మజ్జిగ పులుసు.
తయారు చేయు విధానము .
ముందుగా అర లీటరు పెరుగు చక్కగా కవ్వంతో గిలకొట్టి గడ్డలు లేకుండా చూసుకుని తగినన్ని నీళ్ళు పోసుకుని వెడల్పాటి గిన్నెలో ప్రక్కన పెట్టి ఉంచుకోవాలి,
పుల్లగా ఇష్టమైన వాళ్ళు పుల్లని పెరుగు వాడుకోవచ్చు.
అందులో పావు టీ స్పూన్ పసుపు కలిపి గరిటతో బాగా కలపండి.
ముందుగా చిన్న గిన్నెలో రెండు స్పూన్లు పచ్చి శనగపప్పు , స్పూను చాయపెసరపప్పు , స్పూను బియ్యం ,పావు స్పూను లో సగం ఆవాలు. చిన్న అల్లంముక్క, చిన్న పచ్చి కొబ్బరిముక్కను వేసి పావు గ్లాసు నీళ్ళు పోసి ఒక గంట సేపు నానబెట్టి , ఆ తర్వాత ఆ నీళ్ళతో సహా మెత్తగా మిక్సీ వేసుకున్నాక ఆ ముద్దని మజ్జిగ లో కలపండి.
నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుని నిలువుగా చీలికలు గా తరిగి మజ్జిగ ముద్దలో వేయండి.
కరివేపాకు రెండు రెమ్మలు తీసుకుని ఆకులు దూసుకుని కడిగి మజ్జిగ లో వేయండి.
తగినంత ఉప్పు వేసి అన్నీ బాగా కలపండి.
ఇప్పుడు రెండు ఎండు మిరపకాయలు . కొద్దిగా మెంతులు. కొద్దిగా జీలకఱ్ర . ఆవాలు కొద్దిగా వేసి కొంచెం కరివేపాకు వేసి కొంచెం నూనె వేసి పోపు పెట్టి మజ్జిగ లో కలపండి.
పావు కిలో ఆనపకాయ ముక్క పై చెక్కు తీసుకుని ముక్కలుగా తరుగు కోవాలి.
రెండు క్యారెట్ లు పై చెక్కు తీసుకుని ముక్కలుగా తరుగు కోవాలి.
రెండు టమోటో లు ముక్కలుగా తరుగుకుని మజ్జిగ పులుసులో వేసుకోవాలి.
ఆనపకాయ ముక్కలు మరియు క్యారెట్ ముక్కలు తగినన్ని నీళ్ళు పోసుకుని విడిగా కుక్కర్ లో మెత్తగా ఉడికించి బాగా చల్లారాక మజ్జిగ లో కలపండి.
ఇప్పుడు ఈ మజ్జిగ పులుసును
stove మీద పెట్టి పొంగకుండా గరిటతో బాగా కలుపుతూ బాగా మరగ నివ్వండి.
క్రింద పొంగితే పై నురుగు లోని tase పోతుంది .
బాగా తెర్లాక క్రిందకు దింపి కొత్తిమీర కడిగి సన్నగా తుంపి కడిగి మజ్జిగ దింపిన పులుసు లో వేసి మూత పెట్టి ఉంచాలి .
వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఆ రుచి అద్భుతం .
ఒక్క విషయం అన్నీ వేసాక stove మీద ఎందుకు పెట్టమన్నానంటే ముందుగానే పెడితే మజ్జిగ పులుసు విరిగిపోతుంది.
లేదా మజ్జిగ పులుసు తెర్లాక క్రిందకు దింపి పోపు గరిటెలో పోపు వేసుకుని , పోపు చల్లారాక పులుసులో కలపాలి .
అప్పుడు మజ్జిగ పులుసు విరగదు.
No comments:
Post a Comment