Saturday, 17 February 2018

వంకాయ, మామిడి, కొబ్బరి పచ్చడి (Brinjal chetny)

ఆలూరుకృష్ణప్రసాదు .

ఈ  రోజు  మీకు  వంకాయ , మామిడి కాయ , పచ్చి కొబ్బరి పచ్చడి  గురించి  తెలియ చేస్తాను .

కావలసినవి ---

గుండ్రని  వంకాయలు  --  రెండు
పుల్లని  పచ్చి మామిడికాయ --
పై  చెక్కు  తీసి  ముక్కలుగా  తరిగినవి  ఒక  కప్పు .
పచ్చి  కొబ్బరి కోరు  --  అర కప్పు
కరివేపాకు  --  మూడు  రెమ్మలు
కొత్తిమీర   --   ఒక  కట్ట
పచ్చి  మిర్చి  -   4
పసుపు  --  కొద్దిగా .

పోపు నకు  ---

ఎండు మిరపకాయలు  --  ఆరు 
ఆవాలు  ---  ఒక  స్పూను
మినపప్పు  --  రెండు స్పూన్లు
ఇంగువ  --  కొద్దిగా
నూనె  ---  రెండు  స్పూన్లు
ఉప్పు  --  తగినంత .

తయారు  చేయు  విధానము .

ముందుగా  వంకాయలు  తడి లేకుండా  తుడుచుకుని  కాయ  పైన  కొద్దిగా  నూనె  రాసుకుని  స్టౌ  మీద  సన్నని  మంటలో  కాల్చి  పై  తొక్కు  తీసుకోవాలి .

స్టౌ  మీద  బాండి  పెట్టి  రెండు  స్పూన్లు   నూనె  వేసి  నూనె  కాగాక  ఎండు మిర్చి  మినపప్పు  ఆవాలు  జీలకర్ర   ఇంగువ  కరివేపాకు  వేసి  పోపు  వేయించుకోవాలి .

పోపు  చల్లారగానే  మిక్సీలో  ఎండు మిరపకాయలు , పసుపు , ఉప్పు వేసి  తిప్పుకోవాలి .

తర్వాత  మామిడి కాయ  ముక్కలు   పచ్చిమిర్చి  పచ్చి కొబ్బరి తురుము  వేసి  మరి  పేస్ట్  లా కాకుండా  మిక్సిలో  వేసుకోవాలి .

చివరగా  స్టౌ  మీద  కాల్చి  పై  తొక్క మరియు తొడిమ  తీసిన  వంకాయలు .  కొత్తిమీర , మిగిలిన పోపు  అంతా  వేసి  ఒకసారి  తిప్పుకొని  వేరే  గిన్నెలో  తీసుకోవాలి .

అంతే  కరివేపాకు  , కొత్తిమీర  , మరియు  ఇంగువ  సువాసనలతో  ఘమ ఘమ లాడుతున్న  వంకాయ , మామిడి  కాయ , పచ్చి కొబ్బరి  కలిపిన  పచ్చడి  సర్వింగ్ కు  సిద్ధం.

ఈ పచ్చడి  అన్నంలోకి , దోశెల లోకి మరియు  చపాతీల లోకి  కూడా  బాగుంటుంది .

No comments:

Post a Comment