కావలసినవి
కొబ్బరి కాయ -- ఒకటి . పగుల కొట్టి పచ్చి కొబ్బరి కోరాముతో తురుము కోవాలి.
వాక్కాయలు -- 100 గ్రాములు
శుభ్రం చేసుకుని లోపల గింజను తీసి వేసుకుని ముక్కలుగా తరుగు కోవాలి.
ఎండుమిరపకాయలు -- 8
పచ్చి మిరపకాయలు -- 6
మినపప్పు -- స్పూనున్నర
ఆవాలు -- అర స్పూను
మెంతులు -- పావు స్పూను
జీలకర్ర -- పావు స్పూను
ఇంగువ -- కొద్దిగా
పసుపు -- కొద్దిగా
ఉప్పు -- తగినంత
నూనె -- మూడు స్పూన్లు
కరివేపాకు -- రెండు రెమ్మలు .
తయారీ విధానము .
ముందుగా కొబ్బరి తురుము , వాక్కాయ ముక్కలు సిద్ధం చేసుకోవాలి .
తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు , మెంతులు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు వేయించుకొని పోపు వేగగానే అందులో పచ్చి మిరపకాయలు కూడా వేసి రెండు నిముషములు మగ్గనిచ్చి దింపుకోవాలి .
ఇప్పుడు ముందుగా మిక్సీ లో ఎండుమిరపకాయలు , తగినంత ఉప్పు మరియు పోపు వేసి పచ్చడి మెత్తగా మిక్సీ వేసుకోవాలి.
తర్వాత వాక్కాయ ముక్కలు , పచ్చిమిర్చి , పసుపు వేసి మరి మెత్తగా కాకుండా మిక్సీ వేసుకోవాలి .
ఇపుడు చివరగా కొబ్బరి తురుము కూడా వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ వేసుకోవాలి.
తర్వాత పచ్చడి వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
అంతే పుల్ల పుల్లగా ఇంగువ వాసనతో ఎంతో రుచిగా ఉండే కొబ్బరి వాక్కాయ పచ్చడి రెడీ.
No comments:
Post a Comment