మితృలందరికి శుభోదయం🙏
ఆదివారం మద్యాహ్నం చేసిన స్వీటు. డబల్ కా మీటా ( హైదరాబాదీ వంటకం.) Hedersbad city లో చాలా popular sweet. US లో ‘Donut’ కి ఎంత craze వుందో డబల్ కా మీటా Hyderabad లో అంతే. అచ్చమైన తెలుగులో ‘ Bread Halwa.’ అంటారు.
మీలో ఎంతమందికి ఇష్టంమరి?
డబల్ కా మీటా తయారీ:
4 white bread slices ( అంచులు తీసివేసి ముక్కలు చేయండి) నూనెలో కొంచెం నేయి వేసి , bread ముక్కలు golden brown వచ్చేవరకు వేయించి పక్కన పెట్టండి.
తరువాత 1 కప్పు చిక్కని పాలు మరిగించి1/4 కోవా అందులో బాగా కలిపి వేయించిన bread ముక్కలని అందులో నాన బెట్టండి.
ఇప్పుడు 1cup చక్కర పాకంపట్టి ( one string ) ఇలాచి పొడి వేసి నానపెట్టిన bread mixture లో పోసి బాగా కలియతిప్పాలి. దానిలో వేయించిన జీడిపప్పు ముక్కలు, బాదం, కిస్ మిస్ వేసి కలపాలి. 2 గంటల తరువాత పాకం bread mixture లో కలిసి హల్వ లాగా తయారవుతుంది. దీనినే ‘ డబల్ కా మీటా’. అంటారు.దీని రుచి అమోఘం.👌
No comments:
Post a Comment