మితృలందరికి శుభోదయం 🌻
మా వంటింటి ఘుమ ఘమలు ( వంకాయ వారోత్సవం)
1. బైంగన్ బర్తా ( కాల్చిన వంకాయతో కూర) ( Punjabi dish)
2. వంకాయ వేపుడు ఖారం (నింపుడు వంకాయ)
3. వంకాయ కాల్చి జీలకర్ర ఖారంతో పచ్చడి.
😀వంకాయ fans అందరికి ఈ post అంకితం😀
బైగన్ బర్తా వంటకం:🍆🍆🍆
( by Kamala sistla)
Baigan bharatha curry
కావలసినది: 1 పెద్ద బుంగ వంకాయ
2. 1 ఉల్లిపాయ
3. 4 నిమ్మకాయ సైజు టమాటాలు
4. 2 చంచాల కొతిమేర తరుగు
5. 1 చంచా ధనియాల పొడి
6. 1/2 చంచా జీలకర్రపొడి
7. 3చంచాల నూనె
8. 1 చంచా అల్లం వెల్లుల్లి పేస్టు
9. తగిన వుప్పు, కారం
మొదటిగా వంకాయ కి నూనె రాసి gas మీద అన్ని వైపులా తిప్పుతూ కాల్చండి. మొత్తం తొక్కు నలుపు గా అవుతుంది. కొంచెంచల్లారాక చేయి తడి చేసుకుని తొక్కు వలచి లోపలి గుజ్జు చాకుతో కోసి ముక్కలు గిన్నెలో పెట్టుకోండి.
ఇప్పుడు ఉల్లిముక్కలు, టమోటా ముక్కలు అల్లంవెల్లుల్లి పేస్టు రెడి చేసుకొండి.
ఒక కడాయి వేడి చేసి నూనె వేసి నూనె కాగంగానే 1/2 చంచా జీలకర్ర వేసి వుల్లిపాయ ముక్కలు వేసి 1 నిమిషం వేయించి అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించి పచ్చి వాసన పోగాన టమేటా ముక్కలు వేసి మగ్గ నియ్యండి. తగిన వుప్పు, కారం వేయండి . టమేటా ముక్కలు మగ్గంగానే వంకాయ గుజ్జు వేసి కలియ తిప్పండి. ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి సన్నని సెగలో 5 నిమిషాలు వుంచండి. ఒకసారి కలియతిప్పి వుప్పు కారం సరిచూసి కొతిమేర తరుగు వేసి కూర దించి serving bowl లో పెట్టుకోండి.
కొతిమేర తరుగు కు బదులువెల్లులి కాడల తరుగు కూడా వేయవచ్చు.
కాల్చినవంకాయ కుండే flavor వల్ల కూర చాలా special గా వుంటుంది.
North లో ఈ కూరలో పచ్చిభఠానీలు కూడా వేసుకుంటారు.
🍆🍆🍆
No comments:
Post a Comment