Showing posts with label Courtesy : Uma Ram. Show all posts
Showing posts with label Courtesy : Uma Ram. Show all posts

Wednesday, 20 June 2018

పంజాబీ కడీ పకోడీ (Punjabi kadi pakodi)

• పంజాబీ కడీ పకోడీ

కావలసినవి: శెనగపిండి- 120 గ్రాములు, వాము, పసుపు, కారం, మెంతులు, ధనియాలపొడి, సోంపు- అరటీస్పూను, పెరుగు- 150 గ్రాములు, ఉల్లిగడ్డ(సన్నగా తరిగి)- సగం, కొత్తిమీర తరుగు, జీలకర్ర- ఒకటీస్పూను చొప్పున, ఎండుమిరపకాయలు- ఆరు, ఆవనూనె- మూడు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు- ఎనిమిది రెబ్బలు, పచ్చిమిర్చి చీలికలు- మూడు, ఇంగువ- చిటికెడు, ఉప్పు- తగినంత.

తయారీ: ఒక గిన్నెలో పెరుగు, ఒకటిన్నర కప్పు నీళ్లు, శెనగపిండి సగం, కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లోకి తీసుకొని ఇరవై నిమిషాలపాటు చిన్నమంటపై ఉడికించాలి. మరొక పాన్‌లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి మూడు, సోంపు, ధనియాలపొడి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ వేగించాలి. దీనిలో శెనగపిండి,పెరుగు మిశ్రమం వేసి ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. వేరొక గిన్నెలో మిగిలిన శెనగపిండి, వాము, కారం, పసుపు, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో చిన్న చిన్న ఉండలు చేసి గారెల్లా వత్తుకొని నూనెలో కాల్చాలి. వీటిని శెనగపిండి పెరుగు మిశ్రమంలో వేయాలి. అంతే పంజాబీ సంక్రాంతి స్పెషల్‌ కడీ పకోడీ రెడీ.

శుభోదయం అందరికీ.

Saturday, 16 June 2018

బూడిద గుమ్మడి బరడా

• బూడిదగుమ్మడి బరడా

* కావాల్సినవి: బూడిదగుమ్మడి ముక్కలు- అరకిలో, పెసరపప్పు- 100గ్రా, సెనగపప్పు- 100గ్రా, జీలకర్ర- చెంచా, ఇంగువ- కొద్దిగా, నిమ్మకాయలు- రెండు, నూనె- రెండు పెద్ద చెంచాలు, ఉప్పు, కారం, పసుపు- తగినంత, ధనియాలపొడి- పావుచెంచా

* తయారీ: ముందుగా గుమ్మడికాయ ముక్కలని ఓ మోస్తరుగా పరిమాణంలో ఉండేటట్టు తరగాలి. పెసరపప్పు, సెనగపప్పు, ఇంగువ వీటిని బరకగా మిక్సీలో వేసి ఆడించుకోవాలి. ఈ రవ్వనే బరడా అంటారు. ఒక పాత్రలో కొద్దిగా నూనె వేసి అందులో గుమ్మడిముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాలపొడివేసి ముక్క ఉడికేంత వరకూ ఉంచాలి. ఇందాక మనం ఆడించిపెట్టుకున్న బరడాలో కొద్దిగా ఉప్పు, నూనె వేసి కూరలో కలుపుకోవాలి. ఇలా పదినిమిషాల పాటు ఉడికించిన తర్వాత రెండు నిమ్మకాయల రసం పిండుకుని పొయ్యి కట్టేస్తే బరడా సిద్ధం.

Wednesday, 2 May 2018

గుమ్మడి కాయ బజ్జీలు

*   గుమ్మడికాయ బజ్జీలు

కావలసిన పదార్థాలు...
గుమ్మడికాయ - 250 గ్రా
శనగపిండి         - 1 కప్పు
పచ్చి మిరపకాయ ముక్కలు చిన్నవిగా
తరగినవి         - 2 టేబుల్‌ స్పూన్లు
తురిమిన అల్లం - 1 టేబుల్‌ స్పూన్‌
కారం         - అర చెంచా
తినే సోడా         - చిటికెడు
చీజ్‌ తురుము       - ఒక టేబుల్‌ స్పూన్‌
ఉప్పు        - తగినంత
నూనె        - సరిపడినంత

తయారు చేసే విధానం...
మొదట గుమ్మడికాయ చిన్న చిన్న ముక్కలుగా, సన్నని స్లైసుల్లా కట్‌ చేసుకోవాలి. మిరపకాయలు, అల్లం, సోడా, కారం లాంటి మసాలాలన్నింటిని శనగపిండి లో వేసి నీరు కలిపి బజ్జీల పిండిలా చేసుకో వాలి. తరువాత గుమ్మడికాయ ముక్కను ఈ పిండిలో ముంచి నూనెలో వేసి వేయించండి. ఇలా బంగారు రంగు వచ్చే వరకు ఉంచి నూనెలో నుండి తీసేయండి. ఈ గుమ్మడి కాయ బజ్జీలను వేడివేడిగా సాస్‌తో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

శుభోదయం అందరికీ 🙏🙏🙏💐🌷🌹