స్టౌ మీద బాండీ పెట్టుకుని అందులో ఒక పావు కిలో కందిపప్పు , 20 ఎండుమిరపకాయలు , రెండు స్పూన్లు జీలకర్ర వేసుకుని , నూనె వేయకుండా కంది పప్పు మాడకుండా అట్లకాడతో కదుపుతూ, కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి.
చల్లారగానే మిక్సీ లో ఈ మిశ్రమమును వేసుకుని అందులో పావు స్పూను ఇంగువను మరియు తగినంత ఉప్పును వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి.
తర్వాత ఈ పొడిని ఒక బేసిన్ లో వేసుకుని చేతితో బాగా కలుపుకుని ఒక సీసాలోకి తీసుకోవాలి .
ఈ కందిపొడి మూడు నెలలు నిల్వ ఉంటుంది.
వేడి వేడి అన్నంలో నెయ్యి కాని , పప్పు నూనె కాని వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.
ఈ పొడికి కాంబినేషన్ గా దోసావకాయ కాని , కొత్తావకాయ కాని , పచ్చి పులుసు కాని చాలా రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment