ఆలూరుకృష్ణప్రసాదు .
పచ్చిపులుసు.
కావలసినవి .
చింతపండు --- 30 గ్రా. లేదా నిమ్మకాయంత.
పెద్ద ఉల్లిపాయలు -- రెండు
ఉప్పు తగినంత
బెల్లం -- 20 గ్రా ( తీపి ఇష్ట పడని వారు బెల్లం వేయకుండా చేసుకొనవచ్చును . )
తరిగిన కొత్తిమీర సరిపడా
పోపు .
ఎండుమిరపకాయలు - 5
జీలకర్ర -- అర స్పూను
నూనె -- రెండు స్పూన్లు
కరివేపాకు - రెండు రెబ్బలు
తయారీ విధానము .
చింతపండు లో నీళ్ళు పోసి పది నిముషములు నాన బెట్టు కోవాలి.
రసం తీసుకొని వడ కట్టుకొని ఒక అర లీటరు ప్రమాణం వచ్చేలా అందులో నీళ్ళు కలుపు కోవాలి .
ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
అందులో తగినంత ఉప్పు మరియు బెల్లం పొడి చేసి కలుపుకోవాలి .
ఉల్లిపాయలు సన్నని ముక్కలుగా తరిగి అందులో కలుపుకోవాలి.
సన్నగా తరిగిన కొత్తిమీర అందులో కలుపుకోవాలి.
స్టౌ మీద బాండి పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే ఎండుమిరపకాయలు , జీలకర్ర వేసి వేగాక కరివేపాకు కూడా వేసి వేయించు కోవాలి .
తర్వాత మిక్సీలో ఈ వేగిన పోపు వేసి మెత్తగా పొడి చేసుకొని ఆ పొడి పచ్చి పులుసు లో వేసి గరిటతో బాగా కలుపుకోవాలి .
ఉల్లిపాయలు వేయించనక్కర లేదు .
పులుసు వెచ్చబెట్టే అవసరం లేదు .
ఇంక వేరే పోపు వేయనక్కర లేదు.
పచ్చి మిర్చి వేయనక్కర లేదు .
ఇంగువ వేసే అవసరం లేదు.
ఎంతో రుచిగా ఉండే పచ్చి పులుసు రెడీ .
కాంబినేషన్ గా కందిపొడి గాని , కంది పచ్చడి కాని చాలా రుచిగా ఉంటుంది .
పచ్చి ఉల్లిపాయలు తినడం ఇష్టం లేని వారు , ఉల్లిపాయల ముక్కలు బాండీ లో రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి పులుసులో కలుపుకోండి.
మిగిలిన పద్థతి పై చెప్పిన విధముగానే.
No comments:
Post a Comment