Monday, 12 February 2018

బీట్ రూట్ తో రోటి పచ్చడి (Beetroot chetny)

బీట్ రూట్ తో రోటి పచ్చడి

కావలసినవి:

         బీట్ రూట్ పావుకెజి తీసు కుని శుభ్రంగా కడిగి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలు గా కట్ చేయాలి.4ఎండు మిరపకాయలు 4 పచ్చిమిరప కాయలు చెంచా మినప పప్పు  చెంచా శనగపప్పు  అర చెంచా జీల కర్ర  ఐదారు వెల్లుల్లి రెమ్మలు చిన్న నిమ్మకాయంత చింత పండు సరి పడా ఉప్పు

తయారి:
 
పాన్లో నూనె వేసి ముందు మిరప కాయలు శనగపప్పు 
మిన పపు జీలకర్ర  వేయించి ఓక ప్లేట్ లోకి తీసు కోవాలి. బీట్ రూట్ ముక్కలు వేసి ఓక నిముషం వేయించి ఉప్పు చింత పండు వేసి మూత పెట్టాలి.
ముక్క లు మెత్తబడిందాక వేయించాలి .వేగినవి చల్లారన తరువాత రోట్లో వేసి నూరి తాలింపు పెట్టాలి.

ఈ పచ్చడి రైస్ ,చపాతీ,దోశ లోకి చాల బాగుంటుంది!!

No comments:

Post a Comment