Sunday 12 December 2010
Food Scam
ఇప్పుడు భారత్ లో స్కాముల పండగ జరుగుతోంది. ఒక దానిని మించిన కుంభకోణం మరొకటిగా బయట పడుతోంది. తాజాగా వెల్లడైన ఆహార కుంభకోణం గురించి దర్యాప్తు జరపాలంటూ హైకోర్టు ఆదేశించడంతో తీర్పు కాపీలు చూసిన ఎన్ఫోర్స్మెంట్ దిరేక్టరేట్కి(ఇడి కి) కళ్ళు తిరిగాయి. ఉత్తర ప్రదేశ్ లోని 41 జిల్లాల్లో ఏర్పడి ప్రక్క రాష్ట్రాలతో పాటు పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లా దేశ్ లకు విస్తరించిన ఈ భారీ కుంభకోణాన్ని ఎలా దర్యాప్తు జరపాలో తెలియక ఇడి అధికారులు జుట్టు పీక్కుంటున్నారు. ఇంతకీ ఈ కుంభకోణం విలువ ఎంతో తెలిస్తే మీరు కూడా ఖంగు తినక తప్పదు. అక్షరాలా రెండు లక్షల కోట్ల రూపాయలు. ఈ స్కాములో ఇప్పటికే రిజిస్టర్ అయిన కేసుల సంఖ్యా వందల్లోకి చేరింది. ఈ కేసుల్లో ప్రమేయం వున్న నిందితుల సంఖ్య అనేక వందల్లో ఉంటుందని ఇడి అధికారులు భావిస్తున్నారు. పేదలకు పంచాల్సిన ఆహార ధాన్యాలను అక్రమంగా తరలించడానికి సహకరించిన అధికారులను హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment