మాగాయ పచ్చడి:
4 పుల్లని పచ్చి మామిడికాయలు (హస్తంసైజు)
120 గ్రాముల ఉప్పు
120 గ్రాముల కారం( 3 మాంగోస్)
2 table spoons వేయించిన మెంతిపిండి(మెంతులు సన్న సెగమీదవేయించి పొడి చేసుకోవలస)
1 table spoon ఆవపిండి
పచ్చళ్ళ ఇంగువ 2 శనగబద్దలం
చిటికెడు పసుపు
తయారీ:
మామిడికాయలు కడిగి తుడిచి తొక్కతీసి ముక్కలు పల్చగా పొడుగ్గా కోసి ఉప్పు పసుపు బాగా కలిపి జాడీలో వుంచాలి.
3 రోజు ముక్కలను నొక్కిబయటకు తీసి ఊట జాడీలోనే వుంచాలి. ఈముక్కలని 2 రోజులు, ఊటను 1 రోజు ఎండలో వుంచాలి. మరలా 3 రోజు కారం, మెంతిపిండి, ఆవపొడి సిధ్ధం చేసుకొని. ముక్కలను ఒక వెడల్పుబేసిన్ లోవేసి కారం, ఆవపిండి, మెంతిపిండి వేసి కలిపి ఊటపోసి బాగా కలపాలి.
ఒకకప్పు నూనె కాచి ( పప్పు నూనె)ఆవాలు జీలకర్ర, ఇంగువ వేసి పోపు తయారు చేసి నూనె కొంచెం చల్లారాక పచ్చడి మీదపోసి కలెదిప్పి 5 నిమిషాల తరువాత జాడీలో పెట్టు కోవాలి. తడి తగలరాదు. చిన్నరసాలు(పచ్చివి) ఈ పచ్చడికి బాగుంటాయి.కారం మంచి ఎరుపు రంగుది ఎంచుకోవాలి.
మీరు చేసాక నాకు ఎలావుందో చెప్పండి.
Wednesday, 4 April 2018
మాగాయ (Magai)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment