రవ్వ పులిహోర చేయటానికి బియ్యం రవ్వ పాత బియ్యంతో పట్టిస్తే బావుంటుంది. బయట కొనే రవ్వ చాలాసార్లు ముద్దగా అవుతోంది. లలితా బ్రాండ్ రవ్వ చాలా బావుంటోంది. అది దొరికితే తీసుకోండి.
కాస్త మందంగా ఉన్న గిన్నె స్టవ్ మీద పెట్టి వేడెక్కాక ఎసరు పోయాలి.కప్పు బియ్యం రవ్వకు రెండు కప్పుల నీళ్లు పోయాలి. ఎషరు మరుగుతుండగా టీ స్పుాన్ నుానె వేయాలి. మరిగే ఎసరు సిమ్ లో పెట్టి బియ్యపు రవ్వ పోయాలి. ఉండ కట్టకుండా కలియబెడుతుా ఉండాలి. రవ్వ దగ్గర పడ్డాక, పైన నీళ్ల పళ్లెం ముాత పెట్టి, సిమ్లో ఉంచితే పలుకు లేకుండా, చక్కగా ఉడుకుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఉడికిన రవ్వ ను ఒక పళ్లెంలోకి తీసుకోవాలి. బాణలి స్టవ్ మీద పెట్టి, ముాడు నాలుగు గరిటెల నుానె వేసుకోవాలి. ఇంగువ, శనగ పప్పు, మినప్పప్పు ఆవాలు జీలకరిర, ఎండుమిర్చి చీల్చిన పచ్చిమిర్చి కరివేపాకు శనగగుళ్లు వేసి వేయించాలి. ఈ పోపులోనే చివరగా తగినంత పసుపు వేసుకోని స్టవ్ ఆఫ్ చేయాలి. దీనిని ఉడికించి పెట్టుకున్న రవ్వలో బోర్లించ్లి. తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో తగినంత నిమ్మరసం కలుపుకోవాలి! అంతే! రవ్వ చేత్తో చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరో విషయం నిమ్మరసంలో కానీ, దబ్బకాయ రసం తో కానీ చేసే పులిహోర లో చిటికెడు పంచదార కలిపి చుాడండి. ఎక్ట్రా టేస్ట్ ఏడ్ అవుతుంది. ఇది మా మామ్మగారు చెప్పిన చిట్కా!
ఇందులో నిమ్మరసం బదులుగా చింతపండు రసంతో పులిహోర పోపు కుాడా వేసుకోవచ్చు!!
Monday 22 January 2018
పిండి పులిహోర (రవ్వ పులిహోర)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment