Tuesday, 30 January 2018

అప్పడాల పిండి

నేనూ అ. భా.శా. భో.సం లో చేరాను , అప్పడాలపిండి తయారు చేయడం నేర్చుకున్నాను 😋😋

రెసిపీ :
ఒక కప్పు మినపపిండి
(తెల్లమినుములు కాస్త ఎండలో పెట్టి, మిక్సి లో మెత్తగా (దంచాను)ఆడాను)

ఒక రెండు చెంచాల కారం(ఎవరెస్ట్ తీకాలాల్)

ఉప్పు రుచికి సరిపడా ...

నూనె 2 కూర చెమ్చాలు 😁

ఒక రెండు చిటికెళ్ళ ఇంగువ రెండు చెంచాల నీళ్లలో కలపాలి..

ముందు పిండి ,కారం, ఉప్పు కలుపుకోవాలి ..అన్నీ బాగా కలిపాకా , నూనె కూడా వేసి మళ్ళీ కలుపుకోవాలి . ..పిండి  కలపకుండా నూనె పోస్తే ఉప్పు, కారం సరిగా కలవవు...ఇప్పుడు ఆ ఇంగువ నీళ్లు కూడా వేసి బాగా కలిపాకా...

ఇప్పుడు జాగ్రత్తగా వినండి...

చపాతిపిండి ని కలిపినట్టే నీళ్లుపోసి చేతితో కలిపేద్దాం అని అనుకోకండి, పహిల్వాన్ల వల్ల కూడా కాదు...

చేతుల్లో బలం ఉంటే రోట్లో నో , లేదా అమాన్ దస్తా లోనో వేసి మధ్య మధ్యలో నీళ్లు పోసి ఉండలా అయ్యేవరకూ మెత్తగా దంచుతూ ఉండండి...దమ్ లగాకే హైసా...దంచండి...దంచండి..బాఘా దంచండి

లేదా

మిక్సి లో వేసి కొంచం నీళ్లు పోసి రెండు తిప్పులు తిప్పండి ..సరిగా ఉండగట్టి మెత్తగా అనిపిస్తే తీసేయండి 🙂, లేదంటే మళ్ళీ నీళ్లు , మిక్సి... రిపీట్ (follow do...While loop till the " pindi " becomes softer and softer)  😁😁😁

సీరియస్ గా చెప్పాలని ప్రయత్నించిన ప్రతిసారి ఫెయిల్ అయ్యి నా రెసిపీ తో పాటుగా హ్యూమర్ కలుస్తూ ఉంటుంది, అడ్మిన్లు, జనులు, అన్యధా భావించకండి 🙏😁

No comments:

Post a Comment