ఉడికించిన బంగాళా దుంపల ముద్దలో , ఉడికించించిన రవ్వ కూడా కలపి, ఉప్పు, కారం, మసాలా, వాము, కొత్తిమీర వేసి బాగా కలపి చేతికి నూనె రాసుకుని కొంచం ఆ mixture తీసుకుని పొడుగ్గా ఫింగర్స్ ల చేసుకుని వేడి వేడి నూనె లో కొన్ని కొన్ని వేసే బాగా డీప్ ఫ్రై చేయాలి.
Saturday, 29 December 2018
Monday, 17 December 2018
పొంగలి
పొంగల్ . ( Ven Pongal )
తమిళ నాడు అంతటా ప్రతి రోజు హోటళ్ళలో ఉప్మా చేయరు.
పొంగల్ చేస్తారు .
కారణం బొంబాయి రవ్వ , మైదా పిండి ఆరోగ్యరిత్యా తగు మోతాదులో ఉపయోగించు కోవాలని అందరూ చెప్తున్నారు .
ఈ పొంగల్ బియ్యముతో చేసుకుంటారు కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది .
ఇంక పొంగల్ తయారు చేయడానికి కావలసిన వస్తువులు .
బియ్యము -- ఒక గ్లాసు
చాయపెసరపప్పు -- అర గ్లాసు
మిరియాలు -- ఒకటిన్నర స్పూను .
నెయ్యి --- ఒక చిన్న కప్పు.
ఉప్పు -- తగినంత
అల్లం తరుగు -- ఒకటిన్నర స్పూను జీలకర్ర -- అర స్పూను .
జీడిపప్పు --- 30 గ్రాములు
కరివేపాకు - మూడు రెమ్మలు
పచ్చిమిర్చి -- ఐదు పొడుగ్గా తరుగు కోవాలి .
ఇంగువ --- కొద్దిగా
ముందుగా బియ్యాన్ని , పెసరపప్పును మునిగే వరకు నీళ్ళు పోసి ఒక గంట సేపు విడి విడిగా నానబెట్టు కోవాలి .
స్టౌ వెలిగించి బాండీ పెట్టుకొని మూడు స్పూన్లు నెయ్యి వేసి జీడిపప్పు ను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి .
మిరియాలను కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని ఒక ప్లేటులో పెట్టుకోండి.
అదే బాండిలో మరో రెండు స్పూన్లు నెయ్యి వేసి దంచి పెట్టుకున్న మిరియాలు , జీలకర్ర , అల్లం తరుగు , ఇంగువ , పచ్చి మిర్చి , కరివేపాకు వేసి పోపు వేగాక ఒకటి మూడు చొప్పున నీళ్ళు పోసి అందులో తగినంత ఉప్పు వేసి అదే నీళ్ళలో నానబెట్టి ఉంచుకున్న బియ్యము పెసరపప్పు వేసి మూత పెట్టి మెత్తగా ఉడకనివ్వాలి .
దింప బోయే ముందు మిగిలిన నెయ్యి , వేయించి ప్రక్కన పెట్టుకున్న జీడిపప్పు వేసి మరో మూడు నిముషాలు ఉంచి దింపు కోవాలి .
వేడి వేడి పొంగల్ సర్వింగ్ కు సిద్ధం .
ఇందులోకి కొబ్బరి చట్నీ , టమోటో చట్నీ రెండూ బాగుంటాయి .
తమిళనాడు అంతటా అన్ని హోటళ్ళలోనూ చక్కగా లేత అరిటాకు వేసి పొంగల్ పెట్టి పై రెండు చట్నీలు వేసి , వేడి వేడిగా పొగలు కక్కుతున్న సాంబారు వేస్తారు .
ఎంత రుచిగా ఉంటుందో !
మళ్ళీ మధ్యాహ్నము ఒంటి గంట దాకా ఆకలి వెయ్యదు .
Tuesday, 11 December 2018
మీగడ జంతికలు
బియ్యపు పిండితో రుచికరమైన మీగడ చక్కిలాలు / జంతికలు .
ఆలూరుకృష్ణప్రసాదు .
బియ్యపు పిండితో మీగడ చక్కిలాలు.
కావలసినవి .
మర పట్టించిన బియ్యపు పిండి -- నాలుగు కప్పులు.
బియ్యము నాన పెట్టే అవసరం లేదు.
మామూలు బియ్యమే మర పట్టించాలి.
మీగడతో ఉన్న పెరుగు -- ఒక కప్పు.
( జంతికలు పుల్లగా తినడానికి ఇష్ట పడే వారు పుల్లని మీగడ పెరుగు వేసుకోవచ్చును. )
మీగడ పెరుగు లభ్యం కాని యెడల 50 గ్రాముల వెన్న పిండి కలిపే సమయంలో వేసుకుని , మామూలు పెరుగు వేసుకుని పిండి కలుపు కోవచ్చు.
ఉప్పు -- తగినంత
కారము -- ఒక స్పూను
వాము -- ఒక స్పూను
నువ్వుపప్పు - ఒక స్పూను
నూనె -- 350 గ్రాములు.
తయారీ విధానము .
ఒక బెసిన్లో మెత్తగా మరపట్టించి జల్లెడ పోసుకున్న బియ్యపు పిండి , వాము , నువ్వుపప్పు , కారం, వేసుకుని అందులో మీగడ పెరుగు / లేదా వెన్న మరియు పెరుగు వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని చేతితో బాగా కలుపు కోవాలి .
ఇప్పుడు అవసరమైతే కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చక్కిలాలు వేయటానికి వీలుగా పిండిని గట్టిగా కలుపుకోవాలి .
తర్వాత కలిపిన పిండిని బాగా మెదాయించుకోవాలి.
ఇప్పుడు స్టౌ వెలిగించి బాండి పెట్టుకుని మొత్తము నూనె పోసి నూనెను పొగలు వచ్చే విధముగా బాగా కాగనివ్వాలి.
తర్వాత పిండిని చక్కిలాలు వేసుకునే గిద్దలో పెట్టుకుని స్టౌ ను మీడియం సెగలో పెట్టి రెండు రెండు చొప్పున చక్కిలాలు నూనెలో వేసుకుని బంగారు రంగులో వేయించుకుని తీసేసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే చల్ల చక్రాలు / మీగడ చక్రాలు అల్పాహారానికి సిద్ధం.
ఈ చక్కిలాలు పది రోజులు పైన నిల్వ ఉంటాయి.
Sunday, 25 November 2018
పల్లీలు-నువ్వు పప్పు పొడి / నువ్వుల పొడి
పల్లీలు నువ్వుల పొడి.
పల్లీలు వేసుకోకుండా నువ్వుల పొడిగా కూడా చేసుకోవచ్చు.
కావలసినవి .
పల్లీలు -- 200 గ్రాములు
తెల్ల నువ్వులు -- 100 గ్రాములు
ఎండుమిరపకాయలు -- 10
జీలకర్ర -- స్పూను
ఉప్పు -- తగినంత
తయారీ విధానము .
ముందుగా పల్లీలు స్టౌ మీద బాండి పెట్టి పల్లీలు నూనె వేయకుండా కమ్మని వాసన వచ్చేదాకా వేయించుకోవాలి .
చల్లారగానే పై పొట్టు తీసి వేరుగా ఉంచుకోవాలి .
మళ్ళీ స్టౌ మీద బాండి పెట్టి తెల్ల నువ్వు పప్పు , ఎండుమిరపకాయలు మరియు జీలకర్ర నూనె వేయకుండా వేగిన వాసన వచ్చేదాకా వేయించుకోవాలి .
చల్లారగానే వేయించిన పల్లీలు , నువ్వుపప్పు , ఎండుమిరపకాయలు , జీలకర్ర మరియు సరిపడే ఉప్పువేసి మిక్సీ లో మెత్తగా వేసుకోవాలి .
అంతే ఇడ్లీ , దోశెలు మరియు భోజనము లోకి రుచికరమైన పల్లీలు నువ్వుపప్పు పొడి సిద్ధం.
Monday, 19 November 2018
వంకాయ పచ్చి పులుసు
కావలసినవి .
లేత నీలం రంగు గుండ్రని వంకాయలు -- మూడు .
ఉల్లిపాయలు -- రెండు
పచ్చి మిరపకాయలు -- అయిదు
చింతపండు -- నిమ్మ కాయంత.
కరివేపాకు -- రెండు రెమ్మలు
కొత్తిమీర -- ఒక చిన్న కట్ట
ఉప్పు -- తగినంత
పసుపు -- కొద్దిగా
పోపునకు .
నూనె -- మూడు స్పూన్లు
ఎండు మిరపకాయలు -- 4
మినపప్పు -- స్పూను
జీలకర్ర -పావు స్పూను
ఆవాలు -- అర స్పూను.
ఇంగువ -- తగినంత .
తయారీ విధానము .
ముందుగా చింతపండు విడదీసి ఒక గ్లాసు నీళ్ళలో పదిహేను నిముషాలు పాటు నానబెట్టి తర్వాత ఒక గ్లాసు రసం పల్చగా తీసుకోవాలి .
వంకాయలు పుచ్చులు లేకుండా చూసుకుని కాయ అంతా నూనె రాసి స్టౌ మీద సన్నని సెగలో కాల్చుకోవాలి .
నీళ్ళతో తడి చేసుకుని కాయలపై పొట్టు అంతా తీసేసుకోవాలి.
పై తొడిమలు తీసివేసి కాయలను వేరే ప్లేటులో పెట్టుకోవాలి .
ఉల్లిపాయలు సన్నని ముక్కలుగా తరుగు కోవాలి .
పచ్చి మిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనెను వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిర్చి ముక్కలు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ , పచ్చిమిర్చి ముక్కలు మరియు కరివేపాకు వేసుకుని పోపు వేగగానే అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టి పది నిముషాలు పాటు ఉల్లిపాయ ముక్కలు బంగారు రంగులోకి వచ్చే వరకు మగ్గ నివ్వాలి .
ఒక గిన్నెలో చింతపండు రసము వేసుకుని , అందులో కొద్దిగా పసుపు , సరిపడా ఉప్పు వేసుకుని , కాల్చి పై తొక్క , తొడిమలు తీసిన వంకాయలు అందులో వేసి చేతితో బాగా కలిసేలా పిసకాలి .
తర్వాత ఉల్లిపాయలు తో వేయించిన పోపు మరియు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని గరిటతో బాగా కలుపుకోవాలి .
అంతే రోటీలు , చపాతీలు మరియు భోజనము లోకి ఎంతో రుచిగా ఉండే వంకాయ పచ్చి పులుసు సర్వింగ్ కు సిద్ధం.
కొంతమంది ఉల్లి పాయలు వేయించకుండా పచ్చివే కలుపుతారు .
ఇష్టమైన వారు అర స్పూను పంచదార కాని బెల్లపు పొడి కాని వేసుకోవచ్చు .
దీనికి కాంబినేషన్ గా కందిపచ్చడి లేదా కందిపొడి చేసుకుంటారు .
చాలా రుచిగా ఉంటుంది .
ఈ వంకాయ పచ్చిపులుసును వేడి చెయ్యరు.
Tuesday, 9 October 2018
Sankarapali Sweet శంకరపాలి
హలో ఫ్రెండ్స్,
పెద్ద, చిన్న అందరూ తినగలిగే వంటకం ఇది. వంటకం పేరు "sankarapali" మహారాష్ట్ర తీపి పదార్థం. అదేనండి మనం మైదా చిప్స్ చేస్తాం కదా పాకం పట్టి కొంచెం అలాగే ...కానీ పాకం అవసరం లేదు. పిండిలోనే పంచదార పొడి కలిపి చిప్స్ చేసుకుని వేయుంచుకోవాలి.
బయట crispy గా, లోపల soft గా తినేకొద్ది తినాలనిపిస్తుంది అండీ. నేను స్వీట్ ప్రియురాలిని కదా కష్టపడి చేసి అన్ని తినేస్తే ఇంట్లో వాళ్లకు ఉండాలి కదా.. అందుకే డబ్బా దాచేసా..
మీరు ట్రై చేయండి ..
Recipe : ఒక కప్ మైదా లో కొంచెం ఉప్పు వేసి జల్లించుకోవాలి. అందులో పావు కప్ వేడి నెయ్యి వేసి పిండిని బాగా కలపాలి. తరువాత 1/4 కప్ పంచదార పొడి, యాలకుల పొడి వేసి, వేడి పాలు పోసుకుంటూ చపాతీ పిండిలా కలిపి ఒక 30 నిమిషాలు మూత పెట్టి తరువాత మందంగా చపాతీ లు చేసుకుని నూనె లో చిన్న మంట మీద వేయించుకోవాలి.
Sunday, 30 September 2018
Tamilnadu Special Asoka Halva అశోకా హల్వా
తమిళనాడు స్పెషల్ .
అశోకా హల్వా .
కావలసినవి .
చాయ పెసరపప్పు -- ఒక కప్పు
గోధుమ పిండి -- రెండు స్పూన్లు
యాలకులు -- 5 మెత్తగా పొడి చేసుకోవాలి.
పంచదార -- ఒక కప్పున్నర
నెయ్యి -- ఒక కప్పు
జీడిపప్పు -- 15 పలుకులు .
తయారీ విధానము .
స్టౌ వెలిగించి బాండీ పెట్టి కప్పు పెసరపప్పు వేసి పెసరపప్పు కమ్మని వాసన వచ్చే దాకా వేయించు కోవాలి .
తర్వాత కుక్కర్లో గిన్నె పెట్టి వేయించిన పప్పు వేసి సరిపడా నీళ్ళు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి .
తర్వాత మెత్తగా పప్పును యెనపాలి .
తర్వాత బాండీ పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి ముందుగా జీడిపప్పు వేయించుకుని విడిగా ప్లేటులో తీసుకుని ఉంచుకోవాలి .
తర్వాత అదే బాండీలో మరో స్పూను నెయ్యి వేసి గోధుమ పిండి కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టు కోవాలి .
తర్వాత అదే బాండీలో
మళ్ళీ నాలుగు స్పూన్లు నెయ్యి వేసి ఉడికించి ఉంచుకున్న పెసర పప్పు మరియు పంచదార వేసి గరిటతో బాగా కలుపుతూ ఉండాలి.
రెండూ దగ్గర పడి ఉడుకుతుండగానే పది నిముషాల తర్వాత వేయించిన గోధుమ పిండి , యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని మిఠాయి రంగు కొద్దిగా పాలల్లో కలుపుకుని ఉడుకుతున్న హల్వాలో పోసి గరిటతో బాగా కలుపుకోవాలి .
తర్వాత మిగిలిన నెయ్యి , జీడిపప్పు పలుకులు వేసి గరిటతో బాగా కలుపుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే తమిళనాడు స్పెషల్ అశోకా హల్వా సర్వింగ్ కు సిద్ధం.
Wednesday, 26 September 2018
కొబ్బరి బర్ఫీ
కావాల్సినవి:
రెండు కప్పుల కొబ్బరి తురుము, ఒక కప్పు పంచదార, ఒక గ్లాసు పాలు.
బాండీలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి.. అది వేడెక్కగానే.. కొబ్బరి తురుము, పంచదార, పాలు వేసి కలపాలి. పంచదార కరిగి.. మొత్తం చిక్కబడి దగ్గరకు రాగానే (మైసూర్ పాక్ మాదిరిగా).. వేరే ప్లేట్ పై నెయ్యి రాసి దానిపై ఈ మిశ్రమాన్ని చేర్చాలి. మనకు కావలసిన సైజ్ లో కట్ చేసుకుంటే కొబ్బరి బర్ఫీ రెడీ.
Tomato Soup టమోటా సూప్
It's easy and healthy also ..no preservatives ..
Sanjeev Kapoor style
Tamotas-5 medium pecies chesi pattukovali
Carrots 2 rounds chesi pettukoni
Big onion -1 slices chesukovali
Garlic - 4 remmalu small small pecies cut chesukovali
Pan petti kasta butter vesi first biryani aaku veyali ..tarvata onions vesi light ga kalipi..dantlo garlic pecies veyali..oka 2 mins tarvata tamota carrots vesi kalipi Avi munigela water posi lid petti baaga udakaniyali
Baaga challaraka mottam vadakatti biryani aaku tiseyali and aa water pakkana pettukoni
Mottam mixili vesi tippukovali water avasaram annappudu indaka unchina water vadukovali
Mixi ayyaka Danni mallii vadakattali aa liquid ni malliii pan lo kasta butter vesi dantlo posesi baaaga udakaniyali
Udiketappudu pepper powder veyali..sweet kavalisina vallu kasta creme vesukovachhu
Soup kasta palchaga anipiste creme lekapote corn starch kasta veste daggara padutundi antee soup ready
(Mixi vesetappudu cold water aina vadukovachhu ..Malli vadakattaga pan lo posinappudu thick ga unte mundu unchina vadakattina water vadukovachhu)
Sunday, 2 September 2018
జున్ను
జున్ను తయారీ విధానము .
మొదటి రోజు జున్ను పాలు చాలా చిక్కగా ఉంటాయి .
అందువలన గ్లాసు పాలకు రెండు గ్లాసుల మామూలు పాలు కలపాలి .
అందులో షుమారు ఒక 70 గ్రాముల బెల్లం పొడి చేసి గరిటతో కరిగే దాకా కలపాలి .
తర్వాత బెల్లం కలిపిన పాలను వడకట్టి అడుగున ఇసుక వంటిది తీసేసుకోవాలి .
వేరే గిన్నెలో పోసుకోవాలి .
ఒక స్పూను యాలకుల పొడి వేయాలి.
ఒక స్పూను మిరియాల పొడి కూడా వేసి బాగా కలపాలి .
ఇప్పుడు కుక్కర్ లో తగినన్ని నీళ్ళు పోసి ఈ జున్నుపాల గిన్నె పెట్టి విజిల్ పెట్టకుండా మూత పెట్టి స్టౌ మీద పది నిముషాల పాటు ఉంచి ఒకసారి గట్టి పడిందేమో చూసుకుని దింపుకోవాలి .
అంతే అందరికీ ఎంతో ఇష్టమైన జున్ను సేవించడానికి సిద్ధం.
Thursday, 30 August 2018
Instant నిమ్మకాయ కారం
నిమ్మకాయ కారం అంటే ఇష్టం లేనిది ఎవరికి? వేడి వేడి అన్నంలో నిమ్మకాయ కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ మజా ఏ వేరు. అయితే, అన్ని సార్లూ ఆ ఊరగాయ లభ్యపడకపోవచ్చు. అందుకే ఇవాళ instant నిమ్మకాయ కారం పోస్ట్ చేస్తున్నాను. దీనికి ముక్కలు ఊరవేయడం, ఎండబెట్టడం అవసరంలేదు. One week వరకు నిలువ ఉంటుంది. ఈ instant pickle చాలా మందికి తెలిసే ఉండొచ్చు కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఉపయోగపడుతుందని posting. ఒకటి లేదా రెండు నిమ్మకాయల తో అయినా చేసేసుకోవచ్చు.
నిమ్మకాయలు పెద్దవి - 2
ఉప్పు, కారం 1:1 ratio lo తీసుకోవాలి. కాస్త మెంతిపిండి , ఇష్టమైతే ఆవపిండి కూడా కలుపుకోవచ్చు. (ఆవపిండి optional). ముందుగా రసం తీసుకుని అందులో నిమ్మకాయ చిన్న చిన్న ముక్కలు వేసుకొని , ఆ రసంలో ఉప్పు , కారం , మెంతిపిం డి వేసి తరువాత అందులో తాలింపు పెట్టుకోవడమే. తాలింపు నువ్వుల నూనె తో అయితే బాగుంటుంది. ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి , ఇంగువ తిరగమోత వేసుకొని కలిపేసుకోడమే. (నిమ్మరసం తీయగానే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకుంటే ఒక పూట ఊరాక మరింత బాగుంటుంది. అల్లం ముక్కలు వేసుకోవడం కూడా optional) . Instant pickle కాబట్టి ఆ పూటే తినేయచ్చు.
Sunday, 19 August 2018
దోసకాయ పచ్చడి
దోసకాయ ముక్కల పచ్చడి .
కావలసినవి .
పసుపు రంగు గట్టి దోసకాయ --- ఒకటి.
పై చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .
చిన్న నిమ్మకాయంత చింతపండు విడదీసి కొద్దిగా నీళ్ళతో తడిపి ఉంచుకోవాలి ..
పచ్చిమిరపకాయలు -- 10
కొత్తి మీర --- రెండు చిన్న కట్టలు .
మరి కాస్త వేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది .
కట్టలు విడదీసి కాడలు తీసేసి కొత్తిమీర శుభ్రం చేసుకోవాలి .
ఉప్పు --- తగినంత
పసుపు --- కొద్దిగా .
పోపుకు .
ఎండుమిరపకాయలు -- 6
మినపప్పు --- స్పూను
మెంతులు --- పావు స్పూను
ఆవాలు --- అర స్పూను
ఇంగువ --- కొద్దిగా
నూనె --- 50 గ్రాములు
తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి మొత్తం నూనె పోయాలి.
నూనె బాగా కాగనివ్వాలి .
నూనె బాగా కాగగానే మెంతులు , ఎండుమిరపకాయలు , మినపప్పు , ఆవాలు మరియు ఇంగువ వేసి పోపు బాగా వేగనివ్వాలి .
ఎక్కువ నూనె ఉంటే ఆఖరున పచ్చడిలో కలుపుకోవచ్చు.
బాండీ లోనే ఉంచేయండి
పోపు చల్లారగానే ముందుగా రోటి లో ఎండుమిరపకాయలు , తగినంత ఉప్పు మరియు పసుపు వేసి మెత్తగా పచ్చడి బండతో దంపుకోవాలి.
తరువాత పచ్చిమిర్చి , తడిపిన చింతపండు మరియు పోపును రోటిలోలో వేసి మరో సారి మెత్తగా పచ్చడి బండతో దంపుకోవాలి.
చివరగా దోసకాయ ముక్కలు మరియు కొత్తిమీర వేసి ఒకే ఒక్కసారి దోసకాయ ముక్కలు నలగ కుండా పైపైన బండతో నూరుకోవాలి .
తర్వాత నూరిన పచ్చడి ఒక గిన్నెలోకి తీసుకుని బాండీలో కాగిన మిగిలిన నూనె అందులో పోసి గరిటతో ముక్కలు పచ్చడి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే దోసకాయముక్కలు పచ్చడి సర్వింగ్ కు సిద్ధం .
Friday, 17 August 2018
Modi about Atalji
Monday, 13 August 2018
కొబ్బరి కారం/కొబ్బరి పొడి
కావాల్సినవి:
ఎండు కొబ్బరి చిప్పలు --- 2
ఎండుమిరపకాయలు -- 15
జీలకర్ర -- స్పూనున్నర
వెల్లుల్లి పాయ రెబ్బలు -- 15
ఉప్పు -- తగినంత .
తయారీ విధానము .
ముందుగా స్టౌ వెలిగించి సెగ సిమ్ లో పెట్టుకోవాలి .
ఎండు కొబ్బరి చిప్పలు స్టౌ మీద పెట్టి వెనుక వైపు కొబ్బరి చిప్పలను మధ్య మధ్య తిప్పుతూ కమ్మని వాసన వచ్చేదాకా కాల్చుకోవాలి .
ఎక్కువ సెగన కాల్చుకుంటే చిప్పలు మాడి పోవచ్చును లేదా చిప్పలు అంటుకునే ప్రమాదం ఉంది .
కొబ్బరి చిప్పలు చల్లారగానే ఎండు కొబ్బరి తురుముతో తురుము కోవాలి .
లేదా చాకుతో చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి .
ఎండుమిరపకాయలు తొడిమలు తీసుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి నూనె వేయకుండా ఎండుమిరపకాయలు , జీలకర్ర వేసి మిరపకాయలు వేగిన వాసన వచ్చేదాకా వేయించుకోవాలి .
వెల్లుల్లి పాయలు పై పొట్టు తీయకుండా రెబ్బలుగా వలుచుకోవాలి .
ఇప్పుడు మిక్సీలో వేగిన ఎండుమిరపకాయలు , జీలకర్ర , తగినంత ఉప్పు వేసి మెత్తగా వేసుకోవాలి .
తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు / లేక తురిమిన ఎండు కొబ్బరి మిక్సీ లో వేసుకుని మరీ మెత్తగా కాకుండా వేసుకోవాలి .
తర్వాత ఒక సీసాలో భద్రపర్చుకోవాలి .
వెల్లుల్లి ఇష్టం లేని వారు మరో అర స్పూను జీలకర్ర వేసుకుని చేసుకోవచ్చు .
ఈ కొబ్బరి పొడి షుమారు 20 రోజులు నిల్వ ఉంటుంది .
ఈ కొబ్బరి కారం లేదా కొబ్బరి పొడి వేడి వేడి అన్నంలో మరి కాస్త నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే అద్భుతమైన రుచిగా ఉంటుంది.
Monday, 6 August 2018
నిమ్మకాయ కారం
నిమ్మకాయ కారం. రోటి పచ్చడి .
కావలసినవి .
ఎండుమిరపకాయలు -- పది
నిమ్మకాయలు -- 4
పొట్టు మినపప్పు -- 40 గ్రాములు
మెంతులు -- మూడు స్పూన్లు
ఆవాలు -- పావు స్పూను
పసుపు -- కొద్దిగా
ఇంగువ -- మరి కాస్త
జీలకర్ర -- పావు స్పూను
నూనె -- మూడు స్పూన్లు
ఉప్పు -- తగినంత
తయారీ విధానము .
ముందు నిమ్మకాయలు అడ్డంగా కోసుకొని ఒక గిన్నెలో రసము తీసుకోవాలి.
స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి , నూనె కాగగానే ముందుగా మెంతులు, పొట్టు మినపప్పు , ఎండుమిరపకాయలు వేసి కమ్మని వాసన వచ్చే దాకా వేయించుకోవాలి.
ఆ తర్వాత జీలకర్ర , ఇంగువ , వేసి వేగాక దింపి దానిపై కొద్దిగా పసుపు వేసుకోవాలి.
చల్లారగానే రోటిలో వేగిన పోపు , తగినంత ఉప్పు వేసి పప్పులు తగిలే విధంగా పచ్చడి బండతో దంపుకోవాలి .
తర్వాత ఈ మిశ్రమాన్ని గిన్నెలో తీసిన నిమ్మరసం తో కలిపాలి.
స్పూను తో బాగా కలుపుకోవాలి .
ఈ నిమ్మకాయ కారం గట్టిగా ఉంటే బాగుంటుంది .
పల్చగా కావాలను కునే వారు మరో కాయ నిమ్మరసం పిండుకోండి.
ఈ నిమ్మకాయ కారం రోటిలో రోకలితో దంపుకుని చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది .
ఈ కారం అన్నం లోకి , ఇడ్లీల లోకి , దోశెల లోకి , దిబ్బ రొట్టె లోకి కూడా చాలా బాగుంటుంది .
కందిపప్పు రెండు స్పూన్లు నెయ్యి వేసి వేయించుకుని , తగినన్ని నీళ్ళు పోసుకుని , ముద్దపప్పు లా వండుకుని , వేడి వేడి అన్నంలో మరి కాస్త నెయ్యి వేసుకుని , పప్పు కలుపుకుని, ఈ నిమ్మకాయ కారం నంచుకొని తిని ఎలా ఉందో చెప్పండి.
Friday, 3 August 2018
కంది పచ్చడి
షుమారు 100 సంవత్సరాల నుండి పెద్దలు తయారు చేసే కంది పచ్చడి .
కందిపచ్చడి.
తయారీ విధానము .
150 గ్రాముల కందిపప్పు , స్పూనున్నర జీలకర్ర , పది ఎండుమిరపకాయలు బాండిలో నూనె లేకుండా కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి.
చల్లారగానే తగినంత ఉప్పు వేసి , కొద్దిగా నీళ్ళు పోసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
రోటి సౌకర్యం ఉన్నవారు మధ్య మధ్య లో నీళ్ళు చిలకరించుకుంటూ పొత్రముతో మరీ మెత్తగా కాకుండా రుబ్బుకుంటే చాలా రుచిగా ఉంటుంది .
నిజానికి కందిపచ్చడి , కొబ్బరి పచ్చడి రోట్లో రుబ్బుకుంటేనే రుచిగా ఉంటాయి ,
ఇష్టమైన వారు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు పచ్చడి రుబ్బేటప్పుడు కాని లేదా మిక్సీ వేసుకునేటప్పుడు కాని వేసుకోవచ్చును.
రుచికరమైన కందిపచ్చడి దోశెల లోకి, గారెల లోకి, ఇడ్లీల లోకి , చపాతీలలోకి మరియు భోజనము లోకి సిద్ధం.
ఎవరి అభిరుచి అనుసారంగా కొద్దిగా చింతపండు వేయడం , కరివేపాకు వేసి రుబ్బడం మరియు పైన పోపు వేసుకోవడం చేసుకొనవచ్చును .
అవి అన్నీ కాలానుగుణంగా వచ్చిన మార్పులు .
సంబంధించిన రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.
Friday, 27 July 2018
దబ్బకాయ కారం
కావలసినవి .
పసుపు పచ్చని దబ్బకాయ -- ఒకటి
కాయను మధ్యకు తరిగి ఒక గిన్నెలో రసం పిండుకోవాలి .
గింజలను తీసేసు కోవాలి.
పోపునకు .
ఎండుమిరపకాయలు -- పదిహేను.
ఆవాలు --- స్పూను
మెంతులు -- స్పూను
ఇంగువ -- పావు స్పూను
నూనె -- మూడు స్పూన్లు
ఉప్పు -- తగినంత
పసుపు -- కొద్దిగా
తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే , వరుసగా ఎండుమిరపకాయలు , మెంతులు , ఆవాలు మరియు ఇంగువ వేసి పోపును వేయించుకోవాలి.
చల్లారిన తర్వాత రోటిలో ఈ పోపు , కొద్దిగా పసుపు , సరిపడా ఉప్పు వేసి పచ్చడి బండతో మెత్తగా దంపుకోవాలి.
తర్వాత ముందుగా తీసి వుంచుకున్న దబ్బ కాయ రసం రోటిలో వేసి పచ్చడి బండతో బాగా నూరుకోవాలి .
అలా నూరిన దబ్బ కాయ కారం వేరే గిన్నె లోకి తీసుకోవాలి.
కొద్దిగా పలుచగా ఉన్నట్లుగా అన్పించినా తరువాత కారం రసాన్ని పీల్చుకుని గట్టి పడుతుంది .
అంతే పుల్ల పుల్లగా ఇంగువ ఘుమ ఘుమ లతో , ఇడ్లీ , దోశెలు , గారెలు మరియు భోజనము లోకి దబ్బ కాయ కారం సర్వింగ్ కు సిద్ధం.
ఈ కారం పది రోజులు నిల్వ ఉంటుంది .