Wednesday, 26 September 2018

Tomato Soup టమోటా సూప్

It's easy and healthy also ..no preservatives  ..

Sanjeev Kapoor style

Tamotas-5 medium pecies chesi pattukovali
Carrots 2 rounds chesi pettukoni

Big onion -1 slices chesukovali
Garlic - 4 remmalu small small pecies cut chesukovali

Pan petti kasta butter vesi first biryani aaku veyali ..tarvata onions vesi light ga kalipi..dantlo garlic pecies veyali..oka 2 mins tarvata tamota carrots vesi kalipi Avi munigela water posi lid petti baaga udakaniyali

Baaga challaraka mottam vadakatti biryani aaku tiseyali and aa water pakkana pettukoni

Mottam mixili vesi tippukovali water avasaram annappudu indaka unchina water vadukovali
Mixi ayyaka Danni mallii vadakattali aa liquid ni malliii pan lo kasta butter vesi dantlo posesi baaaga udakaniyali
Udiketappudu pepper powder veyali..sweet kavalisina vallu kasta creme vesukovachhu

Soup kasta palchaga anipiste creme lekapote corn starch kasta veste daggara padutundi antee soup ready

(Mixi vesetappudu cold water aina vadukovachhu ..Malli vadakattaga pan lo posinappudu thick ga unte mundu unchina vadakattina water vadukovachhu)


Sunday, 2 September 2018

జున్ను

జున్ను  తయారీ  విధానము .

మొదటి రోజు  జున్ను పాలు  చాలా  చిక్కగా  ఉంటాయి .

అందువలన  గ్లాసు పాలకు  రెండు గ్లాసుల  మామూలు పాలు  కలపాలి .

అందులో  షుమారు  ఒక  70  గ్రాముల  బెల్లం  పొడి  చేసి  గరిటతో  కరిగే దాకా  కలపాలి .

తర్వాత  బెల్లం  కలిపిన  పాలను వడకట్టి  అడుగున  ఇసుక  వంటిది  తీసేసుకోవాలి .

వేరే  గిన్నెలో  పోసుకోవాలి .

ఒక   స్పూను  యాలకుల  పొడి  వేయాలి.

ఒక స్పూను  మిరియాల  పొడి  కూడా  వేసి  బాగా  కలపాలి .

ఇప్పుడు   కుక్కర్  లో  తగినన్ని   నీళ్ళు పోసి  ఈ జున్నుపాల  గిన్నె  పెట్టి  విజిల్  పెట్టకుండా  మూత  పెట్టి  స్టౌ  మీద  పది నిముషాల  పాటు  ఉంచి  ఒకసారి  గట్టి పడిందేమో  చూసుకుని   దింపుకోవాలి .

అంతే  అందరికీ  ఎంతో  ఇష్టమైన  జున్ను  సేవించడానికి  సిద్ధం.

Thursday, 30 August 2018

Instant నిమ్మకాయ కారం

నిమ్మకాయ కారం అంటే ఇష్టం లేనిది ఎవరికి? వేడి వేడి అన్నంలో నిమ్మకాయ కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ మజా ఏ వేరు. అయితే, అన్ని సార్లూ ఆ ఊరగాయ లభ్యపడకపోవచ్చు. అందుకే ఇవాళ instant నిమ్మకాయ కారం పోస్ట్ చేస్తున్నాను. దీనికి ముక్కలు ఊరవేయడం, ఎండబెట్టడం అవసరంలేదు. One week వరకు నిలువ ఉంటుంది. ఈ instant pickle చాలా మందికి తెలిసే ఉండొచ్చు కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఉపయోగపడుతుందని posting. ఒకటి లేదా రెండు నిమ్మకాయల తో అయినా చేసేసుకోవచ్చు.
నిమ్మకాయలు పెద్దవి - 2
ఉప్పు, కారం 1:1 ratio lo తీసుకోవాలి. కాస్త మెంతిపిండి , ఇష్టమైతే ఆవపిండి కూడా కలుపుకోవచ్చు. (ఆవపిండి optional). ముందుగా రసం తీసుకుని  అందులో నిమ్మకాయ చిన్న చిన్న ముక్కలు వేసుకొని  , ఆ రసంలో ఉప్పు , కారం , మెంతిపిం డి వేసి తరువాత అందులో తాలింపు పెట్టుకోవడమే. తాలింపు నువ్వుల నూనె తో అయితే బాగుంటుంది. ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి , ఇంగువ తిరగమోత వేసుకొని కలిపేసుకోడమే. (నిమ్మరసం తీయగానే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకుంటే ఒక పూట ఊరాక మరింత బాగుంటుంది. అల్లం ముక్కలు వేసుకోవడం కూడా optional) . Instant pickle కాబట్టి ఆ పూటే తినేయచ్చు.

Sunday, 19 August 2018

దోసకాయ పచ్చడి

దోసకాయ ముక్కల పచ్చడి .

కావలసినవి .

పసుపు రంగు గట్టి  దోసకాయ  ---  ఒకటి.

పై  చెక్కు   తీసి  చిన్న  చిన్న  ముక్కలుగా  తరుగు కోవాలి .

చిన్న నిమ్మకాయంత  చింతపండు   విడదీసి  కొద్దిగా నీళ్ళతో  తడిపి  ఉంచుకోవాలి ..
 
పచ్చిమిరపకాయలు  --  10

కొత్తి మీర   ---  రెండు చిన్న కట్టలు .
మరి కాస్త  వేసుకున్నా  చాలా  రుచిగా  ఉంటుంది .

కట్టలు  విడదీసి  కాడలు  తీసేసి  కొత్తిమీర   శుభ్రం  చేసుకోవాలి .

ఉప్పు   ---   తగినంత

పసుపు  ---  కొద్దిగా .

పోపుకు  .

ఎండుమిరపకాయలు  --  6

మినపప్పు   ---  స్పూను

మెంతులు  ---   పావు  స్పూను

ఆవాలు  ---   అర  స్పూను 

ఇంగువ  ---  కొద్దిగా

నూనె  ---   50  గ్రాములు

తయారీ  విధానము  .

ముందుగా  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తం  నూనె  పోయాలి.

నూనె  బాగా  కాగనివ్వాలి  .

నూనె బాగా కాగగానే   మెంతులు , ఎండుమిరపకాయలు  ,  మినపప్పు , ఆవాలు  మరియు  ఇంగువ  వేసి  పోపు  బాగా  వేగనివ్వాలి .

ఎక్కువ   నూనె  ఉంటే  ఆఖరున  పచ్చడిలో  కలుపుకోవచ్చు.

బాండీ లోనే  ఉంచేయండి

పోపు  చల్లారగానే  ముందుగా   రోటి లో  ఎండుమిరపకాయలు , తగినంత  ఉప్పు  మరియు  పసుపు వేసి  మెత్తగా  పచ్చడి బండతో  దంపుకోవాలి.

తరువాత  పచ్చిమిర్చి  , తడిపిన  చింతపండు   మరియు  పోపును  రోటిలోలో వేసి మరో సారి మెత్తగా  పచ్చడి బండతో  దంపుకోవాలి.

చివరగా  దోసకాయ  ముక్కలు  మరియు కొత్తిమీర  వేసి   ఒకే  ఒక్కసారి  దోసకాయ  ముక్కలు  నలగ  కుండా  పైపైన బండతో నూరుకోవాలి .
 
తర్వాత  నూరిన పచ్చడి ఒక  గిన్నెలోకి  తీసుకుని  బాండీలో  కాగిన  మిగిలిన  నూనె  అందులో పోసి   గరిటతో  ముక్కలు  పచ్చడి  బాగా కలిసేటట్లు  కలుపుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా   ఉండే  దోసకాయముక్కలు  పచ్చడి  సర్వింగ్ కు  సిద్ధం .

Friday, 17 August 2018

Modi about Atalji

A leader for the ages, he was ahead of the times http://nm-4.com/sns6 via NaMo App

Monday, 13 August 2018

కొబ్బరి కారం/కొబ్బరి పొడి

కావాల్సినవి:

ఎండు కొబ్బరి చిప్పలు  ---  2
ఎండుమిరపకాయలు  --  15
జీలకర్ర  --  స్పూనున్నర
వెల్లుల్లి  పాయ రెబ్బలు  --  15 
ఉప్పు  --  తగినంత .

తయారీ  విధానము .

ముందుగా   స్టౌ  వెలిగించి   సెగ  సిమ్  లో  పెట్టుకోవాలి .

ఎండు  కొబ్బరి  చిప్పలు  స్టౌ  మీద పెట్టి  వెనుక  వైపు  కొబ్బరి  చిప్పలను  మధ్య మధ్య  తిప్పుతూ  కమ్మని  వాసన  వచ్చేదాకా   కాల్చుకోవాలి .

ఎక్కువ  సెగన  కాల్చుకుంటే  చిప్పలు  మాడి పోవచ్చును  లేదా  చిప్పలు  అంటుకునే  ప్రమాదం  ఉంది .

కొబ్బరి  చిప్పలు  చల్లారగానే  ఎండు కొబ్బరి  తురుముతో  తురుము  కోవాలి .

లేదా  చాకుతో  చిన్న చిన్న ముక్కలుగా  చేసుకోవాలి .

ఎండుమిరపకాయలు  తొడిమలు  తీసుకోవాలి .

ఇప్పుడు   స్టౌ  మీద  బాండీ  పెట్టి  నూనె  వేయకుండా  ఎండుమిరపకాయలు , జీలకర్ర  వేసి  మిరపకాయలు  వేగిన  వాసన వచ్చేదాకా  వేయించుకోవాలి .

వెల్లుల్లి పాయలు  పై పొట్టు  తీయకుండా  రెబ్బలుగా  వలుచుకోవాలి .

ఇప్పుడు   మిక్సీలో  వేగిన ఎండుమిరపకాయలు  , జీలకర్ర , తగినంత  ఉప్పు వేసి  మెత్తగా  వేసుకోవాలి .

తర్వాత  ఎండు కొబ్బరి  ముక్కలు  /  లేక  తురిమిన  ఎండు  కొబ్బరి  మిక్సీ లో  వేసుకుని  మరీ  మెత్తగా  కాకుండా  వేసుకోవాలి .

తర్వాత  ఒక సీసాలో  భద్రపర్చుకోవాలి .

వెల్లుల్లి  ఇష్టం  లేని వారు  మరో అర స్పూను  జీలకర్ర  వేసుకుని  చేసుకోవచ్చు .

ఈ కొబ్బరి పొడి  షుమారు  20  రోజులు  నిల్వ  ఉంటుంది .

ఈ  కొబ్బరి  కారం  లేదా  కొబ్బరి పొడి  వేడి వేడి  అన్నంలో  మరి కాస్త నెయ్యి వేసుకుని  కలుపుకుని  తింటే  అద్భుతమైన  రుచిగా  ఉంటుంది.

Monday, 6 August 2018

నిమ్మకాయ కారం

నిమ్మకాయ కారం.  రోటి పచ్చడి .

కావలసినవి .

ఎండుమిరపకాయలు  -- పది
నిమ్మకాయలు  --  4
పొట్టు మినపప్పు --  40  గ్రాములు
మెంతులు  --   మూడు  స్పూన్లు
ఆవాలు  --  పావు  స్పూను
పసుపు  --  కొద్దిగా
ఇంగువ --  మరి  కాస్త 
జీలకర్ర  --  పావు  స్పూను
నూనె  --  మూడు  స్పూన్లు
ఉప్పు  --  తగినంత

తయారీ  విధానము .

ముందు  నిమ్మకాయలు  అడ్డంగా  కోసుకొని  ఒక  గిన్నెలో  రసము  తీసుకోవాలి.

స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్లు   నూనె  వేసి ,  నూనె  కాగగానే   ముందుగా   మెంతులు, పొట్టు మినపప్పు  ,   ఎండుమిరపకాయలు  వేసి కమ్మని  వాసన  వచ్చే దాకా  వేయించుకోవాలి.

ఆ తర్వాత  జీలకర్ర , ఇంగువ , వేసి  వేగాక  దింపి  దానిపై  కొద్దిగా  పసుపు   వేసుకోవాలి.  

చల్లారగానే  రోటిలో  వేగిన  పోపు , తగినంత   ఉప్పు  వేసి  పప్పులు  తగిలే విధంగా  పచ్చడి బండతో దంపుకోవాలి .

తర్వాత  ఈ మిశ్రమాన్ని   గిన్నెలో  తీసిన  నిమ్మరసం   తో  కలిపాలి.

స్పూను  తో  బాగా  కలుపుకోవాలి .

ఈ  నిమ్మకాయ  కారం  గట్టిగా   ఉంటే   బాగుంటుంది .

పల్చగా   కావాలను కునే  వారు  మరో కాయ  నిమ్మరసం   పిండుకోండి.

ఈ  నిమ్మకాయ  కారం  రోటిలో  రోకలితో  దంపుకుని  చేసుకుంటే  అద్భుతంగా  ఉంటుంది .

ఈ  కారం  అన్నం  లోకి , ఇడ్లీల లోకి , దోశెల లోకి , దిబ్బ రొట్టె   లోకి  కూడా  చాలా  బాగుంటుంది .

కందిపప్పు  రెండు స్పూన్లు  నెయ్యి వేసి వేయించుకుని , తగినన్ని  నీళ్ళు పోసుకుని , ముద్దపప్పు లా వండుకుని , వేడి వేడి అన్నంలో  మరి కాస్త నెయ్యి వేసుకుని , పప్పు కలుపుకుని, ఈ నిమ్మకాయ కారం నంచుకొని  తిని ఎలా ఉందో చెప్పండి.