జగన్ ఫర్ ఆంధ్ర ప్రదేశ్ శశికళ ఫర్ తమిళనాడు. తండ్రిని (ముఖ్యమంత్రి వై ఎస్) అడ్డుపెట్టుకుని డొల్ల కంపెనీలు పెట్టి అవినీతికి పాల్పడ్డాడు. 'అమ్మ'ని (ముఖ్యమంత్రి జయ) అడ్డుపెట్టుకుని డొల్ల కంపెనీలు పెట్టి శశి అవినీతికి పాల్పడింది. జగన్ శశి ఇద్దరూ జైలు కెళ్లి వచ్చినవారే. ఇద్దరూ ఇంట్లో శవం ఉన్నప్పుడే ముఖ్యమంత్రి పీఠం పై కన్నేసి ఎమ్మెల్యేల లెక్కలు తీస్తూ కలలు కన్నారు. ఇద్దరికీ వారి వారి రాష్ట్రాల్లో ప్రయివేటు సైన్యాలు (సెక్యూరిటీ) ఉన్నాయి. ఇద్దరూ ఫెరా ఉల్లంఘనులే. కోర్టులు మంచిపని చేశాయి. ప్రజలూ వారిని దూరంగా ఉంచారు.. ఉంచాలి కూడా.
No comments:
Post a Comment