కేసీఆర్ ఫర్ తెలంగాణ, ట్రంప్ ఫర్ అమెరికా. ఇద్దరూ స్థానికులకు ఉద్యోగాలు రావడం లేదని పొరుగువారు ఉద్యోగాలు ఎగరేసుకు పోతున్నారని ప్రచారం చేసి బొటాబొటి మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్నవారే. ఇద్దరూ పత్రికలను చానెళ్లను ఆడిపోసుకున్నవారే. కెసిఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లో అయన దిష్ఠిబొమ్మలను రైతులు తగలబెట్టారు. నిరసన తెలిపారు. ట్రంప్ పదవి చేపట్టక ముందు నుంచీ ఆ దేశంలో నిరసనలు జరిగాయి. కెసిఆర్ పాలనలో రెండున్నరేళ్లుగా అన్ని వర్గాల ప్రజలు గుడిలో అర్చకుడి నుంచి రోడ్లు ఊడ్చే కార్మికుడి వరకు సమ్మెలు చేసారు. ఓయూ లో విద్యార్థుల ఆందోళనలు నేటికీ జరుగుతూనే ఉన్నాయి. ట్రంప్ పదవి చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు నిరసనలు ఆగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీ లు ఉన్న కులాలను జాబితానుంచి కెసిఆర్ తొలగించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులను రద్దుచేశారు. ఫీజు రీ ఇంబర్స్ మెంట్ నిధులను నిలిపివేశారు. జర్నలిస్టులకు మెడిక్లైయిం రద్దుచేశారు. ఒబామా హెల్త్ కేర్ ను ట్రంప్ రద్దు చేశారు. ఇద్దరి నిర్ణయాలను కోర్టులు తప్పుపట్టాయి. దేశంలో ఏ ముఖ్య మంత్రి కి లేనన్ని కేసుల్లో కెసిఆర్ ను హై కోర్టు తప్పుపట్టి మొట్టికాయలు వేసింది.. వేస్తోన్ది. ట్రంప్ కి కూడా కోర్టు మొట్టికాయలు వేస్తోంది.
No comments:
Post a Comment