Monday, 13 February 2017

Mr President TRUM n Telangana CM Mr. KCR

కేసీఆర్ ఫర్ తెలంగాణ, ట్రంప్ ఫర్ అమెరికా. ఇద్దరూ స్థానికులకు ఉద్యోగాలు రావడం లేదని పొరుగువారు ఉద్యోగాలు ఎగరేసుకు పోతున్నారని ప్రచారం చేసి బొటాబొటి మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్నవారే. ఇద్దరూ పత్రికలను చానెళ్లను ఆడిపోసుకున్నవారే. కెసిఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లో అయన దిష్ఠిబొమ్మలను రైతులు తగలబెట్టారు. నిరసన తెలిపారు. ట్రంప్ పదవి చేపట్టక ముందు నుంచీ ఆ దేశంలో నిరసనలు జరిగాయి. కెసిఆర్ పాలనలో రెండున్నరేళ్లుగా అన్ని వర్గాల ప్రజలు గుడిలో అర్చకుడి నుంచి రోడ్లు ఊడ్చే కార్మికుడి వరకు సమ్మెలు చేసారు.  ఓయూ లో విద్యార్థుల ఆందోళనలు నేటికీ జరుగుతూనే ఉన్నాయి. ట్రంప్ పదవి చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు నిరసనలు ఆగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీ లు ఉన్న కులాలను  జాబితానుంచి కెసిఆర్  తొలగించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులను రద్దుచేశారు. ఫీజు రీ ఇంబర్స్ మెంట్ నిధులను నిలిపివేశారు. జర్నలిస్టులకు మెడిక్లైయిం రద్దుచేశారు. ఒబామా హెల్త్ కేర్ ను ట్రంప్ రద్దు చేశారు. ఇద్దరి నిర్ణయాలను కోర్టులు తప్పుపట్టాయి. దేశంలో ఏ ముఖ్య మంత్రి కి లేనన్ని కేసుల్లో కెసిఆర్ ను హై కోర్టు తప్పుపట్టి మొట్టికాయలు వేసింది.. వేస్తోన్ది. ట్రంప్ కి కూడా కోర్టు మొట్టికాయలు వేస్తోంది.

Sasilala of Tamilnadu

జగన్ ఫర్ ఆంధ్ర ప్రదేశ్ శశికళ ఫర్ తమిళనాడు.  తండ్రిని (ముఖ్యమంత్రి వై ఎస్) అడ్డుపెట్టుకుని డొల్ల కంపెనీలు పెట్టి అవినీతికి పాల్పడ్డాడు. 'అమ్మ'ని (ముఖ్యమంత్రి జయ)  అడ్డుపెట్టుకుని డొల్ల కంపెనీలు పెట్టి శశి అవినీతికి పాల్పడింది. జగన్ శశి ఇద్దరూ జైలు కెళ్లి వచ్చినవారే. ఇద్దరూ ఇంట్లో శవం ఉన్నప్పుడే ముఖ్యమంత్రి పీఠం పై కన్నేసి ఎమ్మెల్యేల లెక్కలు తీస్తూ కలలు కన్నారు. ఇద్దరికీ వారి వారి రాష్ట్రాల్లో ప్రయివేటు సైన్యాలు (సెక్యూరిటీ) ఉన్నాయి. ఇద్దరూ ఫెరా ఉల్లంఘనులే. కోర్టులు మంచిపని చేశాయి. ప్రజలూ వారిని దూరంగా ఉంచారు.. ఉంచాలి కూడా.

Thursday, 2 February 2017

Mr President Trump n Mr CM KCR

ఒక మిత్రుడు కొన్ని రోజులు క్రితం: మీ ఆంధ్ర వాళ్ళు తెలంగాణాలో ఉద్యోగాలని దోచేశారు.
అదే మిత్రుడు ఈ రోజు: ఏంటి రా మామ ...ఈ ట్రంప్ సాలె గాడు, H1-B వాళ్ళని పంపేస్తాడ.? అంతా వాడి ఇష్టం అయిపోయింది.
ఒకే దేశం, ఒకే రాష్త్రం లో వేరే ప్రాంతం నుండి వచ్చి వాడి రాజధాని లో వాడు లీగల్ గా ఉద్యోగం చేసుకుంటుంటే మా ఉద్యోగాలు దోచేసుకున్నారు ఆని ఆందోళనలు చేసారు ....
మరి మరో దేశంలో వాడి జాబ్స్ మనం చేస్తుంటే (వాళ్ళ తర్కం ప్రకారం దోచేసుకుంటే) వాడు ఏమి చెయ్యకూడద? అవే రూల్స్ ఇక్కడ అప్లై కావా?
"సన్ అఫ్ సత్యమూర్తి" సినిమాలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్టు ....
మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి ....
కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు కదా!