ అవుతుంది), వెనిగర్ అన్ని ఒక్కో స్పూన్
మిరియాల పొడి ఒక స్పూన్
సాల్ట్ తగినంత...
మూకుడు పెట్టుకొని 2స్పూన్స్ oil వేసి అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి.....ఉల్లి ముక్కలు కూడా వేసి కొంచెం వేగాక అన్ని కూర ముక్కలు వేసుకొని ఒకసారి కలిపి, అన్ని సాస్ లు సాల్ట్ మిరియాల పొడి వెస్కొని కొద్ది సేపు కలిపి స్టౌ ఆఫ్ చేయాలి.. కూర ముక్కలు ఉడికి పోకూడదు...కొంచెం పచ్చి గానే ఉండాలి...పైన కార్న్ ఫ్లోర్ చల్లి కలుపుకుంటే నీరు వచ్చిన ఫ్లోర్ తీసుకుంటుంది..చల్లారనివ్వాలి....
ఈలోగా..
కప్ మైదా, సగం కప్ కార్న్ ఫ్లోర్,ఉప్పు, కొంచెం నిమ్మరసం, oil నీళ్ళు వేసి చపాతి పిండి కంటే కొంచెం లూజ్ కలుపు కొని మూత పెట్టి ఒక అరగంట నాననివ్వాలి.
తరువాత ఉసిరికాయ అంత పిండి తీస్కొని పల్చగా వత్తుకోవాలి...వీలైనంత పల్చగా..
దాని మీద ఒక పక్కగా కూర పెట్టీ రెండు వైపులా మూసి చాపలా కూర తో సహా చుట్టుకొని ఇంకో చివర నీళ్ళ తో కొంచెం తడిపి అంటించేయాలి..అన్ని చేసుకొని కొంచెం తడి ఆరాక మీడియం మంట మీద మెల్లిగా వేయించాలి..తీసి paper మీద వేసుకుంటే నూనె పీల్చుకుంటుంది..👍👍👍👍
Thursday, 23 November 2017
వెజ్ రోల్స్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment