మజ్జిగ పులుసు తయారీ విధానం: మోదటగా కూరముక్కలు బెండకాయ, సొరకాయ, టమోటా లాంటివి ఓ నాలుగు గ్లాసుల నీళ్ళలో వేసి ఉడక బెట్టండి, ఈలోపు ఐదు పచ్చిమిరపకాయలు, అంగుళం అల్లం ముక్కా, కొద్దిగా కొబ్బరి, ఓ రెండు చెంచాల శనగపిండి, అరచెంచా పసుపు, తగినంత ఉప్పూ, కొద్దిగా నీరు పోసి మిక్సీలో పేష్టు చెయ్యండి, దీనిని ఓ గ్లాసుడు చిక్కని పులిసిపోయిన మజ్జిగలో కానీ లేక వెన్న తీసిన మజ్జిగలో కానీ కలిపి విడిగా ఉంచండి.
ఉడుకుతున్న ముక్కల నీళ్ళలో సిద్దంగా ఉన్న మజ్జిగని పోసి, మంట తగ్గించి, మధ్యమధ్యలో కలియతిప్పుతూ ఉండండి, కరివేపాకు నాలుగు రెబ్బలు వేయండి, నిలువుగా చీరిన పచ్చిమిర్చీ కావాలనుకుంటే ఓ రెండు వేయండి, బాగా పొంగు వచ్చాక స్టౌ ఆపేయండి. తాలింపు పెట్టండి.
కొంచెం పులుపు కావాలనుకుంటే చల్లారేటప్పుడు ఓ నిమ్మకాయ పిండండి. అంతేనండి
Wednesday, 31 January 2018
మజ్జిగ పులుసు
డోక్లా
మితృలందరికి శుభోదయం. 🙏
ఈరోజు మా ఇంట్లో ‘ డోక్లా’ చేసుకున్నామోచ్.
సామాన్యంగా Basan ki dhokla చేస్తుంటారు.
అంటే శనగపిండి తో చేస్తారు. అలాగే బొంబాయి రవ్వతో కూడా చేస్తారు. Moongdal ( పెసరపప్పుతో) తో చేస్తారు.
పప్పులు నాన బెట్టి రుబ్బి చేస్తారు. రెండోరకం పిండి తో చేస్తారు.
నేను పొట్టు మినపప్పు నానబెట్టి రుబ్బి చేసాను. ఆవిరి మీద వండి తిరగమాత ఎసరుతో తయారవుతుంది.ఎవరికైన తయారీ పద్దతి కావాలంటె post పెడతాను.
రుచి: పుల్ల పుల్లగా తియ్యతియ్యగా ఖారంఖారంగా కొతిమేర వాసనతో కొబ్బరి నాలికకి తగులుతూకమ్మటిమినప రుచితో వుంటుంది.
మీకు నచ్చిందా మరి?
మినప ఢోక్లాకయారీ:
( by Sistla Kamala)
1 cup మినపప్పు మధ్యాహ్నం నానబెట్టి రాత్రి చెంచా మరమరాలు గాని అటుకులు గాని వేసి గట్టిగ రుబ్బి మూతపెట్టండి. పొద్దునే దానిలో ఓ చిటికెడు పసుపు 2 పెద్దచంచాల బోలు శనగపప్పు బరక పిండి 3 పెద్దచంచాల అతిసన్నని ఇడ్డీరవ్వ లేక బరక బియ్యం పిండి కలిపి తగిన వుప్పు చేర్చి ఇడ్లీ పిండి మాదిర కలపాలి. ఇందులో అరచంచా ‘ఈనోసాల్టు ‘ వేసి దానిపై 1/4 చంచ నిమ్మరసం వేయాలి. ఈనో సాల్టు బుసబుస పొంగాక గరిటెతో కలియ తిప్పండి. ముందుగా నూనెరాసి పెట్టుకున్న. కుక్కరు గిన్నెలో ఈ పిండి పోసి కుక్కరు లో పెట్టి 15 నమిషాలు weight పెట్టకుండావుడకనీయండి.2నిమిషాల తరువాత
తరువాత తీసి ఓ కంచంలోకి బోళ్ళించండి. చాకుతో గాట్లు పెట్టండి.
ఒక తావాలో నేనె వేసి ఆవాలు జీలకర్ర చిట్లించి సన్నని మిరప ముక్కలు(2 కాయలు) కొతిమేర తరుగు వేసి పావు లీటరు నీరు పోయండి. తెరలిన తరువాత తగిన వుప్పు 1 spoon చక్కర 1 spoon నిమ్మరసంవేసి ఆ వేడి నీటిని ఆవిరికుడుము ముక్కల పై spoon తో పోయండి. 2 , 3 ధపాలుగా పోయాలి.చాకుతో అడుగు భాగంలేపితే నీరు అడుగు భాగంకూడా పీల్చుకొని ఢోక్లా రుచిగా వుంటుంది. నీరు పోసాక 10 నిమిషాలకు ఢోక్లాలు తినవచ్చు. పైన పచ్చి కొబ్బరితో garnish చేసుకోవాలి. ఇష్టమయినవారు బాదామి
లేక జీడిపప్పు ముక్కలని జల్లుకోవచ్చు.
సంపూర్ణ చంద్ర గ్రహణం గురించి నాసా సంస్థ విడుదల చేసిన క్లిప్పింగ్స్
Tuesday, 30 January 2018
అప్పడాల పిండి
నేనూ అ. భా.శా. భో.సం లో చేరాను , అప్పడాలపిండి తయారు చేయడం నేర్చుకున్నాను 😋😋
రెసిపీ :
ఒక కప్పు మినపపిండి
(తెల్లమినుములు కాస్త ఎండలో పెట్టి, మిక్సి లో మెత్తగా (దంచాను)ఆడాను)
ఒక రెండు చెంచాల కారం(ఎవరెస్ట్ తీకాలాల్)
ఉప్పు రుచికి సరిపడా ...
నూనె 2 కూర చెమ్చాలు 😁
ఒక రెండు చిటికెళ్ళ ఇంగువ రెండు చెంచాల నీళ్లలో కలపాలి..
ముందు పిండి ,కారం, ఉప్పు కలుపుకోవాలి ..అన్నీ బాగా కలిపాకా , నూనె కూడా వేసి మళ్ళీ కలుపుకోవాలి . ..పిండి కలపకుండా నూనె పోస్తే ఉప్పు, కారం సరిగా కలవవు...ఇప్పుడు ఆ ఇంగువ నీళ్లు కూడా వేసి బాగా కలిపాకా...
ఇప్పుడు జాగ్రత్తగా వినండి...
చపాతిపిండి ని కలిపినట్టే నీళ్లుపోసి చేతితో కలిపేద్దాం అని అనుకోకండి, పహిల్వాన్ల వల్ల కూడా కాదు...
చేతుల్లో బలం ఉంటే రోట్లో నో , లేదా అమాన్ దస్తా లోనో వేసి మధ్య మధ్యలో నీళ్లు పోసి ఉండలా అయ్యేవరకూ మెత్తగా దంచుతూ ఉండండి...దమ్ లగాకే హైసా...దంచండి...దంచండి..బాఘా దంచండి
లేదా
మిక్సి లో వేసి కొంచం నీళ్లు పోసి రెండు తిప్పులు తిప్పండి ..సరిగా ఉండగట్టి మెత్తగా అనిపిస్తే తీసేయండి 🙂, లేదంటే మళ్ళీ నీళ్లు , మిక్సి... రిపీట్ (follow do...While loop till the " pindi " becomes softer and softer) 😁😁😁
సీరియస్ గా చెప్పాలని ప్రయత్నించిన ప్రతిసారి ఫెయిల్ అయ్యి నా రెసిపీ తో పాటుగా హ్యూమర్ కలుస్తూ ఉంటుంది, అడ్మిన్లు, జనులు, అన్యధా భావించకండి 🙏😁
Monday, 22 January 2018
అరటి కాయ చిప్స్ (Raw Banana Chips)
చాలా ఈజీ. అరటి కాయలు కాస్త డీప్ గా చెక్కుతీయాలి. శుభ్రంగా మరోసారి కడగాలి. చిప్స్ కట్టర్ తో చిప్స్ కట్ చేయాలి. చాలా పల్చగా వస్తాయి. కంగారు పడకండి. ఈ చిప్స్ న్యుాస్ పేపర్ మీద కానీ, తెల్లటి పల్చటి బట్టమీద కానీ అయిదు నిముషాలు ఆరబెట్టాలి. బాండీలో నుానెపోసి, బాగా కాగాక, ఇవి వేసి వేయించటమే! వేపు ఆగేదాకా వేయించి తీసేయాలి. నుానె అవసరమైతే సిమ్లో పెట్టుకోవాలి మధ్యలో. ఉప్పు కారం ప్లేటులో కలిపి పెట్టుకుని చిప్స్ మీద అన్నిటికీ పట్టేట్టు చల్లుకోవాలి!! అంతే
పిండి పులిహోర (రవ్వ పులిహోర)
రవ్వ పులిహోర చేయటానికి బియ్యం రవ్వ పాత బియ్యంతో పట్టిస్తే బావుంటుంది. బయట కొనే రవ్వ చాలాసార్లు ముద్దగా అవుతోంది. లలితా బ్రాండ్ రవ్వ చాలా బావుంటోంది. అది దొరికితే తీసుకోండి.
కాస్త మందంగా ఉన్న గిన్నె స్టవ్ మీద పెట్టి వేడెక్కాక ఎసరు పోయాలి.కప్పు బియ్యం రవ్వకు రెండు కప్పుల నీళ్లు పోయాలి. ఎషరు మరుగుతుండగా టీ స్పుాన్ నుానె వేయాలి. మరిగే ఎసరు సిమ్ లో పెట్టి బియ్యపు రవ్వ పోయాలి. ఉండ కట్టకుండా కలియబెడుతుా ఉండాలి. రవ్వ దగ్గర పడ్డాక, పైన నీళ్ల పళ్లెం ముాత పెట్టి, సిమ్లో ఉంచితే పలుకు లేకుండా, చక్కగా ఉడుకుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఉడికిన రవ్వ ను ఒక పళ్లెంలోకి తీసుకోవాలి. బాణలి స్టవ్ మీద పెట్టి, ముాడు నాలుగు గరిటెల నుానె వేసుకోవాలి. ఇంగువ, శనగ పప్పు, మినప్పప్పు ఆవాలు జీలకరిర, ఎండుమిర్చి చీల్చిన పచ్చిమిర్చి కరివేపాకు శనగగుళ్లు వేసి వేయించాలి. ఈ పోపులోనే చివరగా తగినంత పసుపు వేసుకోని స్టవ్ ఆఫ్ చేయాలి. దీనిని ఉడికించి పెట్టుకున్న రవ్వలో బోర్లించ్లి. తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో తగినంత నిమ్మరసం కలుపుకోవాలి! అంతే! రవ్వ చేత్తో చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరో విషయం నిమ్మరసంలో కానీ, దబ్బకాయ రసం తో కానీ చేసే పులిహోర లో చిటికెడు పంచదార కలిపి చుాడండి. ఎక్ట్రా టేస్ట్ ఏడ్ అవుతుంది. ఇది మా మామ్మగారు చెప్పిన చిట్కా!
ఇందులో నిమ్మరసం బదులుగా చింతపండు రసంతో పులిహోర పోపు కుాడా వేసుకోవచ్చు!!
కొత్తిమీర పచ్చడి
కొత్తిమీర పచ్చడి
బాగ పెద్ద సైజు కొత్తిమీర కట్ట తీసు కుని పాడయిన ఆకు వుంటే తీసి వేసి కడగి సన్న గా కట్ చేసి పెట్టుకుని.
కొత్తి మీర కి సరి పడా పచ్చి మిరప కాయలు నిమ్మ కాయంత చింతపండు తీసుకుని రోట్లో ముందుగా పచ్చి మిర్చి నూరాలి మిగిలినవి కూడావేసి నూరిన తర్వాత చివరలో కొత్తిమీర ఉప్పు వేసి నూరి తాలింపు పెడితేసరి . కొత్తిమీర ని మరీ మెత్త గా నూరితే బావుండదు అన్ని పచ్చి వే నూరాలి
అన్ని పచ్చళల మాదిరిగానే తాలింపు వేయాలి .తాలింపులో ఓకనిమిషం ఉడికించి పచ్చడి రంగు మారగానే స్టవ్ మీద నుంచి దించితే సరి.ఈ పచ్చడి రైస్ లోకి టిఫిన్స్ లోకి బాగుంటుంది.