Monday, 13 August 2018

కొబ్బరి కారం/కొబ్బరి పొడి

కావాల్సినవి:

ఎండు కొబ్బరి చిప్పలు  ---  2
ఎండుమిరపకాయలు  --  15
జీలకర్ర  --  స్పూనున్నర
వెల్లుల్లి  పాయ రెబ్బలు  --  15 
ఉప్పు  --  తగినంత .

తయారీ  విధానము .

ముందుగా   స్టౌ  వెలిగించి   సెగ  సిమ్  లో  పెట్టుకోవాలి .

ఎండు  కొబ్బరి  చిప్పలు  స్టౌ  మీద పెట్టి  వెనుక  వైపు  కొబ్బరి  చిప్పలను  మధ్య మధ్య  తిప్పుతూ  కమ్మని  వాసన  వచ్చేదాకా   కాల్చుకోవాలి .

ఎక్కువ  సెగన  కాల్చుకుంటే  చిప్పలు  మాడి పోవచ్చును  లేదా  చిప్పలు  అంటుకునే  ప్రమాదం  ఉంది .

కొబ్బరి  చిప్పలు  చల్లారగానే  ఎండు కొబ్బరి  తురుముతో  తురుము  కోవాలి .

లేదా  చాకుతో  చిన్న చిన్న ముక్కలుగా  చేసుకోవాలి .

ఎండుమిరపకాయలు  తొడిమలు  తీసుకోవాలి .

ఇప్పుడు   స్టౌ  మీద  బాండీ  పెట్టి  నూనె  వేయకుండా  ఎండుమిరపకాయలు , జీలకర్ర  వేసి  మిరపకాయలు  వేగిన  వాసన వచ్చేదాకా  వేయించుకోవాలి .

వెల్లుల్లి పాయలు  పై పొట్టు  తీయకుండా  రెబ్బలుగా  వలుచుకోవాలి .

ఇప్పుడు   మిక్సీలో  వేగిన ఎండుమిరపకాయలు  , జీలకర్ర , తగినంత  ఉప్పు వేసి  మెత్తగా  వేసుకోవాలి .

తర్వాత  ఎండు కొబ్బరి  ముక్కలు  /  లేక  తురిమిన  ఎండు  కొబ్బరి  మిక్సీ లో  వేసుకుని  మరీ  మెత్తగా  కాకుండా  వేసుకోవాలి .

తర్వాత  ఒక సీసాలో  భద్రపర్చుకోవాలి .

వెల్లుల్లి  ఇష్టం  లేని వారు  మరో అర స్పూను  జీలకర్ర  వేసుకుని  చేసుకోవచ్చు .

ఈ కొబ్బరి పొడి  షుమారు  20  రోజులు  నిల్వ  ఉంటుంది .

ఈ  కొబ్బరి  కారం  లేదా  కొబ్బరి పొడి  వేడి వేడి  అన్నంలో  మరి కాస్త నెయ్యి వేసుకుని  కలుపుకుని  తింటే  అద్భుతమైన  రుచిగా  ఉంటుంది.

No comments:

Post a Comment