Monday, 26 March 2018

చారు పొడి (Rasam Powder)

చారు పొడి (రసం పొడి) తయారీ విధానం (రెసిపీ).

👉కావలసిన పదార్థాలు:-

✔ధనియాలు పచ్చివి-1 కప్
✔వేయించిన కందిపప్పు-1/2 కప్
✔మిరియాలు-1 స్పూన్
✔ఎండుమిర్చి-2 చాలు
✔ఎండుకొబ్బరి/పచ్చి కొబ్బరి-2 స్పూన్లు
(నిలవ ఉండాలి అంటే కొబ్బరి లేకుండా చేసుకోవాలి)
👉ధనియాలు పచ్చివి వేయడం వల్ల మంచి రంగు, సువాసన ఉంటుంది..
👉వేయించి చల్లారాక కూడా ధనియాలు వేసుకోవచ్చు..కొంచెం రంగు మారుతుంది అంతే..
👉కందిపప్పు,మిరియాలు, ఎండుమిర్చి నూనె లేకుండా వేయించి చల్లార్చాలి..
👉నూనె వేసి వేపుకుంటే అప్పటికప్పుడు వాడుకోవచ్చు.. నిలవ ఉండదు..
👉అన్ని కలిపి మెత్తగా మిక్సీ పట్టి పొడి డబ్బాలో నిలవ ఉంచుకోవాలి..

Thursday, 15 March 2018

జీడిపప్పు బిళ్లలు (Kaju kathli)

మితృలందరికి శుభోదయం 🙏

మా ‘వంటింటి కబుర్లకి ‘ స్వాగతం:
మా వంటింట్లో తయారయిన పసందైన తీపి వంటకం ‘ జీడిపప్పు బిళ్ళలు’.   అదేనండి అందరూ ‘ కాజూ కత్లీ’ అంటూవుంటారు. అదేమరి . మన తెలుగులో చెప్పానంతే.

3 కప్పుల జీడిపప్పు పొడికి 2 కప్పుల పంచదార పడుతుంది. 3 పెద్ద చెంచాల నెయ్యి పడుతుంది. ముందుగా  2 baking sheets  రెడీగా  పెట్టుకోవాలి (విస్తరి సైజు)
ఒక nonstick pan లో 2 కప్పుల చక్కర వేసి just చక్కర తడిసేట్ట్లుగా నీరు పోసి పాకం పట్టాలి. One string పాకంరాగానే కొద్ది కొద్దిగా కాజూ పొడి వేస్తూ పాకం కలియబెట్టి అంతా పొడి వేసాక ఓ చంచా నెయ్యి,ఏలకులు పొడి వేసి కలపండి మరల ఓ చంచా నేయి వేసి కలియబెట్టడి. నెయ్యి అంచువీడి పాకంమొత్తదగ్గరపడి వుండలాగా  అవుతుంది. అప్పుడు మంట ఆపేసి ఆ పాకాన్ని పరిచిన baking sheet మీద పోయండి. దానిపై నెయ్యి ఓచంచావేసి అంతట రాసి పైన baking sheet కప్పి అప్పడాలకర్రతో  చదును చేయండి. తర్వాత పేపరు  తీసేసి పాకం sheet ని flat plate లో వుంచి ప్రిజ్ లో 15 నిమిషాలు వుంచితే గట్టి పడుతుంది. తరువాత బయటకు తీసి చాకుతో diamond shape లో ముక్కలు కోసి dry jar లో పెట్టుకోవాలి. మొత్తం 30 నిమిషాలలో తయారవుతుంది.

ఇంతకీ మా sweet ఎలా వుందంటారూ.......

Tuesday, 13 March 2018

ఇన్ట్సంట్ ఉప్మా (Instant Upma)

"బ్యాచ్ లర్స్" (కోసం) రెసిపి -
ఆమాట కొస్తే ఎవరికైనానండోయ్!!!

"ఇన్స్టంట్ ఉప్మా"......

ఇది ఇన్స్టంట్ గానే చేసుకోవచ్చు గానీ, మీకు తీరిక ఉన్నప్పుడు గానీ లేదా శలవు రోజున గానీ - ఓ ఆరగంట వెచ్చిస్తే - ఓ వారం, పది రోజులపాటు ఏమాత్రం టెన్షన్ ఉండదు.

సరే! ఇప్పుడు trail కోసం
ఓ అర కిలో
బొంబాయి రవ్వ తీసుకోండి.

స్టవ్ వెలిగించి - ఓ పెద్ద బాణలి/కడాయి వేడి చేయండి.
(మంట SIM లో ఉంటే మంచిది.)
మొత్తం రవ్వ బాణలిలో వేయండి + ఓ టీ స్పూన్ మంచి నేయిగానీ, నూనె గానీ add చేసి "దోరగా" వేయించండి. ఓ మూడు నాలుగు నిమిషాలంతే! (రవ్వ మాడకుండా జాగ్రత్త) - ఓ పళ్ళెంలో కి మార్చి పక్కన పెట్టేయండి.
అయిందా?
ఓ నాలుగైదు పచ్చి మిరపకాయలు, అల్లం ముక్కలు కట్ చేయండి. దానికి కొద్దిగా కరేపాకు జోడించండి.

ఇక
ఓ స్పూన్
ఆవాలు
మినప్పప్పు
శనగపప్పు
-------------
ఎండు మిర్చీ ముక్కలు
-----------------------
మీకిష్టమైతే
అర స్పూన్
జీలకర్ర
జీడిపప్పు ముక్కలు
రెడీ చేయండి.

Final గా

మళ్ళీ కడాయి/బాణలి వేడీ చేయండి.
రెండు, మూడు స్పూన్ల నూనె వేయండి.
కాగగానే
1. పోపు సామాను  followed by
2. మిర్చీ, అల్లం & కరేపాకు వేసి
చిపపటలాడగానే

పళ్ళెంలో తీసీ ఉంచిన (వేయించిన) రవ్వ add చేసి మూడు, నాలుగు నిమిషాలపాటు గరిటతో చక్కగా మిక్స్ చేయండి.
ఇక రుచికి తగ్గ సాల్ట్ వేసి స్టవ్ ఆపేసి చల్లారనివ్వండి.

చల్లారిన తరువాత ఈ మొత్తం రవ్వను ఓ కంటైనర్ లో మార్చి ఫ్రిజ్ లో ఉంచేయండి.
------------------------------------------
మీకు ఆకలైనప్పుడు/ కావలసినప్పుడు/ సడన్ గా ఒకళ్ళిద్దరు బంధుమితృలొచ్చినప్ఫుడు........

ఓ కడాయి/బాణలి లో "మూడు" గ్లాసుల నీళ్ళు సలసలా మరిగించండి.

ఓ గ్లాసు Instant రవ్వను వేసి, గరిటతో కలిపి, స్టవ్ Sim లో మార్చి , మూత పెట్టి - ఓ రెండు నిమిషాలాగండి!!!
అంతే! ఉప్మా రెడీ!!!!

Monday, 5 March 2018

సగ్గుబియ్యం పకోడీలు

ఆలూరుకృష్ణప్రసాదు .

సగ్గు బియ్యం పకోడీలు.

కావలసినవి .

సగ్గుబియ్యం -- ఒకటిన్నర కప్పు
ఉల్లిపాయలు -- రెండు
పచ్చిమిరపకాయలు -- 8
అల్లం -- చిన్న ముక్క
కొత్తిమీర -- అర కట్ట
కరివేపాకు -- రెండు రెమ్మలు
ఉప్పు -- తగినంత
నూనె -- పావు కిలో
మజ్జిగ --- రెండు గ్లాసులు .
బియ్యపు పిండి -- నాలుగు
స్పూన్లు .
మైదా పిండి --- మూడు స్పూన్లు

తయారీ విధానము .

ఈ సగ్గుబియ్యం పకోడీలు తయారు చేయుటకు మూడు గంటల ముందు మజ్జిగ లో సగ్గు బియ్యాన్ని నాన బెట్టాలి .

సగ్గు బియ్యము మజ్జిగలో బాగా నాని ఉబ్బుతాయి .

ఉల్లిపాయలు ముక్కలుగా తరగాలి .

మిక్సీలో అల్లం పచ్చి మిర్చి మెత్తగా వేసుకోవాలి .

ఇప్పుడు నానిన సగ్గు బియ్యము లో బియ్యపు పిండి , మైదా పిండి , ఉల్లిపాయల ముక్కలు , కరివేపాకు , పావు స్పూను జీలకర్ర తరిగిన కొత్తిమీర , అల్లం పచ్చి మిర్చి మిశ్రమం మరియు తగినంత ఉప్పువేసి నీళ్ళు అవసరమయితే పోసుకుని పకోడీల పిండిలా చేత్తో బాగా కలుపు కోవాలి .

ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మొత్తం నూనె వేసి నూనె బాగా కాగగానే పకోడీల మాదిరిగా వేసి బంగారు రంగులో వేగాక వేరే ప్లేటు లోకి తీసుకోవాలి .

అంతే మధ్యాహ్నము అల్పాహారము సగ్గు బియ్యపు పకోడీలు సర్వింగ్ కు సిద్ధం.

ఇవి వేడి వేడిగా అప్పటికప్పుడు వేసుకుని తింటే అమోఘంగా ఉంటాయి .