కావలసినవి .
పసుపు పచ్చని దబ్బకాయ -- ఒకటి
కాయను మధ్యకు తరిగి ఒక గిన్నెలో రసం పిండుకోవాలి .
గింజలను తీసేసు కోవాలి.
పోపునకు .
ఎండుమిరపకాయలు -- పదిహేను.
ఆవాలు --- స్పూను
మెంతులు -- స్పూను
ఇంగువ -- పావు స్పూను
నూనె -- మూడు స్పూన్లు
ఉప్పు -- తగినంత
పసుపు -- కొద్దిగా
తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే , వరుసగా ఎండుమిరపకాయలు , మెంతులు , ఆవాలు మరియు ఇంగువ వేసి పోపును వేయించుకోవాలి.
చల్లారిన తర్వాత రోటిలో ఈ పోపు , కొద్దిగా పసుపు , సరిపడా ఉప్పు వేసి పచ్చడి బండతో మెత్తగా దంపుకోవాలి.
తర్వాత ముందుగా తీసి వుంచుకున్న దబ్బ కాయ రసం రోటిలో వేసి పచ్చడి బండతో బాగా నూరుకోవాలి .
అలా నూరిన దబ్బ కాయ కారం వేరే గిన్నె లోకి తీసుకోవాలి.
కొద్దిగా పలుచగా ఉన్నట్లుగా అన్పించినా తరువాత కారం రసాన్ని పీల్చుకుని గట్టి పడుతుంది .
అంతే పుల్ల పుల్లగా ఇంగువ ఘుమ ఘుమ లతో , ఇడ్లీ , దోశెలు , గారెలు మరియు భోజనము లోకి దబ్బ కాయ కారం సర్వింగ్ కు సిద్ధం.
ఈ కారం పది రోజులు నిల్వ ఉంటుంది .
No comments:
Post a Comment