పావ్ (బ్రెడ్) బాజీ
*మసలుతున్న నీటిలో నాలుగు టమాటోలు ఉడకబెట్టుకుని , రుబ్బి ఉంచాలి.
*రెండు ఉల్లిగడ్డలు సన్నగ తరగాలి.
*కొత్తిమీర తరుగుకోవాలి.
*రెండు ఉడకబెట్టిన ఆలు గడ్డలను పొట్టు తీసి స్మాష్ చేయ్యాలి.
*వెల్లుల్లి రెబ్బలు కొన్ని దంచు కోవాలి.
*మూకుడులో చెరొక చంచా వెన్న, నూనె వేసి ,వెల్లుల్లి వేసి, దోరగ అయిన తర్వాత ఉల్లితరుగు , ఉప్పు వేసి, దోరగ అయ్యేవరకు వేపి స్పీన్నున్నర ఎవరెస్ట్ పావ్ బాజీ మసాల,లఒక స్పూన్ కారంపుడి వేసి కలిపి,
*ఆలుగడ్డలు, టమాట జూస్ వేసి కొద్దిగ నీరు వేసి,
*మసలుతున్నప్పుడు రెండు చంచా వెన్న , అర చంచా పావ్ బాజీ మసాల వేసి,గార్నిష్ చేసుకోవాలి.
ఇక్కడ నేను బేసిక్ బాజీ రెసిపీ చెప్పాను.కాలిఫ్లవర్, కాపిసకమ్, బటాణి కూడ వేసుకోవచ్చు.
బ్రెడ్ స్లైసస్ ని వెన్నతో టోస్ట్ చేసి , పైన పావ్ బాజీ మసాల వేసుకోవాలి. ( నాకు పావ్ బ్రెడ్ కన్నా మామూలు బ్రెడ్ నచ్చుతుంది) వేడి వేడి గ తినడమే.