Wednesday, 20 June 2018

పంజాబీ కడీ పకోడీ (Punjabi kadi pakodi)

• పంజాబీ కడీ పకోడీ

కావలసినవి: శెనగపిండి- 120 గ్రాములు, వాము, పసుపు, కారం, మెంతులు, ధనియాలపొడి, సోంపు- అరటీస్పూను, పెరుగు- 150 గ్రాములు, ఉల్లిగడ్డ(సన్నగా తరిగి)- సగం, కొత్తిమీర తరుగు, జీలకర్ర- ఒకటీస్పూను చొప్పున, ఎండుమిరపకాయలు- ఆరు, ఆవనూనె- మూడు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు- ఎనిమిది రెబ్బలు, పచ్చిమిర్చి చీలికలు- మూడు, ఇంగువ- చిటికెడు, ఉప్పు- తగినంత.

తయారీ: ఒక గిన్నెలో పెరుగు, ఒకటిన్నర కప్పు నీళ్లు, శెనగపిండి సగం, కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లోకి తీసుకొని ఇరవై నిమిషాలపాటు చిన్నమంటపై ఉడికించాలి. మరొక పాన్‌లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి మూడు, సోంపు, ధనియాలపొడి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ వేగించాలి. దీనిలో శెనగపిండి,పెరుగు మిశ్రమం వేసి ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. వేరొక గిన్నెలో మిగిలిన శెనగపిండి, వాము, కారం, పసుపు, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో చిన్న చిన్న ఉండలు చేసి గారెల్లా వత్తుకొని నూనెలో కాల్చాలి. వీటిని శెనగపిండి పెరుగు మిశ్రమంలో వేయాలి. అంతే పంజాబీ సంక్రాంతి స్పెషల్‌ కడీ పకోడీ రెడీ.

శుభోదయం అందరికీ.

No comments:

Post a Comment