*పెళ్లికి జాతకాలు తప్పనిసరిగా చూడాలా?*
కల్యాణ గ్రహం
సీజన్అందం.... ఆదాయం...
వంశం... వారసత్వం....
గుణం... గోత్రం...
వీటన్నింటికీ లెక్కలుంటాయి.
ఆ లెక్కలు సరిపోవు.
గ్రహం, రాశి, నక్షత్రం, ముహూర్తం....
ఈ లెక్కలు కూడా తేలాలట.
అవునంటారా? కాదంటారా?
మనకు ఫ్యామిలీ డాక్టరు ఎంత అవసరమో, ఫ్యామిలీ జ్యోతిష్యులు కూడా అంతే అవసరం. వారికి అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి వారిచ్చే సూచ న కూడా ఉపయుక్తంగా ఉంటుంది. జ్యోతిష్యం వేదాలలో భాగం. అది వేదాలకు కన్నువంటిది అన్నారు పెద్దలు.
వివాహానికి వధూవరుల జాతకాలలో పొంతన అవసరమా? పెళ్లికి జాతకాలు తప్పనిసరిగా చూడాలా? ప్రపంచంలోని మిగతా దేశాలలో, మిగతా మతాల వారు జాతకాలు పట్టించుకోవడం లేదు కదా. అక్కడ పెళ్లిళ్లు జరుగుతున్నాయి కదా. మరి హిందూ ధర్మంలోనే ఎందుకు? ఏయే జాతకాల అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చు. ఎవరెవరికి వద్దని శాస్త్రం చెబుతోంది?
ఇవి తరచూ తలెత్తే ప్రశ్నలు. కాని అందమైన జీవితం కావాలంటే జాతకాలు చూసుకోవాలి అంటున్నారు జ్యోతిష్యులు. వివాహానికి వధూవరుల జీవితాలలో పొంతన కుదరాలంటున్నారు. జాతకాలు కలిస్తే వారు జీవితంలో కూడా కలసిమెలసి ఉంటారు అంటున్నారు. వివాహాది శుభకార్యాలకు పునాది అయిన శ్రావణ మాసం మొదలు కానున్న సందర్భంగా ఈ విషయమై ఇటీవల హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున సెమినార్ కూడా నిర్వహించారు జ్యోతిష్య పండితులు. ఇంటా బయటా కొన్ని అభిప్రాయాలు...
కనీసం అరవై శాతం కలవాలి....
భూమి మీద ఉన్న మనుషులపై ఖగోళంలో ఉన్న గ్రహాల ప్రభావం ఉంటుందని శాస్త్రాలు, సైన్సు అంగీకరించాయి. దీనిని కాదనడానికి లేదు. ఉదాహరణకు చూడండి. అన్ని దేశాలలోను వివాహాలు జరుగుతున్నాయి. కాని అక్కడ విడాకులు, కలహాలు, చిన్న వయస్సులో మరణాలు ఎక్కువగా గమనిస్తాం. కారణం ఈ జాతక దోషాలే. వివాహానికి ముఖ్యమైన పొంతనలలో కనీసం 60 శాతం కలవాలి. జన్మించిన నక్షత్రాల ప్రభావం, రాసులు, నక్షత్రాల గణాలు, వాటి నాడులు, వాటి మైత్రి... ఇలా అన్ని విషయాలు చూసి వివాహానికి అనుకూలమా? కాదా? అని వివాహం నిర్ణయించాలి. విదేశాలలో, మన దేశంలో జాతకాలు చూడకుండా చేసుకున్న వివాహాలు జయప్రదంగా ఉన్నాయంటే అది పూర్వజన్మ సుకృతం. లేక కాకతాళీయంగా జాతకాలు కలిసే ఉంటాయి. నా అనుభవంలో ఇలాంటివి చాలా చూశాను. - గుమ్మా రామలింగస్వామి, జ్యోతిష పండితులు
జాగ్రత్తలు తీసుకోవడమే జ్యోతిషం
నవగ్రహాల ప్రభావం మన జీవితంలో 12 కోణాలుగా ఉంటుందని, జన్మించిన సమయంలో ఆ గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి, మన జీవితంలో మంచిచెడులు జరుగుతాయని జ్యోతిష శాస్త్రం సాధికారికంగా చెబుతోంది. కాబట్టి ఆ శాస్త్ర నియమాలను జీవితంలో ప్రధాన ఘట్టమైన వివాహానికి కూడా తప్పనిసరిగా పరిశీలించాలి. భారత ఉపఖండంలో పుట్టి పెరిగేవారి కోసం ఇక్కడ భూమి నుంచి ఆయా గ్రహాలు ఉన్న దూరాలను, డిగ్రీలను బట్టి, ఫలితాలను నిర్ణయించే శాస్త్రం ఏర్పడింది. మనలాగే గ్రీకు దేశంలో జ్యోతిషం ఉంది. మన రాసులను వారు వేరు వేరు పేర్లతో పిలుస్తారు. జాతకాలు చూసేటప్పుడు నక్షత్రాలు ప్రధానం. ఏ నక్షత్రంలో, ఏ పాదంలో పుట్టారనేదాన్ని బట్టి చూస్తారు. అంటే అవతల వ్యక్తి గురించి ప్రాథమిక సమాచారం సేకరించడమన్నమాట. ఏ లగ్నంలో పుట్టారో, ఆ గ్రహం నుంచి లెక్కించాలి. జాతకాలు చూడకుండా వివాహం చేసినా కలసి జీవించవచ్చు. కోడి కూసినా కూయకపోయినా తెల్లవారుతుంది. అయితే కూసినప్పుడు లేవాలి అనుకుంటే, సరైన సమయంలో మేల్కొంటాం. లేదంటే ముందుగా కాని, ఆలస్యంగా కాని మేల్కొంటాం. జాతకం కూడా అంతే. జాగ్రత్తలు తీసుకోవడమే జ్యోతిషం. - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, పండితులు
శని ఉప్పు.... కుజుడు నిప్పు...
జ్యోతిష్యం హిందూధర్మం మాత్రానికే అని ఎవరన్నారు? అది ప్రపంచమంతా ఉంది. అరేబియన్లు, గ్రీకులు, చైనీయులు అందరూ నమ్ముతారు. అక్కడ కూడా జాతకాల మీద పరిశోధనలు విస్తృతంగా జరిగాయి. యజమాని ఒక ఉద్యోగిని తీసుకునేటప్పుడు ఆ ఉద్యోగి తనకు అనుకూలుడో కాదో అని తెలుసుకోవడానికి కూడా జాతకం చూస్తారు. ఒక స్నేహితుడు మనకు తగినవాడా కాదా, ఒక ఊరు మనం నివసించడానికి యోగ్యమా కాదా అని చూస్తారు. కొడుకు జన్మించినప్పుడు వాడు శత్రువు అవుతాడా, మిత్రుడిలా ఉంటాడా అనే విషయం కూడా జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది. నక్షత్రాలకు రాసులకు స్వభావం ఉంది. ఏ నక్షత్రానికి, ఏ నక్షత్రం సరిపడుతుందో చూసుకోవాలి. ఏ రాశిలో పుట్టినవారికి ఏ రాశివారితో సరిపోలుతుందో చూసుకోవాలి. శని ఉప్పులాంటివాడు. కుజుడు నిప్పు లాంటివాడు. ఉప్పు నిప్పు కలిస్తే మంట పెరుగుతుంది. గురువు చంద్రుడు ఒకచోట చేరితే సంతోషం, ఆనందం ఉంటాయి. కొన్ని నక్షత్రాలకు కొన్ని నక్షత్రాలే కలుస్తాయి. అగ్నితత్త్వం వారికి జల తత్త్వం వారితో పొంతన కుదరదు. ఒకరు ఊసురోమంటూ ఉంటే ఒకరు ఎగిరెగిరిపడుతుంటారు. మ్యాచింగ్‌లో ఇవన్నీ చూస్తాం. కనుక ఒక జంటకు వివాహం చేసేటప్పుడు ఆ ఇద్దరూ కలిసి జీవించగలిగే లక్షణాలు ఎంతవరకు ఉన్నాయో చూడాలి. - భీమా సాంబశివరావు, జ్యోతిష పండితులు
కుజదోషం వల్ల ఇబ్బంది ఉంటుంది....
మనకు ఫ్యామిలీ డాక్టరు ఎంత అవసరమో, ఫ్యామిలీ జ్యోతిష్యులు కూడా అంతే అవసరం. వారికి అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి వారిచ్చే సూచ న కూడా ఉపయుక్తంగా ఉంటుంది. జ్యోతిష్యం వేదాలలో భాగం. అది వేదాలకు కన్నువంటిది అన్నారు పెద్దలు. జ్యోతిష్యం అంటే గమనంలో ఉన్న ముళ్లను ఏరుకుంటూ ముందుకు వెళ్లడానికి ఉపయోగపడే దిక్సూచి. గతంలో పన్నెండేళ్లు నిండకుండానే వివాహాలు చేసేవారు. అందువల్ల నక్షత్రాలు చూసేవారు. మఖ మామగారికి, జ్యేష్ఠ బావగారికి, ఆశ్లేష అత్తగారికి గండం అనేవారు. ఇప్పుడు పిల్లలకు 25 సంవత్సరాలు నిండిన తరవాత చేస్తున్నారు. అందువల్ల ఈ నక్షత్రాల ప్రస్తావన అనవసరం. నక్షత్రాలకు పరిష్కారం ఉంది, గ్రహాలకు లేదు. కుజుడు అగ్ని తత్త్వ కారకుడు. వివాహాన్ని పాడు చేయడానికి చూస్తాడు. దోషపరిహారం ఎంతవరకు ఉన్నదో చూడాలి. కుజదోషం వల్ల వియోగం, విరహం, కలహం కలుగుతాయి. కొందరు సమాజం కోసం కలిసే ఉంటారు. కాని వారి వైవాహిక జీవితం సరిగా ఉండదు. కొందరిలో మాత్రం సంతానం కలిగితే అన్నీ సర్దుకుపోతాయి. కుటుంబం బలపడుతుంది. ఎవరి జాతకం వారు చూసుకోకుండా ఇంటికి రాబోయే అమ్మాయి జాతకం చూడటం సరికాదు. నక్షత్రాలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చి, గ్రహాల అనుకూలత చక్కగా చూసుకోవాలి - విశ్వనాథ కనకమహాలక్ష్మి, జ్యోతిష, వాస్తు నిపుణులు
జీవి పుట్టుక ఏది?
జాతకాలన్నీ పుట్టిన తేదీ, సమయం ఆధారంగా రూపొందుతాయి. అయితే జీవి ఆవిర్భావం ఎప్పుడు? తల్లి గర్భంలో అండం- శుక్రకణాలు ఫలదీకరణ చెందినప్పుడే మనిషి జీవం మొదలవుతుంది. అదే అసలైన పుట్టుక. తల్లి గర్భం నుంచి బయటపడడం అనేది కొనసాగింపు మాత్రమే. జీవం ఎప్పుడు మొదలైందనేది రెండు-మూడు రోజుల తేడాలో ఒక అంచనాకు రావచ్చు. కానీ కచ్చితమైన సమయాన్ని చెప్పలేం. అలాంటప్పుడు జాతకాలు రాయడానికి ఏది ఆధారం? ఇప్పుడు ఎక్కువ డెలివరీలు సిజేరియన్‌లే. అది కూడా ముహూర్తం పెట్టుకుని మరీ సిజేరియన్‌లు చేయించుకుంటున్నారు. అలా పుట్టిన బిడ్డ జాతకం కచ్చితంగా బాగుండి తీరాలి కదా! అలాగే జరుగుతోందా? నవగ్రహాల ఆధారంగా జాతకాన్ని నిర్ణయిస్తారు. మరి సూర్యుడు గ్రహం కాదు, చంద్రుడు ఉపగ్రహం, రాహుకేతువులు నీడలు. నాలుగు పోగా మిగిలినవి ఎన్ని? మరి నవగ్రహాలనే మాటకు తావెక్కడ? అయితే ఎవరి విశ్వాసాలు వారివి. ఎవరి మనోభావాలనూ గాయ పరచకూడదు. మన రాజ్యాంగం కూడా నమ్మకాలను ఆమోదిస్తోంది. నేను చెప్పే మరో విషయం ఏమిటంటే... పెళ్లి చేసుకునే అబ్బాయి తన జాతకం మంచిదనే నమ్మకంతో ఉండడం తప్పుకాదు. అలాగే తనకు ఇష్టమైన అమ్మాయిని జాతకం కలవలేదని నిరాకరించవద్దు. జాతకం కలిసిందని ఇష్టం లేని అమ్మాయిని చేసుకోవద్దు. అన్ని రోజులు దేవుడు సృష్టించినవే అయినప్పుడు కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి ఎందుకుంటాయి? అన్నీ మంచిరోజులే. - డాక్టర్ బ్రహ్మారెడ్డి, జనవిజ్ఞానవేదిక స్థాపకులు
పంచభూతాలతో కనెక్షన్ జాతకమనేది ఫిజికల్ ఫిట్‌నెస్‌ని చూపుతుంది. ఇద్దరిలో ఎలాంటి పాజిటివ్, నెగిటివ్‌లు ఉన్నాయో చెబుతుంది. సంతానం కూడా తెలుస్తుంది. లోపాలు పసిగట్టవచ్చు. ఇగో ప్రాబ్లమ్స్ కూడా చూడవచ్చు. జాతకమంటే ప్రకృతి. ఒకరికి నీరు పడుతుంది, ఒకరికి ఎండ పడుతుంది. నీళ్లు జల్లితే అగ్ని ఆరుతుంది. అవే నీళ్లను అగ్ని మీద పెడితే సలసల మరిగి ఆవిరవుతాయి. పంచభూతాలకి, శరీర నిర్మాణానికి ఉన్న కనెక్షన్ జ్యోతిష్యం. హెచ్చుతగ్గులను ఎలా సవరించుకుని, పాటించాలో చెబుతుంది. చైనీయులు న్యూమరాలజీ నమ్ముతారు. అమెరికన్లు పుట్టినతేదీని ఆధారంగా చేసుకుని వివాహాలు నిశ్చయిస్తారు. వారు మనసుకి ప్రాధాన్యత ఇవ్వరు. శరీరాకృతి, ఆకర్షణలకు ప్రాధాన్యం ఇస్తారు. మనదేశంలో అలా కాదు. మంచి కుటుంబమా కాదా అని చూస్తారు. ఇంటిపేరుని బట్టి సంబంధాలు నిశ్చయించుకుంటారు. కనుక శాస్త్రాన్ని పాటించడంలో తప్పులేదు.

No comments:
Post a Comment