Showing posts with label Courtesy : Harini Balakishan. Show all posts
Showing posts with label Courtesy : Harini Balakishan. Show all posts

Wednesday, 20 June 2018

మైసూర్ పాక్ (Mysore pak)

మైసూర్ పాక్

* రెండు కప్పు చక్కర్లో పావు కప్పు నీరు పోసి వేడి చేయ్యాల
* ఈలోపు ఇంకో పొయ్యిమీద ఒక కప్పు నెయ్యి, ఒక కప్పు సన్ఫ్లవర్ నూనె వేసి వేడి చేయ్యాల
* చక్కర కరిగిన తర్వాత ఒక కప్పు సెనగ పిండి వేసి ఉండలు లేకుండ కలపాల
* కలుపుతూ కలుపుతూ వేడి నెయ్యి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగ వేస్తూ కలుపుతూ ఉండాల
* సన్నమంటపైనే చేయ్యాల
* నూనె వెయ్యడం అయిపోయేలోపు  మైసూర పాక్ పొంగినూనె బయటికి వదులుతుంది
* ఇప్పుడు ప్లేట్లో వేసి వడిగ ఉన్నప్పుడు ముక్కలు కట్ చేయ్యాల
* ఎక్కువ సేపు పొయ్యి మీద ఉంచితే గట్టిగ అయి పనికిరాకుండా అవుతుంది
* కొంచం తొందరగ తీస్తే చింతలేదు సాఫ్ట్ సాఫ్ట్ గ ‘మైసూర్పా’ తయారవుతుంది

Wednesday, 9 May 2018

పావ్ బాజీ (Pav Baaji)

పావ్ (బ్రెడ్) బాజీ

*మసలుతున్న నీటిలో నాలుగు టమాటోలు ఉడకబెట్టుకుని , రుబ్బి ఉంచాలి.
*రెండు ఉల్లిగడ్డలు సన్నగ తరగాలి.
*కొత్తిమీర తరుగుకోవాలి.
*రెండు ఉడకబెట్టిన ఆలు గడ్డలను పొట్టు తీసి స్మాష్ చేయ్యాలి.
*వెల్లుల్లి రెబ్బలు కొన్ని దంచు కోవాలి.
*మూకుడులో చెరొక చంచా వెన్న, నూనె వేసి ,వెల్లుల్లి వేసి, దోరగ అయిన తర్వాత ఉల్లితరుగు , ఉప్పు వేసి, దోరగ అయ్యేవరకు వేపి స్పీన్నున్నర ఎవరెస్ట్ పావ్ బాజీ మసాల,లఒక స్పూన్ కారంపుడి వేసి కలిపి,
*ఆలుగడ్డలు, టమాట జూస్ వేసి కొద్దిగ నీరు వేసి,
*మసలుతున్నప్పుడు రెండు చంచా వెన్న , అర చంచా పావ్ బాజీ మసాల   వేసి,గార్నిష్ చేసుకోవాలి.

ఇక్కడ నేను బేసిక్ బాజీ రెసిపీ చెప్పాను.కాలిఫ్లవర్, కాపిసకమ్, బటాణి కూడ వేసుకోవచ్చు.

బ్రెడ్ స్లైసస్ ని వెన్నతో టోస్ట్  చేసి , పైన పావ్ బాజీ మసాల వేసుకోవాలి. ( నాకు పావ్ బ్రెడ్ కన్నా మామూలు బ్రెడ్ నచ్చుతుంది) వేడి వేడి గ తినడమే.

Friday, 20 April 2018

మైసూర్ బజ్జీ (Mysore Bajji)

మైసూర్  బజ్జీ

తొందరగా తయారయ్యే ఒక చక్కటి స్నాక్

ఒక కప్పు మైదా, పావు కప్పు బియ్యం పిండి, తగినంత ఉప్పు, చిటికెడు వంట సోడా, జిలకర, అల్లం, సన్నగ తరిగిన పచ్చిమిర్చి, చంచా పచ్చి కొబ్బరి తురుము,రెండు చంచా పుల్ల పెరుగు, తగినన్ని నీరు కలిపి మినప వడ పిండిలా తడపాలి. వేడి నూనెలో సన్నటిమంటపై బజ్జీలను దోరగ కాల్చాలి. కొబ్బరి చట్నీ తో సూపర్ గ ఉంటుంది.

కొబ్బరి చట్నీ కొరకు పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి రుబ్బుకుని, నిమ్మరసం పిండి, ఆవాలు, జిలకర, ఇంగువ మంచి నూనెలో పోపు వెయ్యాలి.

మైసూర్ బజ్జీ లో సన్నగ తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర కూడ వేసుకోవచ్చు. ఇక్కడ ఒక నజరాన మీకు చప్తాను... మిగిలి పోయిన పెరుగు చట్నీ ఉంటే దాంట్లో మైదా, బియ్యంపిండి, జిలకర, అల్లం కలిపి మైసూర్ బజ్జీ వేసుకోవచ్చు.

Wednesday, 11 April 2018

బిసి బేళే బాత్

బిసి బేళే భాత్
బిసి బేళే హుళి అన్న

సింపుల్ గా చెప్పాలి అంటే వేడి వేడి పప్పు పులుసన్నం....

ఇవి ముందు రెడీ చేసు కోండి

1.  చెరొక చెంచా ఆవాలు, జిలకర, మెంతులు, మిరియాలు. నాలుగు చెంచా ధనియాలు, ఐదు చెంచా కారం పుడి,చిటికెడు ఇంగువ, పసుపు... డ్రై రోస్ట్ చేసి పొడి.(చారు పొడి) ఈ పొడి రౌడీగా ఉంచుకుంటే మోసం ఆఫ్ మై రెసిపీ చేసుకోవచ్చు.
2. చెంచాడు సెనగ పప్పు, మిన పప్పు, జిలకర, కరివేపాకు, 2 చెంచా ధనియా, చిన్న దాల్చిన చెక్క, రెండు లవంగాలు, పచ్చి కొబ్బరి ముక్క, కారం పుడి, ఇంగువ,పసుపు . చెంచాడు మంచి నూనెలో వేయించి నీరుపోసి చిక్కగ రుబ్బుకోవాలి.
3. సగం కప్ బియ్యం , 3/4 కప్ కంది పప్పు పసుపు నూనె వేసి మెత్తగ ఉడక పెట్టుకోవాలి.
4. నానబెట్టిన అలలందులు ఉడికించి పెట్టు కోవాలి.(optional)

కారెట్, బీన్స, కాప్సికం, ఆలు పొడవుగ తరుగుకుని, ఉప్పు పసుపు వేసి ఉడికించి, రెండు దేసి టమాట రుబ్బి కలిపి, చింత పండు రసం, కొద్దిగ బెల్లం వేసి, చారుపొడి, రుబ్బిన మసాల వేసి ఉడికించి, తగినంత ఉప్పు, ఉడికించిన అన్నం పప్పు, అలసందలు వేసి ఉడక నివ్వాలి. అవసరమైతే నీరు వేయ్యాలి. చల్లారాక చిక్క బడుతుంది.

ఇక లాస్ట్ లో పోపు

సన్నగ తరిగిన ఉల్లిముక్కలు గోల్డన్గా వేయించి వేస్తాను
నెయ్యిలో ఆవాలు ,జిలకర, పల్లీలు, ఇంగువ ,పసుపు  రెండో పోపు వేస్తాను.

బూందీ కొత్తిమీర తో గార్నిష్