ఆలూరుకృష్ణప్రసాదు .
కాకరకాయ కాయల పళంగా కొబ్బరి కారం వేపుడు కూర.
కావలసినవి .
ముందు కొబ్బరి కారానికి .
ఎండుమిరపకాయలు -- 10
పచ్చి శనగపప్పు -- మూడు స్పూన్లు .
చాయమినపప్పు - స్పూను
ధనియాలు - స్పూను
జీలకర్ర -- స్పూను .
ఎండుకొబ్బరి -- పావు చిప్ప . చిన్న ముక్కలుగా చేసుకోవాలి .
కరివేపాకు -- నాలుగు రెమ్మలు.
ఇవ్వన్నీ నూనె వేయకుండా బాండిలో కమ్మని వేపు వచ్చేదాకా వేయించుకోవాలి .
చల్లారగానే మిక్సీలో వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి.
కాకరకాయలు అరకిలో తీసుకుని కాయ మధ్యలో చాకుతో గాటు పెట్టుకోవాలి ,
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి 150 గ్రాముల నూనె వేసి నూనె బాగా కాగగానే ముందుగా కాకరకాయ లను కాయల పళంగా నూనెలో వేసి బాగా ఎర్రగా వేగ నివ్వాలి .
తరువాత సిద్ధంగా ఉంచుకున్న కొబ్బరి కారం పొడి కాయలలో కూరి , బాగా కాగుతున్న వేడి వేడి నూనె స్పూనున్నర చొప్పునకారం కూరిన కాయలలో పోయాలి .
వెల్లుల్లి ఇష్టమైన వారు ఆరు వెల్లుల్లి రెబ్బలు పొడిలో వేసుకుని మిక్సీ వేసుకుంటే ఈ కాకరకాయ వేపుడు కూర చాలా రుచిగా ఉంటుంది .
అంతే ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కాయల పళంగా కొబ్బరి కారం వేపుడు కూర సర్వింగ్ కు సిద్ధం.
ఈ వేపుడు కూర వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది .
ఆలూరుకృష్ణప్రసాదు .
No comments:
Post a Comment