Thursday, 1 February 2018

గుత్తి వంకాయ కూర కారం

కారంపెట్టికూర అని అందరూ చేస్తూ వుంటారు ఈకారాన్ని మేము మినపప్పు కారం అంటాము కూరకారం అంటారు అది రకరకాలుగా చెస్తారు మా వాళ్ళు చాలమంది నీవు చెసినట్లు రాదు మాకు అంటారు మనకే ఒక్కొక్కసారి కుదరదు
ఈ కారంతో వంకాయ దొండకాయ బీరకాయ బెండకాయ లను చేసుకోవచ్చు కావలసినవి....
పచ్చి శనగపప్పు -1కప్
మినపప్పు - 1/2 కప్పు
జీలకర్ర - 1 స్పూన్
మెంతులు - 1 స్పూన్
ఆవాలు- 1స్పూన్
ఎండుమిరపకాయ 3 కప్స్
ధనియాలు నేను వేయను
అన్నీ కొద్దిగా నూనే వేసుకుని సన్నపు సెగమీద వేయించుకోవాలి చల్లారేక వుప్పువేసి మిక్సీలో పౌడర్ చేసుకుని కూరల్లో వాడేసుకోవడమే😊😊
ఈరోజు వంకాయ చేసేను చూడండి

No comments:

Post a Comment