కావలసినవి.
లేత బీరకాయలు -- మూడు.
పచ్చిమిరపకాయలు -- 6
చింతపండు -- చిన్న నిమ్మకాయంత .
కొత్తిమీర -- ఒక చిన్న కట్ట
పసుపు -- కొద్దిగా
ఉప్పు -- తగినంత
పోపునకు .
నూనె -- ఐదు స్పూన్లు
ఎండుమిరపకాయలు -- 6
మినపప్పు -- స్పూను.
మెంతులు -- పావు స్పూను
ఆవాలు -- అరస్పూను
జీలకర్ర -- పావు స్పూను
ఇంగువ -- కొద్దిగా
కరివేపాకు -- మూడు రెమ్మలు
తయారుచేయు విధానము .
పదినిముషాల ముందు చింతపండు విడదీసి కొద్దిగా నీళ్ళలో తడిపి ఉంచుకోవాలి .
బీరకాయలు పై చెక్కు తీసుకుని ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి.
స్టౌ వెలిగించి బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే బీరకాయ ముక్కలు, కొద్దిగా పసుపు , మరియు పచ్చిమిరపకాయలు వేసి మూతపెట్టి బీరకాయలను బాగా మగ్గనివ్వాలి .
బీర కాయ ముక్కలు మగ్గిన తరువాత వాటిని వేరే ప్లేటులో తీసుకోవాలి .
మరల స్టౌ వెలిగించి బాండి పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు , మెంతులు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి .
పోపు చల్లారగానే ముందుగా మిక్సీ లో ఎండుమిరపకాయలు , తడిపిన చింతపండు , పచ్చిమిరపకాయలు , మరియు తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
తర్వాత బీరకాయముక్కలు , మిగిలిన పోపు మరియు కొత్తిమీర వేసి ఒకసారి మిక్సీ వేసుకోవాలి.
No comments:
Post a Comment