Friday, 20 April 2018

మైసూర్ బజ్జీ (Mysore Bajji)

మైసూర్  బజ్జీ

తొందరగా తయారయ్యే ఒక చక్కటి స్నాక్

ఒక కప్పు మైదా, పావు కప్పు బియ్యం పిండి, తగినంత ఉప్పు, చిటికెడు వంట సోడా, జిలకర, అల్లం, సన్నగ తరిగిన పచ్చిమిర్చి, చంచా పచ్చి కొబ్బరి తురుము,రెండు చంచా పుల్ల పెరుగు, తగినన్ని నీరు కలిపి మినప వడ పిండిలా తడపాలి. వేడి నూనెలో సన్నటిమంటపై బజ్జీలను దోరగ కాల్చాలి. కొబ్బరి చట్నీ తో సూపర్ గ ఉంటుంది.

కొబ్బరి చట్నీ కొరకు పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి రుబ్బుకుని, నిమ్మరసం పిండి, ఆవాలు, జిలకర, ఇంగువ మంచి నూనెలో పోపు వెయ్యాలి.

మైసూర్ బజ్జీ లో సన్నగ తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర కూడ వేసుకోవచ్చు. ఇక్కడ ఒక నజరాన మీకు చప్తాను... మిగిలి పోయిన పెరుగు చట్నీ ఉంటే దాంట్లో మైదా, బియ్యంపిండి, జిలకర, అల్లం కలిపి మైసూర్ బజ్జీ వేసుకోవచ్చు.

No comments:

Post a Comment