Sunday, 11 December 2016

Benefits of Demonetisation

నోట్లరద్దు నిర్ణయం దేశానికి మేలు చేస్తుందా? చెడు చేస్తుందా? ఈనాడు ప్రతి భారతీయుడి మనసులో వున్న ప్రశ్న ఇది. మన మన వ్యక్తిగత అభిప్రాయాల్ని ప్రక్కన పెట్టి నిజాయితీగా విశ్లేషణ చేద్దాం.
రద్దు చేసిన మొత్తం 15.44 లక్షల కోట్ల రూపాయలు. (8.58 లక్షల కోట్లు 500 రూపాయలు 6.86 లక్షల కోట్లు 1000 రూపాయలు). పై మొత్తంలో కనీసం 3 లక్షల కోట్లు నల్లధనం బ్యాంకుల్లో డిపాజిట్ కాకుండా మురిగి పోతుందని ప్రభుత్వ అంచనా. వుదాహరణకి ఈ లక్ష్యం గురి తప్పి మొత్తం 15.44 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ అయిందే అనుకుందాం. మరి నోట్ల రద్దు ఫెయిల్ అయినట్లేనా? ఎంత మాత్రం కాదు. ఎందుకంటే ఈ క్రింది లాభాలు చూడండి:
1. నకిలీ కరెన్సీ చలామణీలో లేకుండా పోయింది. ఇది లాభం కాదా?
2. రోజూ కోట్ల రూపాయలలో నడిచే హవాలా బంద్ అయింది. ఇది లాభం కాదా? 
3. బంగారం అక్రమ రవాణాకి అడ్డుకట్ట పడింది. ఇది లాభం కాదా?
4. మాదకద్రవ్యాల దిగుమతి ఆగిపోయింది. ఇది లాభం కాదా?
5. టెర్రరిష్టుల కార్యకలాపాలు తగ్గిపోయాయి. ఇది లాభం కాదా?
6. నక్సలిజం నడుం విరిగింది. ఇది లాభం కాదా?
7. లక్షల కోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయి. దీనివల్ల అనేక వ్యాపారాలకి ఊతం వస్తుంది. ఇది లాభం కాదా?
8. రాజకీయాల్లో డబ్బు ప్రభావం తగ్గి నిజాయితీ కల నాయకత్వం వస్తుంది. ఇది లాభం కాదా?
9. బిల్లు లేకుండా జరిగే వ్యాపారానికి చెల్లు. పన్నుల వల్ల ప్రభుత్వ రాబడి పెరిగుతుంది. ఇది లాభం కాదా?
10. రియల్ ఎష్టేట్ ధరలు తగ్గి తక్కువ వడ్డీ రేటుతో గ్రుహరుణాలు సామాన్యుడికి అందుబాటులో వుంటాయి. ఇది లాభం కాదా?
11. లంచగొండితనం తగ్గిపోతుంది. ఇది లాభం కాదా?
12. పారదర్శక పరిపాలన కారణంగా విదెశీ పెట్టుబడులు పెరుగుతాయి. ఇది లాభం కాదా?
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లాభాలు. దేశ గతిని మార్చడం కోసం ఈమాత్రం త్యాగం మనం చేయలేమా. నల్లడబ్బుతో తెల్ల దొరలని మించి అక్రుత్యాలు చేస్తున్న మీడియా మాయ మాటలకి మోసపోకండి. 70 ఏళ్ళుగా దేశాన్ని నాశనం చేసి నా దేశాన్ని పాలకులు దోచుకుంటుంటే బ్లాక్ మెయిల్ చేస్తూ కోట్లు సంపాయిస్తూ నిద్దరపోయిన మీడియా ఈరోజు మోదీ గారు ఒక మంచి పని చేస్తే ప్రజల్లో అనవసర భయాందోలణలు స్రుష్టించడం ఎంతవరకు సమంజసం? మీరే ఆలోచించండి.

No comments:

Post a Comment