Sunday, 6 May 2018

కొబ్బరి ఉండలు

రెండు చిప్పల కొబ్బరికి పావుకేజీ బెల్లం పడుతుంది
కొబ్బరి తురుము కోవాలి
బెల్లం చిన్నముక్కలుగా చేయాలి
4 యాలకులు పొడి చేసి ఉంచాలి
అర కప్ చక్కెర, గరిటడు నెయ్యి కూడా రెడీగా ఉంచాలి
బాండీ లో కొద్దిగా నెయ్యి వేసి10 నిమిషాలు కొబ్బరి వేయించాలి, చిన్న సెగ మీద పెట్టండి.
లోతుగా వుండే గిన్నె
(నేను pan లో చేసాను)
తీసుకుని బెల్లం వేసి అరకప్ నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి కలపెడుతూ ఉండాలి, చక్కెర కూడా వేసేయ్యండి
ఉండ పాకం రానివ్వండి
నెయ్యి కూడా వేసి, కొబ్బరి వేసి బాగా కలుపుతూ దగ్గరికి రానివ్వాలి, యాలకుల పొడి వేసి దించేయాలి
చల్లారాక చేతికి కొద్దిగా కరిగిన నెయ్యి రాసుకుంటూ ఉండలు చేసుకోవాలి, అరుణ గారు

No comments:

Post a Comment