బియ్యం కడిగి నీడన బాగా అరా క మె త్తగా పిండి ఆడిo చాలి.దాని లో కొంచెం వెన్న నాని న పచ్చి శెనగ పప్పు లేక పెసర పప్పు ఉప్పు కారం తెల్ల నువ్వులు వాము వేసి గోరువెచ్చని నీ టితో పిండి గట్టిగా కలు పాలి.చిన్న బాల్స్ చేసి పాలతిన్ పే పర్ మీద నూనె రాసి బాల్స్ ను రౌo డ్ గా పలుచగా వత్తి మీడియం ఫ్లేమెలో వేయించాలి
Monday, 30 April 2018
Friday, 20 April 2018
మైసూర్ బజ్జీ (Mysore Bajji)
మైసూర్ బజ్జీ
తొందరగా తయారయ్యే ఒక చక్కటి స్నాక్
ఒక కప్పు మైదా, పావు కప్పు బియ్యం పిండి, తగినంత ఉప్పు, చిటికెడు వంట సోడా, జిలకర, అల్లం, సన్నగ తరిగిన పచ్చిమిర్చి, చంచా పచ్చి కొబ్బరి తురుము,రెండు చంచా పుల్ల పెరుగు, తగినన్ని నీరు కలిపి మినప వడ పిండిలా తడపాలి. వేడి నూనెలో సన్నటిమంటపై బజ్జీలను దోరగ కాల్చాలి. కొబ్బరి చట్నీ తో సూపర్ గ ఉంటుంది.
కొబ్బరి చట్నీ కొరకు పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి రుబ్బుకుని, నిమ్మరసం పిండి, ఆవాలు, జిలకర, ఇంగువ మంచి నూనెలో పోపు వెయ్యాలి.
మైసూర్ బజ్జీ లో సన్నగ తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర కూడ వేసుకోవచ్చు. ఇక్కడ ఒక నజరాన మీకు చప్తాను... మిగిలి పోయిన పెరుగు చట్నీ ఉంటే దాంట్లో మైదా, బియ్యంపిండి, జిలకర, అల్లం కలిపి మైసూర్ బజ్జీ వేసుకోవచ్చు.
Thursday, 19 April 2018
అడ కాదు చడ
చడ!
~~~~
ఏంటబ్బా యీ వింతవంటకం?
అనుకున్నారా....స్పెల్ మిస్టేక్ అనుకున్నారుకదూ!
కాదు నేను పెట్టిన పేరు!నామౌచిత్యమేమనగా.....
మనందరికి అయిదు పదార్థాలతో చేసుకునే అడ సుపరిచితం.
సాధారణంగా మధ్యాహ్నభోజనానంతరం పప్పులు నానబోసి రాత్రి టిఫిన్ గా చేసుకుంటాం కదా.
శనగ.. పెసర..మినప .. కంది పప్పు...బియ్యం ... అన్నీసమపాళ్లలో తీసుకుని మూడు నాలుగు గంటలు నానాక రుబ్బి మనమన యిష్టానుసారం ఉల్లిపాయముక్కలు.. పచ్చిమిర్చి. .కొబ్బరి... అల్లం .. జీలకర్ర వంటి extras తోసింగారిస్తూ యీజీగా పెనం మించి ఊడిపడే “అడ “లోంచి మిక్సీ కి పొట్టకీ కూడా బరువయ్యే కందిని తొలగించి ....దోశలు వేయండి ... చాలా తేలికగా అనిపించింది. అందుకే అయిదుతో “అడ “కనుక నాలుగు తో దీనికి “చడ” అని పేరుపెట్టాను.
హెల్దీ కనుక తప్పక చేయండి .
పులియపెట్టే పని లేదు.
చాలా సన్నగా పెసరట్టు లా వేసుకోవచ్చు.
Wednesday, 18 April 2018
కూరలతో రసం (Vegetables Special Juice)
మితృలందరికి శుభోదయం🙏
యండాకాలం. అందరికి ఏవైన పళ్ళరసం చల్ల చల్లగా తాగాలన పించటం సహజం. మేము అలాగే తలచి కూరలు కాడా వేసి ఈ special juice చేసుకున్నాం.
ఇందులో బీట్రూట్, కారెట్, యాపిల్ మరియు టమోటా. ప్రతి juice glass కి లో 10 చుక్కల నిమ్మరసం,4 ఐసు ముక్కలు. అంతే. భలే వుంది. ఇది ఉదయం పూట తాగితే మంచిది. మెత్తని పిప్పి ( roughage) తోసహా తాగడం శ్రేయస్కరం.
Tuesday, 17 April 2018
డబుల్ కా మీఠా
మితృలందరికి శుభోదయం🙏
ఆదివారం మద్యాహ్నం చేసిన స్వీటు. డబల్ కా మీటా ( హైదరాబాదీ వంటకం.) Hedersbad city లో చాలా popular sweet. US లో ‘Donut’ కి ఎంత craze వుందో డబల్ కా మీటా Hyderabad లో అంతే. అచ్చమైన తెలుగులో ‘ Bread Halwa.’ అంటారు.
మీలో ఎంతమందికి ఇష్టంమరి?
డబల్ కా మీటా తయారీ:
4 white bread slices ( అంచులు తీసివేసి ముక్కలు చేయండి) నూనెలో కొంచెం నేయి వేసి , bread ముక్కలు golden brown వచ్చేవరకు వేయించి పక్కన పెట్టండి.
తరువాత 1 కప్పు చిక్కని పాలు మరిగించి1/4 కోవా అందులో బాగా కలిపి వేయించిన bread ముక్కలని అందులో నాన బెట్టండి.
ఇప్పుడు 1cup చక్కర పాకంపట్టి ( one string ) ఇలాచి పొడి వేసి నానపెట్టిన bread mixture లో పోసి బాగా కలియతిప్పాలి. దానిలో వేయించిన జీడిపప్పు ముక్కలు, బాదం, కిస్ మిస్ వేసి కలపాలి. 2 గంటల తరువాత పాకం bread mixture లో కలిసి హల్వ లాగా తయారవుతుంది. దీనినే ‘ డబల్ కా మీటా’. అంటారు.దీని రుచి అమోఘం.👌
Saturday, 14 April 2018
క్యాలీఫ్లవర్ వేపుడు (Cauli flower fry)
Cauliflower ముక్కలు కడిగి తెర్లుతున్న నీళ్ళలో 2 నిమిషాలు వుంచి బయటకు తీయండి. 1/4 కప్పు బియ్యపిండిలో 1 పెద్దచంచా కారం , వుప్పు, ధనియాలపొడి , జీలకర్ర కలిపి ఈ mixture ముక్కలకి పట్టించి 2 పెద్ద చంచాల నూనె లో వేయించిన కోవాలి. వేగాక మరలా కొద్దిగా కారం చల్లి దింపుకోవాలి. Kashmiri chilli powder వాడండి.
Thursday, 12 April 2018
వంగీ బాత్ (వంకాయ అన్నం) (Vangi bath)
Vangi bath recipe
For powder:
Dry roast chanadal, urad dal, cumicseeds, jeera, coriander, redchilli, Coconut.. and grind.
Cooking:
Add ghee urad dal, chana dal, mustardseeds, onions and curry leaves till onions turn colour, add brinjal piece, turmeric, and salt, close with lid and cook for 10-15 min now add tamarind puree now add rice (cooked rice)
Wednesday, 11 April 2018
అటుకులతో పోహా (Poha)
Poha తయారు చేసే విధానము అటుకులు నీళ్ళతో కడుగవలేను తరువాత నీరు అంతా వార్చీ పక్కకు పెట్టుకోవలేను తరువాత కళాయిలో నూనె వేయవలేను మినపప్పు ఆవాలు శనగపప్పు శనగపలుకులు వేగినతరవాత ఉల్లి చెక్కు టమాట చెక్కు వేయవలేను అవి వేగినతరువాత అటుకులు సాల్ట్ వేయవలేను అంతే ఎంతోరుచికరమైన Poha రడీ..
బిసి బేళే బాత్
బిసి బేళే భాత్
బిసి బేళే హుళి అన్న
సింపుల్ గా చెప్పాలి అంటే వేడి వేడి పప్పు పులుసన్నం....
ఇవి ముందు రెడీ చేసు కోండి
1. చెరొక చెంచా ఆవాలు, జిలకర, మెంతులు, మిరియాలు. నాలుగు చెంచా ధనియాలు, ఐదు చెంచా కారం పుడి,చిటికెడు ఇంగువ, పసుపు... డ్రై రోస్ట్ చేసి పొడి.(చారు పొడి) ఈ పొడి రౌడీగా ఉంచుకుంటే మోసం ఆఫ్ మై రెసిపీ చేసుకోవచ్చు.
2. చెంచాడు సెనగ పప్పు, మిన పప్పు, జిలకర, కరివేపాకు, 2 చెంచా ధనియా, చిన్న దాల్చిన చెక్క, రెండు లవంగాలు, పచ్చి కొబ్బరి ముక్క, కారం పుడి, ఇంగువ,పసుపు . చెంచాడు మంచి నూనెలో వేయించి నీరుపోసి చిక్కగ రుబ్బుకోవాలి.
3. సగం కప్ బియ్యం , 3/4 కప్ కంది పప్పు పసుపు నూనె వేసి మెత్తగ ఉడక పెట్టుకోవాలి.
4. నానబెట్టిన అలలందులు ఉడికించి పెట్టు కోవాలి.(optional)
కారెట్, బీన్స, కాప్సికం, ఆలు పొడవుగ తరుగుకుని, ఉప్పు పసుపు వేసి ఉడికించి, రెండు దేసి టమాట రుబ్బి కలిపి, చింత పండు రసం, కొద్దిగ బెల్లం వేసి, చారుపొడి, రుబ్బిన మసాల వేసి ఉడికించి, తగినంత ఉప్పు, ఉడికించిన అన్నం పప్పు, అలసందలు వేసి ఉడక నివ్వాలి. అవసరమైతే నీరు వేయ్యాలి. చల్లారాక చిక్క బడుతుంది.
ఇక లాస్ట్ లో పోపు
సన్నగ తరిగిన ఉల్లిముక్కలు గోల్డన్గా వేయించి వేస్తాను
నెయ్యిలో ఆవాలు ,జిలకర, పల్లీలు, ఇంగువ ,పసుపు రెండో పోపు వేస్తాను.
బూందీ కొత్తిమీర తో గార్నిష్
Tuesday, 10 April 2018
కలాఖండ్ (Kala khand)
కలాఖండ్ చేసానండి.. ఇంట్లో చేసుకుంటే తాజాగా, రుచికరంగా
ఉంటుంది. రెసిపీ చెప్పేస్తున్నా...
తయారీ విధానం:
1 లీటర్ చిక్కని పాలు తీసుకుని బాగా మరిగించి , మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పాలు కొంచెం ఇగిరాక ఒక నిమ్మకాయ రసం తీసి నీళ్ళల్లో కలిపి కొంచెం కొంచెం పాలల్లో వేసి కలిపాలి. పాలు విరిగాక నీళ్లు తీసేసి చన ను మళ్ళీ స్టవ్ మీద పెట్టి 2 కప్స్ పంచదార వేసి బాగా కలుపుతూ దగ్గర పడ్డాక ఒక ప్లేట్ కి నెయ్యి రాసి మిశ్రమాన్ని దానిలో వేసి చల్లారాక ముక్కలుగా cut చేసుకోవాలి.
చూసి చెప్పండి.. మీరూ try చెయ్యండి..
పైన ఏవో వేసి decorate చేసాను లెండి.. తినేయండి కళ్ళతో..
Monday, 9 April 2018
పానీపూరి (Pani Puri)
alu,pachi bathani,boil chesi andulo uppu,kaaram,chat masala ,adi lekunte panipuri masala ,kottimeera,
pudeenaa akulu vesi kalapali ante andi
Thursday, 5 April 2018
మెంతి వంకాయ కూర
ఆలూరుకృష్ణప్రసాదు .
మెంతి వంకాయ కూర.
కావలసిన పదార్థములు.
చిన్నవి గుండ్రని వంకాయలు ---
అర కిలో
పచ్చి శనగపప్పు -- 30 గ్రాములు
చాయ మినపప్పు - 20 గ్రాములు .
మెంతులు --- మూడు టీ స్పూన్లు .
జీలకర్ర -- అర స్పూను
ఆవాలు -- పావు స్పూను
ఇంగువ -- కొద్దిగా
ఎండు మిరపకాయలు -- 15
ఉప్పు --- తగినంత
పసుపు -- కొద్దిగా
నూనె -- 150 గ్రాములు .
తయారు చేయు విధానము .
ముందుగా స్టౌ వెలిగించి బాండి పెట్టి నాలుగు స్పూన్లు నూనె వేసి
ముందుగా మెంతులు , ఎండు మిరపకాయలు , పచ్చి శనగపప్పు , చాయ మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ వేసి మెంతులు పచ్చి వాసన పోయి ,
పోపు కమ్మని వాసన వచ్చేదాకా వేయించు కోవాలి.
పోపు చల్లారిన తర్వాత మిక్సీలో ఈ పోపు , కాస్త పసుపు , తగినంత ఉప్పు వేసి కొంచెము పప్పులు పంటికి తగిలే విధముగా మిక్సీ వేసుకోవాలి .
వంకాయలు కాయలు పుచ్చులు లేకుండా చూసుకుని , శుభ్రంగా కడిగి నాలుగు పక్షాలుగా చేసుకోవాలి .
ముందుగా సిద్ధం చేసుకున్న కూర పొడి కాయల్లో కూరు కోవాలి .
చివరలో కూర దించబోయే ఐదు నిముషాలు ముందు పైన జల్లు కోవడానికి కాస్త పొడి విడిగా ఉంచుకోవాలి .
మళ్ళీ స్టౌ మీద బాండీ పెట్టి మిగిలిన నూనె అంతా పోసి నూనె బాగా కాగాక పొడి కూరిన వంకాయలు వేసి మీడియం సెగన వంకాయలు మగ్గి పొడి వేగే దాకా మధ్య మధ్యలో అట్లకాడతో తిరగవేస్తూ
కలుపుతూ ఉండాలి .
దింప బోయే అయిదు నిముషాల ముందు మిగిలిన పొడి వేసి వేగాక దించుకుని , వేరే డిష్ లోకి తీసుకోవాలి .
అంతే ఘమ ఘమ లాడే మెంతి వంకాయ కూర సర్వింగ్ కు సిద్ధం.
సంబంధిత రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .
మాగాయ (microwave)
చెప్పాను కదండీ మాగాయ కి ముక్కలు ఉప్పులో ఊరవేసానని ఇదిగో మాగాయ సిద్ధం అయింది.
US లో నేను చేసిన విధానం: ఊరవేసిన ముక్కలు పిండి అవి ఒవెన్ లో 325 టెంపరేచర్ లో ఒక 30 min bake లో పెట్టి అవి తీసి చల్లారాక: కారం, ఉప్పు, మెంతి పొడి, కాస్త ఆవపొడి వేసి నూనెవేసి కలిపి పోపు పెట్టాను. ముక్కలు బాగా ఎండ ఉంటే ఎండ లో కానీ, లేదా convention microwave లో కానీ bake చేసి కూడా చెయ్యవచ్చు.
Wednesday, 4 April 2018
మాగాయ (Magai)
మాగాయ పచ్చడి:
4 పుల్లని పచ్చి మామిడికాయలు (హస్తంసైజు)
120 గ్రాముల ఉప్పు
120 గ్రాముల కారం( 3 మాంగోస్)
2 table spoons వేయించిన మెంతిపిండి(మెంతులు సన్న సెగమీదవేయించి పొడి చేసుకోవలస)
1 table spoon ఆవపిండి
పచ్చళ్ళ ఇంగువ 2 శనగబద్దలం
చిటికెడు పసుపు
తయారీ:
మామిడికాయలు కడిగి తుడిచి తొక్కతీసి ముక్కలు పల్చగా పొడుగ్గా కోసి ఉప్పు పసుపు బాగా కలిపి జాడీలో వుంచాలి.
3 రోజు ముక్కలను నొక్కిబయటకు తీసి ఊట జాడీలోనే వుంచాలి. ఈముక్కలని 2 రోజులు, ఊటను 1 రోజు ఎండలో వుంచాలి. మరలా 3 రోజు కారం, మెంతిపిండి, ఆవపొడి సిధ్ధం చేసుకొని. ముక్కలను ఒక వెడల్పుబేసిన్ లోవేసి కారం, ఆవపిండి, మెంతిపిండి వేసి కలిపి ఊటపోసి బాగా కలపాలి.
ఒకకప్పు నూనె కాచి ( పప్పు నూనె)ఆవాలు జీలకర్ర, ఇంగువ వేసి పోపు తయారు చేసి నూనె కొంచెం చల్లారాక పచ్చడి మీదపోసి కలెదిప్పి 5 నిమిషాల తరువాత జాడీలో పెట్టు కోవాలి. తడి తగలరాదు. చిన్నరసాలు(పచ్చివి) ఈ పచ్చడికి బాగుంటాయి.కారం మంచి ఎరుపు రంగుది ఎంచుకోవాలి.
మీరు చేసాక నాకు ఎలావుందో చెప్పండి.
Tuesday, 3 April 2018
బెండకాయ మజ్జిగ పులుసు
బెండకాయ మజ్జిగ పులుసు:
3 కాయలు per head
2cup మజ్జిగ per head
కొతిమేర, 1చంచాలు శనగపిండి,1 చంచా బియ్యపిండి, 1/2 gingerpaste, 1/2 చంచా మిర్చిపేస్టు, ఉప్పు.,1/2 చంచా ధనియాలపొడి.
ముందుగా బెండకాయలు గెణుపు పొడుగున cut చేసి వాటిలో పలచని మజ్జిగపోసి వుండికించుకోవాలి. ముక్క చితకరాదు.
ఒకచిన్న కొబ్బరిముక్క paste చేసి పెట్టుకోవాలి.
ఒకగిన్నెలో మజ్జిగపోసి పైన చెప్పిన పదార్దాలు వేసి ( బెండముక్కలు తప్ప) బాగా కలియబెట్టి, ఒక భాళ్ళీలో నేతి పోపు చేసి మజ్జిగ మిశ్రమం పోయాలి. మజ్జిగపొంగురాంగానే మంట సన్నగా వుంచి గరిటతతో కలియబెట్టి తగిన వుప్పు వేసి, వుడికించిన బెండముక్కలు వేసి 1 నిమిషంఆగి మంట తీసేయాలి.