మిత్రులందరికి శుభోదయం 🙏
ఈ రోజు మా వంటింటి కబుర్లు . Healthy, tasty, dal and vegetable ‘దిబ్బరొట్టె. పేరు ‘సబ్జీకా హాండ్వో’. ( vegitablle Handvo)
ఇందులో శనగపప్పు , పెసరపప్పు , మినపప్పు , , boiled rice,కొన్ని కూరల తరుగు, పచ్చిమిరప, అల్లం, కొతిమేర , నువ్వులు వగైరా. ఆరోగ్యానికి కావలిసిన వన్నీ పడ్డాయి. మళ్ళా కూర తినలేదనే చింత లేదు. వంట చేయటానిక ఓపిక లేనప్పుడు ఈ వంటకం అద్భుతంగా వుంటుంది. నేను ఈరోజు మాఇంట్లో చేసాను. ఎలావుంది మరి? మీరు కూడా try చేస్తారు కదూ.
🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗
సబ్జీకా హండ్వొ. ( vegitable Handvo)
కూరలతో దిబ్బరొట్టె:
తయారీ విధానం ( by Kamala Sistla)
కావలసిన పదార్దాలు:
మినపప్పు: 1/2 కప్పు
శనగపప్పు: 1/2 కప్పు
పెసరపప్పు: 1/2 కప్పు
Boiled rice: 1/2 కప్పు
లేక మామూలు rice
కూరలు: పాలకూర, కారెట్,బంగళదుంప,సొరకాయ
ఈ కూరల తరుగు(తురుము) ప్రతిది పావు కప్పు
ఉల్లిపాయముక్కలు 1/4 కప్పు పచ్చిమిరప ముక్కలు 2 చంచాలు అల్లం ముక్కలు 1 చంచా వెల్లుల్లి కవాలంటె 1 రెబ్బముక్కలు కొతిమేర తరుగు 4 చంచాలు, తగిన వుప్పు, నువ్వులు 4 చంచాలు, 1/4 చక్కర, 1 చంచా ఆవాలు1 చంచా జీలకర్ర
కర్వేపాకు. 2 చంచాల పెరుగు
తయారీ: మినపప్పు, శనగపప్పు , పెసరపప్పు , boiled rice or rice పైన చెప్పిన కొలతల ప్రకారం 5 గంటలు నాన బెట్టి నీళ్ళు వంపి ఒకసారి కడిగి తీసి ఇడ్లీ పిండి మాదిరి రుబ్బుకొని రాత్రంతా మూతపెట్టి వుంచాలి. పొద్దునకు చక్కగా పొంగుతుంది. దానికి తగిన వుప్పువేసి 2 చిటికలు పసుపు కలిపి పక్కన పెట్టండి. తురుము పీటతో పైన చెప్పిన కూరగాయలు తురమండి. నేచెప్పిన కొలత ప్రకారం పిండిలో వేయండి.వుల్లి మిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు , కొతిమేర తరుగు పిండి లో వేయండి. 2 చంచాల తెల్ల నువ్వులు వేయండి. 2 చంచాల పెరుగు వేయండి. వీటన్నిటినిపిండిలో బాగా కలియ బెట్టి 2 నిమిషాలు ఆగండి.
మందపాటి nonstick కడాయిని వేడిచేసి 2 చంచాల నూనెవేసి ఆవాలు , జీలకర్ర, చిట్లించి, నువ్వులు , కర్వాపాకు వేగంగానే రెడీ చేసుకున ప్ండిని ఒకటిన్నర అంగుళాలమందాన పిండి వేసి మూత పేట్టండి.( 3 లేక 4 గరిటెల పిండి) మీడియం మరియు సన్నని సెగమీద పెట్టే వుడకనివ్వండి. అడుగు ఎర్రబడంగానే లేపి పక్కనబెట్టి మరల1 చంచా నూనెవేసి 1 చంచా నూవులు వేగనచ్చి రొట్టెరెండోవైపు వేసి కాలనివ్వండి. అప్పుడు Picture లో మాదిరి కూరల రొట్టె తయారు అవుతుంది.
🍽శుభం🍽
No comments:
Post a Comment