Monday, 16 January 2017

Vijayawada i.e. Bezwada

భోగి పండగ రోజు బెజవాడ స్పెషల్.
*ఎంత మారిపోయింది*
*ఒకప్పటి బెజవాడలా లేదిది.*
*ఊరు మారిపోతుంది.*
*దాని కన్నా వేగంగా ఊర్లో జనం మారిపోతున్నారు.*
*అన్నీ మార్పులే.*
*డా.బసప్పున్నమ్మ గారి ఆసుపత్రి ముందు ఉండే వాణీ నికేతన్ ఎప్పుడో కొట్టేసారు.*
*పక్కనే ఉండే సోడా కొట్టు ఇపుడెకడుందో తెలీట్లా.*
*వరసెట్టి షాపులు కట్టేసేరక్కడ*
*గోడలమీద అంటించే సినిమా పోస్టర్లు తగ్గిపోయి,*
*ఇపుడు రాజకీయ పోస్టర్లొచ్చీసినియ్.*
*మా నాయకుడు*
*మా నేత అంటూ*
*ఒకటే గోల.*
*బందరులాకుల దగ్గరుండే కలప దుంగల కొట్టు తీసేసి అపార్టుమెంటు కట్టేసేరు.*
*పటమటలంక school బిల్డింగు పాతదైపోయింది,*
*రూపే మారిపోయింది.*
*దాంతో దానెనక ఉండే గ్రౌండులో కట్టిన స్కూలు “ఒక స్కూలు” లానే ఉంది తప్ప ఇదివరకట్లా కళ మాత్రం లేదు.*
*ఊరెళ్తే యేరా అని పిలడానికి మనతో చదివినోడెవడూ ఊర్లో లేడు.*
*ఉన్న ఆ కొంత మంది మాత్రం ఫోనుచేస్తేనే.. హలో అంటారు.*
*వాట్సప్ లో చూస్తుంటారు*
*అంతెందుకు సినిమాలో సమోసా కొనే వాళ్ళ కన్నా,*
*కార్ను కోకుని మోజుతో కొనేవాళ్ళే ఎక్కువ.*
*కొంతలో కొంత ఆనందం ఏంటంటే ఇంకా ప్రతివాడు చూసేది “సినిమానే..”*
*బెజవాడ జనం కూడా అలానే ఎళ్తన్నారు సినిమాకి.*
*ఆనాటి నుంచి..*
*ఈనాటి వరకు*
*ఎన్టీఆరైనా~ఏన్ఆరైనా*
*కృష్ణైనా~శోబనైనా*
*చిరంజీవైనా~మురళీమోహనైనా*
*సినిమా పడాల్సిందే..*
*చూసి తీరాల్సిందే..*
*ఇలా అన్ని రకాలు నడుస్తాయి.. ఇప్పటికీ..*
*కాకపోతే ఇంతకు ముందులా రాత్రయితే “కిరసనాయిలు దీపం బుడ్డితో" సైకిల్లు వేసుకెళ్ళక్కరలేదు.*

*సర్వీసు ఆటోలొచ్చేసినియ్యి.*
*బెజవాడ రిక్షాల విలువలు తీసేశాయి.*
*రోడ్ల నిండా జనం,*
*తిరుగుబోతులు ఎక్కువైపోయారు*
*ట్రాఫిక్ పెరిగిపోయింది.*
*అప్పట్లో..*
*సాయంత్రమయితే బీసెంటురోడ్డు ~రవీంద్రకూల్ డ్రింక్స్ సోడాలు*
*తిరిగిరాని రోజులైపోయాయి*
*సత్యన్నారాయణపురం రూపమే మారిపోయింది*
*రైల్వే స్టేషన్ కాస్తా..*
*బైపాసు రోడ్ అయిపోయింది,*
*అయినా గానీ*
*అప్పుడు కార్లు పదుల సంఖ్యలో*
*స్కూటర్లు వందల సంఖ్యలో ఉండేవి*
*ఇప్పుడు*
*మనుషులెంతమందో మోటారు సైకిళ్ళన్నున్నాయి*
*కుటుంబానికి రెండు కార్లున్నాయి*
*సౌఖర్యాలన్నీ అవసారలయ్యాయి*
*మళ్ళీ మనం*
*బెజవాడ కొస్తే..*
*మన పంటకాలవని*
*100అడుగుల రోడ్డు చేశారు*
*సాయంత్రమయిందంటే*
*అక్కడే..*
*చైనీసు నూడిల్స్,*
*రాజస్థానీ ఛాటు మసాలా అమ్మకాలు.*
*మధ్యలో మేమూ ఉన్నాం అని చెప్పుకోడం కోసం మిర్చీ బజ్జీ బళ్ళు.*
*లబ్బీపేట పొలాల్నీ ఆఫీసులు~షాపులు చేసేశారు.*
*లక్ష్మీ టాకీసు*
*జైహింద్ టాకీసు*
*రామాటాకీసు*
*విజయ టాకీసు* *సినిమా హాళ్ళయితే పదిహేనేళ్ళు పైనే అయిందట రూపుమారిపోయి.*
*కావాలంటే*
*కొత్త మల్టీ ప్లెక్సుకి ఎళ్ళిపోతున్నారు*
*బార్లు పెరిగిపోయాయి,*
*సోడా కొట్లు పోయి..*
*“సోడా మెషీన్లు” వచ్చేసేయి*
*అలా మెషినెట్టుకోలేనోళ్ళు మాత్రం*
*బండి మీద నిమ్మ సోడా చేసుకుని అమ్ముకుంటున్నారు*
*ఇపుడెంత ఎతికినా పుల్లైసు రావట్లేదు*
*కావాలంటే 'క్వాలిటీ' ఐసుక్రీము దొరుకుతుంది* 
*సత్యంకొట్టుకెళ్ళి ఒక “మట్టి పలక” ఇవ్వండి అందామంటే..*
*అయిబాబోయి*
*చాలా రోజుల తర్వాత సత్యంకొట్టు మాటిన్నాను ఎప్పుడో ఎత్తేశాడండి చెప్పాడాయన*
*కవితా స్కూలు ముందు జాంకాయలమ్మేటోళ్ళు రాట్లేదు.*
*లేస్ లేదా కురుకురే తింటన్నారు పిల్లలు.*

*ఇదేంట్రా ఊరిలాగయిపోయింది అంటే..*
*ఊరు మాత్రం ఎదగొద్దా???*
*మీరెళ్ళి హైదరాబాదులో ఉద్యోగాలు చేత్తే చాలా అని అడిగాడొకడు.*
*ఎదగాలి..*
*ఎందుకెదగొద్దు.*
*కానీ ఎదగడం అంటే*
*బిల్డింగులు,*
*మల్టీప్లెక్సులు,*
*స్వీటు కార్నులు*
*మాత్రమే కాదు.*
*మీరాటినే పట్టుకుని గొప్పనేసుకుంటే ఎలాగ.*
*మీకు బెజవాడంటే ఉంటున్న ఊరు మాత్రమే.*
*కానీ మాలా వేరే ఊరెళ్ళి బతికేవోళ్ళకి మాత్రం బెజవాడంటే..*
*బోలెడన్ని జ్ఞాపకాలు,*
*అనుభవాలు,*
*ఇష్టాలు,*
*చదువుకున్న రోజులు,* *సైకిలేసుకు తిరిగిన కృష్ణలంక రోడ్లు*
*కబుర్లతో గడిపిన లబ్బీపేట రోడ్లు,*
*టిఫిన్లు పెట్టిన విజయ సూపర్ బజజార్లు*
*అమ్మలా అనిపించే..*
*ఓ అందమైన చోటు..*

*అమ్మకి వయసైపోతున్న కొద్దీ*
*మనకెలా బాధనిపిస్తుందో..*
*ఊరులో జ్ఞాపకాలు చెరిపేత్తున్నారు అన్నపుడు మాకూ అంతే బాధేస్తుంది..*
*ఎంత మారిపోయింది*
*ఒకప్పటి బెజవాడలా లేదిది.*

No comments:

Post a Comment