Thursday, 1 February 2018

కోవా కజ్జికాయలు

"నీకు ఎదో అయ్యింది " అన్నారు మావారు... "నీకు ఎదో పూనింది" లాగ వినపడింది నాకు... అంటే, అర్ధాంగిని కదండీ. అన్ని అర్థం అవుతాయి... విషయమేమంటే,  సడన్ గా కోవా కజ్జికాయలు చేసి ఆయనకీ ఫోటో పంపించాను. . చెయ్యాలని అనుకోలేదు అసలు. అనుకుని ఉంటే, కొంచెం previous recipe లు  చూసేదాన్ని. ఈ particular స్వీట్ నా చిన్నతనం నుంచి నాకు చాల చాల ఇష్టం. కోవా కజ్జికాయలు చేసేవారంటే చాల భయంగా + భక్తి గా  ఉండేది నాకు. మా నాన్న గారి, మేనత్తలు చాల అలవోకగా  చేసేసేవారు. "అన్నపూర్ణ మానవ రూపేణా"  అన్నట్లు వుంటారు.

ఇంతకు కోవా కజ్జికాయలు మాత్రమే చెయ్యాలని ఎందుకనిపించింది అంటే , ఇవ్వాళనేను ఇంట్లోంచి వర్క్ చేశాను. ఒక రెండు గ్లోబల్ townhall మీటింగ్స్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఒక్కోటి ఒక్కొక్క గంట. ఇంట్లోంచి వర్క్ అప్పుడు  మీటింగ్ మీద  ఫోకస్ చెయ్యాలి అంటే, ఏదైనా ఏకాగ్రత కావాలి.. మొదటి గంట లో కొబ్బరి బెల్లం ఉండలు (ఫిల్లింగ్ కోసం ) , రెండవ గంటలో కోవా అయ్యిపోయాయి. .. దీక్షగా పాలకోవా కలుపుతూ , మీటింగ్ శ్రద్హగా విన్నాను. పొయ్యి మీదినుంచి చూపు చెప్పలేదు,  చేతులు కలపటం ఆపలేదు. చెవులలోంచి మీటింగ్ కంటెంట్ వినపడుతోంది. ఒక గంట. అంతే.. పని అయిపొయింది.

But, కోవా ఇంకా బాగా రావాలి నాకు. బయట కోవా  ఎందుకో నాకు ఇష్టం లేదు. కోవా చెయ్యటం చెయ్యి తిరిగితే, మిగిలింది ఆడుతూ పాడుతూ చేసెయ్యచ్చు..  మీలో ఎవరైనా ఇది ఇంకా బాగా ఎలా చెయ్యాలో చెపితే, ధన్యోస్మి.. !!

మీకు కుదిరితే, ఇంకా చూడకపోతే, "Akeelah and the Bee " అనే సినిమా చూడండి.. ఇంట్లో 6 - 19 సంవత్సరాల పిల్లలు ఉంటే చూపించండి. Speeling Bee కి Akeelah అనే అమ్మాయి ప్రిపేర్ అవ్వటం ఇతివృత్తం. మెయిన్ గ, ఆ అమ్మాయికి spellings నేర్పటానికి టీచర్ స్కిప్పింగ్   (దాన్నీ ఇక్కడ Jump Rope అంటారు)  చేయిస్తాడు. ఆ  అమ్మాయి స్పెల్లింగ్ చదువుతూ జంప్ రోప్ చేస్తుంది.. ఆలా , చాల త్వరగా , చాలా స్పెల్లింగ్స్ నేర్చుకుంటుంది. ఏదైనా పని  ఏకాగ్రతతో చెయ్యాలి అంటే, ఒక రొటీన్ physical activity తో కలిపి ప్రాక్టీస్ చెయ్యాలి అంటారు. అప్పుడు మెదడుకి బాగా ఎక్కుతుందిట. అది ఇవ్వాళ నేను ప్రాక్టికల్ గా చూసాను.

Process:
కొబ్బరి ఉండలు: పచ్చి కొబ్బరి కొంచెం నెయ్యి వేసి,  కొంచెం యాలకుల పొడి వేసి దోరగా వేయించాను. చివరలో బెల్లం పొడి (స్వీట్ లెవెల్ చూసుకుని వేసుకోండి) కలిపి బాగా కలిసేలా సన్నటి సెగ మీద వుంచాను. కొద్దిగా వేడి గా ఉండగానే, కొంచెం నెయ్యి రాసుకుని, సన్నగా పొడవుగా కొన్ని ఉండలు, రౌండ్ గ కొన్ని ఉండలు చేసి పక్కన పెట్టాను.

కోవా: వెడల్పాటి , మందం గా వుండే పాన్ లో , మిల్క్ వేసి, సన్నటి సెగ మీద కలుపుతూనే కలుపుతూనే కలుపుతూనే ఉండాలి. మీగడ అస్సలు కట్టకుండా కలపాలి. అప్పుడు మీగడ పాలల్లో కలిసి మంచి టేస్ట్ వస్తుంది + కోవా చేసేటప్పుడు soft గా వస్తుంది. పాలు దాదాపు 25 % అయ్యాక కొంచెం semi solid state కి వస్తుంది. బాగా దగ్గర పడుతున్నప్పుడు కొంచెం స్వీట్ కి సరిపడా షుగర్ కలిపి హై flame లో కలియపెట్టండి. చక్కటి చిక్కని కోవా వస్తుంది. అది కొంచెం వేడి గా వున్నప్పుడు, నెయ్యి రాసుకుని చిన్న చిన్న చపాతీ లాగ పరిచి, మన కొబ్బరి ఉండలు మధ్యలో పెట్టి నెయ్యి రాసుకుని చుట్టేయండి. కోవా కొంచెం గట్టి గ వస్తే, చుట్టటం ఈజీ గ ఉంటుంది.  Happy Making..!!

No comments:

Post a Comment