Tuesday, 22 February 2011

Hats-off Chandra Babu

ఈ రోజు అసెంబ్లీలో మాజీ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీకి తెలుగు ప్రజల సంక్షేమమే ముఖ్యమని స్పష్టం చేశారు.  అదే సందర్భంలో ఆ పార్టి ఎమ్మెల్యేలు తెలంగాణా, సమైక్యాంధ్ర అంటూ పార్టీని గాలికి వదిలేశారని కూడా బాబు వ్యాఖ్యానించారు.  కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు, తెలంగాణా గురించి  వాదించే కే కే, కా కా వంటి వారు యెంత మంది వున్నా  దివంగత ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి సమర్ధుడైన నాయకుడిగా వుండి అటు పార్టీని ఇటు రాష్ట్రాన్ని కూడా చక్కగా నడిపించారు.  అప్పట్లో ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి పై ఢిల్లీకి ఎన్ని ఆరోపణలు చేసినా అయన చలించ లేదు.  బాబు విషయంలో అటువంటి పరిస్తితి లేదు, రాదు కూడా.  మరి పార్టీని నడిపించడంలో, ప్రజలకు దిశా నిర్దేశం చేయడంలో బాబు ఎందుకు విఫలం అవుతున్నారు?  కేవలం పత్రికల్లో లేదా టీవీల్లో కనిపించక పొతే ఎలాగా అనుకుంటూ కెసిఆర్ పార్టీతో, జగన్ తో పోటీ పడటంతో బాబు, అయన పార్టీ సహచరులు తేలిక అయ్యారు.  ఆ యిద్దరి  విషయంలో బాబు, తెదేపాలు పట్టించుకోనట్లుగా వుంటేనే ప్రయోజనం వుంటుంది.  కెసిఆర్, జగన్ వర్గాలు ఆందోళనలు చేసినప్పుడు వారి లక్ష్యాలు ఏమైనప్పటికీ వారు ప్రస్తావించే విషయాలకు తెదేపా దూరంగా వుండాలి.  విద్వేషాలను  ప్రోత్సహించే ప్రాంతీయ సంఘటనల పై పార్టీ వాదులు ఎవరూ ప్రకటనలు యివ్వకుండా చూసినప్పుడే బాబు కలలు కన్న స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యపడుతుంది. 

No comments:

Post a Comment