హలో ఫ్రెండ్స్...డిన్నర్ అయిందా..ఇక పడుకునే ప్రయత్నాలుచెయ్యాలి..నిద్రాదేవికీ..నాకూ పడటంలేదు ఈ మధ్య.మన గ్రూప్ పోస్ట్ లు చూస్తూ కూర్చున్నాను.
సడెన్ గా నా కొక ఐడియా వచ్చిందండీ..
మన గ్రూప్ లో..అధ్భుతమైన..వంట నిపుణులు వున్నారు..
ఈ మాస్టర్ షెఫ్ లందరూ..మనని మించినవాళ్ళేమీ కాదు.కూసింత..స్టైల్..కాసంత పాలిష్..నేర్చుకుంటే..చాలు.
మన గ్రూప్ నుండి ఈ సారి మాస్టర్ షెఫ్ పోటీలకు సభ్యులను పంపిద్దాం....రెడీ కండి..
కాకపోతే..మనం మన వాడుక భాషలో..వంట గురించి చెప్తాము.
"కలపాలి" ..అంటే..మెల్లగా తిప్పాలా..గరిట ..గిరా గిరా తిప్పి..దాన్ని పచ్చడి చెయ్యాలా.్.
అలాంటి వాటికి..వంట భాషలో..కొన్ని పదాలున్నాయి.
మాకు తెలియదా..మగ చెప్పాలా..అనుకుంటారా...
నాకూ..తెలియదు.నేనూ నేర్చుకున్నాను..
నా కన్నా చిన్న పిల్లలకు.. చెప్పాలనిపించింది..
తప్శనుకుంటే...ఈ అక్కను..క్షమించేయండి..
రోజూ వంపయోగించే..చిన్న మాటలే..చెప్తాను...సరేనా...
0 0 0
ముందుగా..కూరలు పళ్ళూలాంటివి కోయటం....
1) Dice it...అంటారు...అంటే ,వెరీ స్మాల్..పీసెస్ గా అన్నమాట.
2) Grate....కోరటం.
3) Cubes..1/2 " ముక్కలుగా..సమానంగా తరగటం.
: : :
వండేటప్పుడు....
1) saute...తిరగమాత లో వేసి మగ్గనివ్వటం.
2) Stir fry..పోపులో వేసి..పాత రోజుల్లో..గిన్నెను..కుదిపేవారు..గుర్తుందా
3)Shallow fry...బాండీ నిండా నూనె పోయకుండా..తగినంత నూనెలో..అటూ..ఇటూ తిప్పుతూ..వేయించటం..మన కాకరకాయ లూ..కట్లెట్లూ..లాగా
4) Deep fry..పకోడీలూ..బజ్జీలు..
5) Roast..మాడ్చి..మంగలం పెట్టటం..అంటే..ఎర్రగా..క్రిస్ప్ గా
* *
ఉడకపెట్టటం..
1)Blanch.. వమరుగుతున్న నీళ్ళలో వేసి..కొన్ని క్షణాలు ( టైము లెక్క వుంటుంది)
వుంచి తీయటం..
2)Boil. వేడి నీళ్ళలో అవసరమైనంత వుడికించటం.
3) Par boil..partially cook by boiling ...
మనం..ఆలూ..చేమదుంప వేపుడికి..కొంచెం వుడికించి ..తర్వాత వేయిస్తాంకదా..
4)Puree ...మిక్సీలో కానీ..గ్రైండర్ లో గానీ..మెత్తగా..పల్ప్ చెయ్యటం.
5). Seasoning..తిరగమాత.. కొత్తమీర.. పుదీనా లాంటివి..పైన వెయ్యటం.
6). Dressing....to coat foods such as salads with seasoning or sauce.
_. _. _
ఇంక..కేక్స్..వగైరాలకు వాడే భాష...
1) Knead..చపాతీ లకు పిండి ముద్ద చేసినట్టు.
2) Blend....రెండు ,మూడు రకాల పదార్ధాలనుచేతితో కానీ..whisk తో కానీ..స్పూన్ తో కానీ కలపటం.
3)Beat.....Stir rapidly with a spoon or Whisk.
4). Cream it....అంటే...Beat sugar with fat.(. నూనెతో కానీ..బటర్ తో కానీ..)
until smooth and fluffy.
5)Whip.... to Incorporate airand produce volume.
6) Whisk....heavy whipping creamలాంటివి..egg whites..Spatula తో బ్రిస్క్ గా కలపటం.
6)Greesing.....కేక్ లాంటివి చేసేటప్పడు..పిండి గిన్నెకు అతుక్కుపోకుండా..నూనె రాయటం.
7)Dusting....కేక్స్ లాంటివి చేసేటప్పుడు..నూనె రాసిన తర్వాత పైన..పిండి చల్లటం.
ఇవండీ..మనకు కావాల్సిన ముఖ్యమైన టెర్మినాలజీ..
మనం డాక్టర్ దగ్గిరకు పోతే..ప్రిస్క్రిప్షన్.. మీద..ఇంత పొడుగున .."Irritable bowel syndrome..అని రాస్తాడు.
మనం హడిలిపోతాం..ఏం రోగమో అని.
ఇంతా చేస్తఘ.."కడుపు పాడవటం"అనే మామూలు రోగం.
అలాగే..కాస్త స్టైల్ గా..షాలో ఫ్రై చేశానూ..డ్రెస్సింగ్ చేశానూ..అంటే..ఆ..తీరే వేరు..
అందానికి అలంకారం లాగా..వంట భాషే వేరు..
ఇక...ట్యూషన్ చాలు కదా..చాలా..సింపుల్ వీ..ముఖ్యమైనవే..చెప్పాను..
తప్పు చెప్తే..నన్ను కరెక్ట్ చెయ్యండి.దిద్దుకుంటాను.
ఇంతకూ..ఇవాల్టి వంట చెప్పలేదు కదూ..
బెండకాయ ఫ్రై..మినపప్పు వేయించి పచ్చడీ..బీరకాయ కూర..మధ్యాహ్నం ఉప్పుడు పిండీ..
ఎడ్మిన్ సార్ కి..నమస్కారం..ఇవన్నీ..వంటకి .. తప్పనిసరిగా తెలుసుకోదగ్గ భాష అనే వుద్దేశ్యంతో వ్రాశానండీ..మీరు అనుమతి యిస్తేనే....పోస్ట్ అవుతుంది.
No comments:
Post a Comment