బిసి బేళే భాత్
బిసి బేళే హుళి అన్న
సింపుల్ గా చెప్పాలి అంటే వేడి వేడి పప్పు పులుసన్నం....
ఇవి ముందు రెడీ చేసు కోండి
1. చెరొక చెంచా ఆవాలు, జిలకర, మెంతులు, మిరియాలు. నాలుగు చెంచా ధనియాలు, ఐదు చెంచా కారం పుడి,చిటికెడు ఇంగువ, పసుపు... డ్రై రోస్ట్ చేసి పొడి.(చారు పొడి) ఈ పొడి రౌడీగా ఉంచుకుంటే మోసం ఆఫ్ మై రెసిపీ చేసుకోవచ్చు.
2. చెంచాడు సెనగ పప్పు, మిన పప్పు, జిలకర, కరివేపాకు, 2 చెంచా ధనియా, చిన్న దాల్చిన చెక్క, రెండు లవంగాలు, పచ్చి కొబ్బరి ముక్క, కారం పుడి, ఇంగువ,పసుపు . చెంచాడు మంచి నూనెలో వేయించి నీరుపోసి చిక్కగ రుబ్బుకోవాలి.
3. సగం కప్ బియ్యం , 3/4 కప్ కంది పప్పు పసుపు నూనె వేసి మెత్తగ ఉడక పెట్టుకోవాలి.
4. నానబెట్టిన అలలందులు ఉడికించి పెట్టు కోవాలి.(optional)
కారెట్, బీన్స, కాప్సికం, ఆలు పొడవుగ తరుగుకుని, ఉప్పు పసుపు వేసి ఉడికించి, రెండు దేసి టమాట రుబ్బి కలిపి, చింత పండు రసం, కొద్దిగ బెల్లం వేసి, చారుపొడి, రుబ్బిన మసాల వేసి ఉడికించి, తగినంత ఉప్పు, ఉడికించిన అన్నం పప్పు, అలసందలు వేసి ఉడక నివ్వాలి. అవసరమైతే నీరు వేయ్యాలి. చల్లారాక చిక్క బడుతుంది.
ఇక లాస్ట్ లో పోపు
సన్నగ తరిగిన ఉల్లిముక్కలు గోల్డన్గా వేయించి వేస్తాను
నెయ్యిలో ఆవాలు ,జిలకర, పల్లీలు, ఇంగువ ,పసుపు రెండో పోపు వేస్తాను.
బూందీ కొత్తిమీర తో గార్నిష్
No comments:
Post a Comment