ఆలూరుకృష్ణప్రసాదు .
సగ్గు బియ్యం పకోడీలు.
కావలసినవి .
సగ్గుబియ్యం -- ఒకటిన్నర కప్పు
ఉల్లిపాయలు -- రెండు
పచ్చిమిరపకాయలు -- 8
అల్లం -- చిన్న ముక్క
కొత్తిమీర -- అర కట్ట
కరివేపాకు -- రెండు రెమ్మలు
ఉప్పు -- తగినంత
నూనె -- పావు కిలో
మజ్జిగ --- రెండు గ్లాసులు .
బియ్యపు పిండి -- నాలుగు
స్పూన్లు .
మైదా పిండి --- మూడు స్పూన్లు
తయారీ విధానము .
ఈ సగ్గుబియ్యం పకోడీలు తయారు చేయుటకు మూడు గంటల ముందు మజ్జిగ లో సగ్గు బియ్యాన్ని నాన బెట్టాలి .
సగ్గు బియ్యము మజ్జిగలో బాగా నాని ఉబ్బుతాయి .
ఉల్లిపాయలు ముక్కలుగా తరగాలి .
మిక్సీలో అల్లం పచ్చి మిర్చి మెత్తగా వేసుకోవాలి .
ఇప్పుడు నానిన సగ్గు బియ్యము లో బియ్యపు పిండి , మైదా పిండి , ఉల్లిపాయల ముక్కలు , కరివేపాకు , పావు స్పూను జీలకర్ర తరిగిన కొత్తిమీర , అల్లం పచ్చి మిర్చి మిశ్రమం మరియు తగినంత ఉప్పువేసి నీళ్ళు అవసరమయితే పోసుకుని పకోడీల పిండిలా చేత్తో బాగా కలుపు కోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మొత్తం నూనె వేసి నూనె బాగా కాగగానే పకోడీల మాదిరిగా వేసి బంగారు రంగులో వేగాక వేరే ప్లేటు లోకి తీసుకోవాలి .
అంతే మధ్యాహ్నము అల్పాహారము సగ్గు బియ్యపు పకోడీలు సర్వింగ్ కు సిద్ధం.
ఇవి వేడి వేడిగా అప్పటికప్పుడు వేసుకుని తింటే అమోఘంగా ఉంటాయి .
No comments:
Post a Comment