చడ!
~~~~
ఏంటబ్బా యీ వింతవంటకం?
అనుకున్నారా....స్పెల్ మిస్టేక్ అనుకున్నారుకదూ!
కాదు నేను పెట్టిన పేరు!నామౌచిత్యమేమనగా.....
మనందరికి అయిదు పదార్థాలతో చేసుకునే అడ సుపరిచితం.
సాధారణంగా మధ్యాహ్నభోజనానంతరం పప్పులు నానబోసి రాత్రి టిఫిన్ గా చేసుకుంటాం కదా.
శనగ.. పెసర..మినప .. కంది పప్పు...బియ్యం ... అన్నీసమపాళ్లలో తీసుకుని మూడు నాలుగు గంటలు నానాక రుబ్బి మనమన యిష్టానుసారం ఉల్లిపాయముక్కలు.. పచ్చిమిర్చి. .కొబ్బరి... అల్లం .. జీలకర్ర వంటి extras తోసింగారిస్తూ యీజీగా పెనం మించి ఊడిపడే “అడ “లోంచి మిక్సీ కి పొట్టకీ కూడా బరువయ్యే కందిని తొలగించి ....దోశలు వేయండి ... చాలా తేలికగా అనిపించింది. అందుకే అయిదుతో “అడ “కనుక నాలుగు తో దీనికి “చడ” అని పేరుపెట్టాను.
హెల్దీ కనుక తప్పక చేయండి .
పులియపెట్టే పని లేదు.
చాలా సన్నగా పెసరట్టు లా వేసుకోవచ్చు.
No comments:
Post a Comment