రోజూ బ్యాంకులు ఎటిఎం ల వద్ద క్యూల్లో నిలబడి వేలు తీసుకువచ్చి ఖర్చు చేసేంత సీను జర్నలిస్టులకు లేదు. మిడిల్ క్లాసోళ్లకీ లేదు. నేతలు తరచూ పేర్కొనే పేదలకు (కామన్ మాన్) కూ లేదు. రెండో పద్దు (దొంగ పద్దు అనేంత పెద్ద మాట వాడలేదు) కింద లెక్క రాయని వ్యాపారులు కొనుగోళ్లు చెయ్యట్లేదు. నలభై శాతం వైటు అరవై శాతం బ్లాకు లేదా ఫిఫ్టీ-ఫిఫ్టీ చేసే రియల్ ఎస్టేటు వాళ్లు, నక్సల్స్ డంపుల నుంచి, నయీమ్ గ్యాంగూ దగ్గర కట్టల కట్టల నోట్లు నొక్కేసిన ఐపీఎస్ అధికారులు, పోలీసు సిబ్బంది, అవినీతి ఐఏఎస్ లు, రవాణా చెక్ పోస్ట్ అధికారులు, కోట్లు లంచాలు ఇచ్చి పోస్టింగులు వేయించుకున్న సబ్ రిజిస్ట్రార్లు, కరెంట్ కనెక్షకు- ట్రాన్స్ ఫార్మర్ మార్పిడికి వేలు గుంచుకునే విద్యుత్ అధికారులు, కోట్లు కుమ్మరించి సర్పంచులుగా గెలిచినోళ్లు, ఎమ్మెల్యే ఎంపీ టికెట్ల కోసం లక్షలు ఇచ్చి, గెలవడానికి కోట్లు ఖర్చు పెట్టినోళ్లు, సినిమాల్లో నటించడానికి లచ్చలు కోట్లు తీసుకునేటోల్లు, సెంచరీ కొట్టగానే యాడ్స్ కోసం లచ్చలు తీసుకునే ఆటగాళ్లు, ఉద్యమం చేస్తున్నాం.. ఖర్చుల కోసం మీకాడకు వచ్చి కూలి చేస్తాం.. ఒక తట్ట మట్టో చేత్తో ఎత్తుతం.. లచ్చ ఇవ్వాలని డిమాండు చేసి మరీ గుంజుకున్న నేతలకు.. నాన్న పేరు చెప్పి సారీ చెట్టు పేరుచెప్పి కాయలమ్ముకున్న వారికీ.. మైనార్టీ అంటూ స్కూల్స్ కాలేజీలు పెట్టి వేలల్లో ఫీజులు.. లచ్చల్లో డొనేషన్లు పిండుకున్న వాళ్లు.. స్వచ్చందంగా సేవ చేస్తామంటూ డొనేషన్ల తో మత మార్పిడి చేసేటోళ్లను... దేవుడి పేరు చెప్పి గుళ్ళు గోపురాలు మందిరాలకు వేలు వసూలు చేసే దొంగ బాబాలకు.. పాపం పెద్ద నోట్ల రద్దుతో చాల ఇబ్బందే కలిగింది. రైతు పండించిన టమాట ను కిలో ఏభై పైసలకు కూడా కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడానికి.. క్యాబేజీని రూపాయికి కొనకపోవడానికి కూడా వెయ్యి ఐదు వందల నోట్లు లేకపోవడమే కారణం. ప్రధాన మంత్రి మోడీదే తప్పంతా. ఇప్పటికైనా మోదీ గారు మనసు మార్చుకుని బ్యాంకులు ఎటిఎం ల వద్ద క్యూల్లో నిలబడే వారి దగ్గరకు రావాలి.. టీలు టిఫిన్లు ఇవ్వాలి.. హార్ట్ పేషంట్లకు మందులు.. పొగబాబులకు సిగరెట్లు.. మందుబాబులకు గ్లాసులు అందించాలి. వృద్దులను, వికలాంగులను, మహిళలను వీలయితే మైనార్టీలను కూడా క్యూ తో నిమిత్తం లేకుండా ముందుగా పంపించాలి. మోదీ గారూ ఇంకోమాట.. నాబోటి షుగర్ పేషంట్లు కూడా ఉంటారు. టైమ్ ప్రకారం తిండి ఏర్పాట్లు చేయండి సారూ.
No comments:
Post a Comment